Share News

ఆయనను జైలుకు పంపుతాం: అసోం సీఎంపై రాహుల్ ధ్వజం

ABN , Publish Date - Apr 05 , 2026 | 03:58 PM

అస్సాం ముఖ్యమంత్ర హిమంత బిశ్వా శర్మపై కాంగ్రెస్ సీనిర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అత్యంత అవినీతిపరుడని, విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న ముఖ్యమంత్రి అని అన్నారు.

ఆయనను జైలుకు పంపుతాం: అసోం సీఎంపై రాహుల్ ధ్వజం
Rahul Gandhi

గువాహటి: అస్సాం ముఖ్యమంత్ర హిమంత బిశ్వా శర్మ (Himanta Biswa Sarma)పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అత్యంత అవినీతిపరుడని, విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న ముఖ్యమంత్రి అని ఆరోపించారు. తమ పార్టీ బబ్బర్ షేర్‌లు ఆయనను జైలుకు పంపుతారనే విషయం సీఎంకు తెలుసునని పేర్కొన్నారు. అస్సాంలోని బిశ్వనాథ్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, తమ పార్టీ అస్సాంలోని ఆరు కమ్యూనిటీలకు ఎస్సీ/ఎస్టీ హోదా కల్పిస్తుందని హామీ ఇచ్చారు.


మేము చాలా స్పష్టంగా చెబుతున్నారు. అస్సాంలోని 6 కమ్యూనిటీలకు ఎస్సీ, ఎస్టీ హోదా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. టీ కార్మికులకు రోజుకు రూ.450 వేతనం ఇస్తాం. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తక్కువ సమయంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆరు ప్రధాన నిర్ణయాలు అమలు చేస్తాం. ప్రతి మహిళకు ఎలాంటి షరతులు లేకుండా వారి అకౌంట్లలోకి నెలవారీ ఆర్థిక సాయం జమచేస్తాం. వ్యాపారం చేసుకోవాలనుకుంటే రూ.50,000 ఇస్తాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జుబీన్ గార్క్ కేసులో నిందితులపై చర్యలు తీసుకుంటాం' అని రాహుల్ చెప్పారు.


ఢిల్లీ కంట్రోల్‌‌లోనే అస్సాం పాలన సాగుతోందని రాహుల్ విమర్శించారు. నరేంద్ర మోదీని ట్రంప్ నియంత్రిస్తుంటే, మోదీ, అమిత్‌షా కలిసి అసోం సీఎంను నియంత్రిస్తున్నారని, ఢిల్లీ నుంచే పాలన సాగిస్తున్నారని అన్నారు. హిమంత బిశ్వ శర్మ పెద్ద తప్పు చేశారని, ఆయన కుటుంబ సభ్యులను కూడా అవినీతిలో దింపారని అన్నారు. దీనిపై తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. అస్సాం ప్రజల ఐక్యతకు జుబీన్ గార్క్ జీవితాంతం పాటుపడ్డారని, ఎవరితోనే ఆయన అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పారు. హిమంత క్షమాపణలు చెప్పినప్పటికీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను విడిచిపెట్టేది లేదని అన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

అస్సాం, బెంగాల్‌లో బీజేపీదే గెలుపు.. గడ్కరి ధీమా

దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాలు తగ్గవ్‌

Updated Date - Apr 05 , 2026 | 03:59 PM