Share News

బీజేపీ జీరో సీట్ పార్టీ.. యూడీఎఫ్‌దే గెలుపు: శశిథరూర్

ABN , Publish Date - Apr 05 , 2026 | 09:28 PM

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ప్రజలను కోరారు.

బీజేపీ జీరో సీట్ పార్టీ.. యూడీఎఫ్‌దే గెలుపు: శశిథరూర్
Shashi Tharoor

కోజికోడ్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ప్రజలను కోరారు. కోజికోడ్‌లో మీడియాతో ఆదివారంనాడు మాట్లాడుతూ, ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే ప్రధాన పోరు అని, అంతిమంగా యూడీఎఫ్ గెలుస్తుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ పాత్రపై అడిగినప్పుడు కేరళలో జీరో సీట్ పార్టీ బీజేపీ అని సమాధానమిచ్చారు.


'గల్ఫ్‌లో ఏదైనా జరిగితే సహజంగానే అది అందరిపై పడుతుంది. ఓటు వేసేందుకు వచ్చే చాలా మంది ఇక్కడకు రాలేకపోతారు. ఎన్ఆర్ఐ సంస్థలను ఈమధ్యనే కలిసాను. దాదాపు ఆ సంస్థలన్నీ యూడీఎఫ్‌కు సపోర్ట్ ఇస్తున్నాయి. విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు రాలేకపోవడం ఒక అంశమే అయినప్పటికీ నిర్ణయాత్మకం కాదన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈసారి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాం' అని శశిథరూర్ చెప్పారు.


ఈ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలపై అడిగినప్పుడు, బీజేపీ జీరో సీట్ల పార్టీ అని, జీరో నుంచి ఒకటి, రెండు లేదా మూడు సీట్లు రావచ్చని, అంతకు మించి మార్పేమీ ఉండదని చెప్పారు. అంతిమంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే పోటీ ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా యూడీఎఫ్‌కు వేయాలని ప్రజలను తాము కోరుతున్నట్టు తెలిపారు. కాగా, 140 మంది సభ్యుల కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

సీఎం భార్యకు మూడు పాస్‌పోర్ట్‌లు... స్పందించిన హిమంత్ బిశ్వా శర్మ

ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరు ఇది: స్టాలిన్

Updated Date - Apr 05 , 2026 | 09:30 PM