ఆర్జీ కర్ హత్యాచారం కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
ABN , Publish Date - May 15 , 2026 | 05:16 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య కేసులో విధినిర్వహణల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య (RG Kar rape-murder) కేసులో విధినిర్వహణల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikar) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వీరిలో అప్పటి కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్, అభిషేక్ గుప్తా, మనోజ్ మఖోపాధ్యాయ్ ఉన్నారు.
ఆర్జీ కర్ హత్యాచారం కేసు
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్‌లోని 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటన సంచలనమైంది. వైద్యులు, విద్యార్థులు, పౌర సమాజం నిరనసలకు దిగారు. ఈ ఘటనలో నిందితులను శిక్షించి న్యాయం చేయాలని, పనిప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఆసుపత్రి అధికారులు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. సాక్ష్యాలను తారుమారు చేయడం, పోలీసు చర్యలో జరుగుతున్న జ్యాపం, సంస్థాగతమైన నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ చేపట్టింది. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఈ ఘటనను బీజేపీ ప్రధానంగా ప్రస్తావించింది. ఆర్జీ కర్ బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. బాధితురాలి తల్లికి రత్న దేబ్‌నాథ్‌కు పానిహతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ కూడా ఇచ్చింది. ఆ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి తీర్ధంకర్ ఘోష్‌పై రత్న దేబ్‌నాథ్ 28,836 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
ఇవి కూడా చదవండి..
నందిగ్రామ్ సీటుకు సీఎం సువేందు రాజీనామా
నీట్ విద్యార్థి రితిక్ ఆత్మహత్యకు బాధ్యులెవరు?: ప్రియాంక గాంధీ