Share News

బీజేపీలో చేరాలని.. లేదంటే కుటుంబాన్ని చంపేస్తామంటూ..: దీప్కే

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:44 PM

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీలో చేరాలని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీలో చేరాలని.. లేదంటే కుటుంబాన్ని చంపేస్తామంటూ..: దీప్కే
Abhijit Deepke

ఇంటర్నెట్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరాలని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారాయన. కాషాయం పార్టీలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారన్నారు. అంతేకాకుండా.. తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ బెదిరింపులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు దీప్కే తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై ఇలా బెదిరింపులకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా పెల్లెట్ గన్స్ వినియోగంపై కూడా స్పందించారు దీప్కే. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్స్ ప్రయోగానికి సంబంధించిన విధానంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని కోరారు. ప్రస్తుతం.. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


ఇవీ చదవండి:

బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు.. లెక్కించడంలో 5 మెషీన్లు విఫలం

ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముట్టడి.. పంజాబ్ పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన

Updated Date - Jul 30 , 2026 | 03:48 PM