మోసం చేయాలనుకుని దొరికిపోయిన క్యాబ్ డ్రైవర్..
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:00 PM
ఫేక్ చార్జీల స్క్రీన్ షాట్ ఉపయోగించి ప్యాసింజర్‌ను మోసం చేయాలనుకుని దొరికిపోయాడు ఓ కంపెనీ క్యాబ్ డ్రైవర్. ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. తనకు ఎదురైన అనుభవం గురించి సదరు ప్యాసింజర్ సోషల్ మీడియాలో వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫేక్ చార్జీల స్క్రీన్ షాట్ ఉపయోగించి ప్యాసింజర్‌ను మోసం చేయాలనుకుని దొరికిపోయాడు ఓ కంపెనీ క్యాబ్ డ్రైవర్. ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. తనకు ఎదురైన అనుభవం గురించి సదరు ప్యాసింజర్ సోషల్ మీడియాలో వివరించారు. ఆ ప్యాసింజర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆ ప్రయాణికుడు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యస్థానానికి చేరుకున్నాక చార్జీలు డబ్బుతో చెల్లిస్తారా లేక ఆన్‌లైన్‌లోనా అని డ్రైవర్ అడిగాడు. అయితే, గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా డ్రైవర్ ఆ రైడ్‌ను తన యాప్‌లో ముగించలేదు. అంతేకాకుండా తన ఫోన్‌లో ఫేక్ స్క్రీన్ షాట్ చూపించి రైడ్ రూ.1780 అయిందని చెప్పాడు.
వాస్తవానికి ప్రయాణికుడి యాప్‌లో చార్జీ రూ.885గా ఉంది. దీనిపై డ్రైవర్‌ను అడగగా.. ‘ముందుగా మీరు చార్జీ చెల్లించండి. అదనంగా అయిన చార్జీకి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తీసుకోండి’ అని సలహా ఇచ్చాడు. కానీ తన యాప్‌లో రూ.885 మాత్రమే చూపుతోందని, రైడ్ కూడా యాక్టివ్‌గానే ఉందని ఆ ప్రయాణికుడు చెప్పగా డ్రైవర్ వినలేదు. దీంతో ప్రయాణికుడు ఆ కంపెనీ సపోర్ట్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. యాప్ మూసి మళ్లీ తెరవాలని డ్రైవర్‌కు సపోర్ట్ స్టాఫ్ చెప్పారు. అతను అలాగే చేశాడు. వాస్తవానికి ప్రయాణికుడికి తాను చూపింది ఫేక్ చార్జీ స్ర్కీన్‌షాట్ అని తెలుసు. అప్పటికే తన బండారం బయటపడడంతో డ్రైవర్ మారు మాట్లాడకుండా రెండు నిమిషాల్లోనే రైడ్ పూర్తిచేశాడు. ‘విమానాశ్రయాల్లో ఉబెర్ డ్రైవర్లు చేసే ఇలాంటి స్కామ్‌లతో జాగ్రత్తగా ఉండండి’ అని ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో సూచించాడు.
ఇవి కూడా చదవండి..
అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..