21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయాలపై నిషేధం
ABN , Publish Date - May 15 , 2026 | 04:21 AM
తమిళనాట 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించరాదని ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విజయ్ ప్రభుత్వం నిర్ణయం
చెన్నై, మే 14 (ఆంధ్రజ్యోతి): తమిళనాట 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించరాదని ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్’ (టాస్మాక్) సంస్థ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు చేపడతామని ఆ సంస్థ హెచ్చరించింది. మద్యం కొనుగోలుకు వచ్చే వారి వయసులో తేడా అనిపిస్తే వారి ఆధార్ కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించి మద్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.