జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ.. పలు డిమాండ్లతో లేఖ
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:59 PM
ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు డిమాండ్లతో కూడిన లేఖను మంత్రికి అందజేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నీట్, ఇతర పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన ఓ లేఖను ఆయనకు అందజేశారు.
సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా సుమారు పది నిమిషాల పాటు నడ్డాతో భేటీ అయ్యారు. వారి డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వంలోని సంబంధిత స్థాయిలో చర్చిస్తానని నడ్డా హామీ ఇచ్చారని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీలు లభించలేదని, డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు.
జేపీ నడ్డాకు సమర్పించిన లేఖలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర విమర్శలు చేసింది సీజేపీ. నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీకేజీ సహా ఇతర పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలకు మంత్రి బాధ్యత వహించాలని పేర్కొంది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పోర్టల్ సమస్యలు, సీయూఈటీ పరీక్షల్లో జాప్యం వంటి పరిణామాలు వంటివి కూడా వైఫల్యాలేనని ఆరోపించింది. పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు చేపట్టడంలో ధర్మేంద్ర ప్రధాన్ విఫలమయ్యారని సీజేపీ పేర్కొంది.
ఇవీ చదవండి:
APAAR ఐడీ పూర్తి స్వచ్ఛందం.. నిరాకరిస్తే అడ్మిషన్లు ఆపొద్దు: సుప్రీంకోర్టు
రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు.. 56 ఏళ్ల యువకుడు అంటూ..