విజయ్ పోస్టర్ ముందు ఫోజులిచ్చిన త్రిష... వీడియో వైరల్
ABN , Publish Date - May 15 , 2026 | 03:24 PM
సూర్య హీరోగా నటించిన కరుప్పు చిత్రం తొలిరోజు తొలి ప్రదర్శనను సూర్య సోదరుడు కార్తితో కలిసి చెన్నైలోని ఓ థియేటర్‌లో త్రిష చూశారు. అనంతరం సెక్యూరిటీతో థియేటర్ నుంచి బయటకు వచ్చారు. అయితే అభిమానులతో ఆమె సంభాషించనప్పటికీ థియేటర్ బయట ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే యాదృచ్ఛికంగా ఆమె వెనుకనే దళపతి విజయ్ భారీ పోస్టర్ ఉంది.
చెన్నై: త్రిష కృష్ణన్ నటించిన తాజా చిత్రం 'కరుప్పు' (Karuppu) సక్సెస్ టాక్ నమోదు చేసుకుంది. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తొలిరోజు, తొలి ప్రదర్శనను సూర్య సోదరుడు కార్తితో కలిసి చెన్నైలోని ఓ థియేటర్‌లో త్రిష చూశారు. అనంతరం సెక్యూరిటీతో థియేటర్ నుంచి బయటకు వచ్చారు. అయితే అభిమానులతో ఆమె సంభాషించనప్పటికీ థియేటర్ బయట ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే యాదృచ్ఛికంగా ఆమె వెనుకనే దళపతి విజయ్ భారీ పోస్టర్ ఉంది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది యాదృచ్ఛికమే అయినా అతికినట్టుగా సరిపోయిందని నెటిజన్లు వరుస కామెంట్లు చేస్తున్నారు.
విజయ్‌కు ప్రత్యేక టైటిల్ కార్డు
'కరుప్పు' సినిమా ప్రారంభంలో దళపతి విజయ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక టైటిల్ కార్డు వేశారు. విజయ్ పేరు వెండితెరపై కనిపించగానే థియేటర్‌లో అభిమానులు విజిల్స్ వేస్తూ సందడి చేశారు.
సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆర్‌కే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్గింగ్ షోలకు విజయ్ పర్మిషన్ ఇచ్చారు. ఇందుకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా రాహుల్ విదేశీ పర్యటనలు.. కిరణ్ రిజిజు
21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయాలపై నిషేధం