సుప్రీంకోర్టు పత్రాల ఫోర్జరీతో ఖైదీ విడుదల.. అధికారి అరెస్టు
ABN , Publish Date - Oct 06 , 2026 | 09:39 AM
బెంగళూరులో జైళ్ల శాఖ డీఐజీగా పనిచేస్తున్న శ్రీసోమశేఖర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఖైదీ భార్య చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. సోమశేఖర్ గతంలో బెంగళూరు సెంట్రల్ జైల్లో చీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆ టైంలో శంకర్ అనే వ్యక్తి ఒక కేసులో దోషిగా తేలి జైల్లో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: బెంగళూరులో జైళ్ల శాఖ డీఐజీగా పనిచేస్తున్న శ్రీసోమశేఖర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఖైదీ భార్య చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సోమశేఖర్ గతంలో బెంగళూరు సెంట్రల్ జైల్లో చీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆ టైంలో శంకర్ అనే వ్యక్తి ఒక కేసులో దోషిగా తేలి జైల్లో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. చిక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై నమోదైన కేసు ఆధారంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2004లో శంకర్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది. దీంతో అప్పటి నుంచి శంకర్.. బెంగళూరులోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఈ క్రమంలో శంకర్ భార్యతో సోమశేఖర్‌కు పరిచయం ఏర్పడింది. తనకు సహకరిస్తే శంకర్ విడుదలయ్యేలా చూస్తానని సోమశేఖర్ ఆమెకు చెప్పారు. తర్వాత పలుమార్లు ఆయన తనను లైంగికంగా దోపిడీ చేశాడని శంకర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, 2018లో సుప్రీంకోర్టు కాపీని బెంగళూరు సెంట్రల్ జైల్ మాజీ ఎస్డీఏ ఎస్.శ్రీకాంత్‌తో కలిసి సోమశేఖర్ ఫోర్జరీ చేసి శంకర్‌ను విడుదల చేయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
సుప్రీంకోర్టు కాపీని వారు ఫోర్జరీ చేయడంతో 2018 నవంబరు 13న శంకర్.. బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. శంకర్ విడుదలలో సోమశేఖర్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే, శంకర్ విడుదల కోసం అతని భార్యపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణల మీదా దర్యాప్తు చేస్తున్నారు. సోమశేఖర్‌ను పరప్పన అగ్రహార పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆయనను పోలీసు కస్టడీకి తరలించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌదీ రక్షణకు తుర్కియే, పాకిస్థాన్ బలగాలు..
వాళ్ల దగ్గర భారీగా అణ్వాయుధాలున్నాయి..
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..