రాహుల్‌కు రాజకీయాలపై అవగాహన లేదు: సుధాన్షు త్రివేది
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:20 PM
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్‌కు రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది అన్నారు. కాంగ్రెస్ పతనానికి సోనియా, రాహుల్ గాంధీనే కారణమని ఆయన ఆరోపించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్‌కు రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది అన్నారు. కాంగ్రెస్ పతనానికి సోనియా, రాహుల్ గాంధీనే కారణమని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘంలో కమిషనర్ల విభేదాలపై ఎన్నికల అధికారులు ఎవరూ కూడా స్పందించలేదన్నారు. సర్ ప్రక్రియను నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని, సర్ ప్రక్రియను వద్దంటే దేశద్రోహానికి పాల్పడినట్లేనని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. ఆ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. అస్సాం, బెంగాల్‌లో సర్ ద్వారా ఓట్లు తొలగించారని నిజాలు తెలియకుండా రాహుల్ గాంధీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సుధాన్షు మండిపడ్డారు. రాహుల్, ఆయన చెల్లి ప్రియాంక గాంధీ వాద్రాకు సొంత రాష్ట్రంలో గెలిచే దమ్ము లేదని విమర్శించారు. అందుకే, వయనాడ్ లో ముస్లిం లీగ్ మద్దతుతో ఆ ఇద్దరూ గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో భారీ ఎత్తున్న రిగ్గింగ్, ఎన్నికల అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
కాగా.. ఓటర్ జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఉద్దేశించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఎన్నికల సంఘం, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై మొదటి నుంచీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సర్ ప్రక్రియ ద్వారా ఓట్లను చోరీ చేస్తున్నారని, అలా చేయడం భారత రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని ఆయన ఆరోపించారు. సామాన్యుల ఓటుహక్కును తొలగించేందుకే సర్ ప్రక్రియ చేపట్టారని ఈసీ, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గతంలో పలుమార్లు విమర్శలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..
ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్