ఢిల్లీ నిరసనల కేసులో సీజేపీ నేతలకు ఊరట..
ABN , Publish Date - Oct 21 , 2026 | 09:11 PM
ఏడు రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు భారీ ఊరట లభించింది. వారిని విడుదల చేయాలంటూ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏడు రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు భారీ ఊరట లభించింది. వారిని విడుదల చేయాలంటూ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) ఆదేశించారు. ఇటీవలే జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేపట్టినందుకు గానూ విధించిన జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టీతో ముగిసింది. దీంతో పోలీసులు వారిద్దరినీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. పూచీకత్తుపై విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.
జంతర్ మంతర్ వద్ద ధర్నాలను నిషేధిస్తూ కేంద్రం డీనోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వూలు విడుదలైన అనంతరం అక్టోబర్ 14న నిరసనలు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు నిరసనలు తెలిపేందుకు యత్నించారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అనంతరం కస్టడీని ఈ నెల 19న మరో రెండు రోజుల పాటు పొడిగించారు.
ఆ గడువు ఇవాళ్టితో (బుధవారం) ముగిసింది. దీనిపై సీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కస్టడీ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. అలా కుదరని పక్షంలో పైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే నేతలిద్దరూ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ని ఆశ్రయించగా.. బుధవారం సాయంత్రానికి ఊరట లభించింది.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు అనుమతివ్వని పీసీబీ
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి..