Share News

నందిగ్రామ్ సీటుకు సీఎం సువేందు రాజీనామా

ABN , Publish Date - May 15 , 2026 | 04:45 PM

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లలో గెలిచిన ఆయన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారంనాడు రాజీనామా చేశారు. గెలిచిన మరో నియోజకవర్గం భవానీపూర్‌ను తనవద్దే ఉంచుకున్నారు.

నందిగ్రామ్ సీటుకు సీఎం సువేందు రాజీనామా
Suvendu Adhikari

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లలో గెలిచిన ఆయన నందిగ్రామ్ అసెంబ్లీ సీటుకు శుక్రవారంనాడు రాజీనామా చేశారు. గెలిచిన మరో నియోజకవర్గం భవానీపూర్‌ను తనవద్దే ఉంచుకున్నారు.


నందిగ్రామ్ నియోజకవర్గానికి చేసిన రాజీనామాను స్పీకర్ రతీంద్ర బోస్‌కు సువేందు అందజేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎవరైనా రెండు నియోజకవర్గాల్లో గెలిచినప్పటికీ ఒక నియోజకవర్గాన్ని14 రోజుల లోపు వదులుకోవాల్సి ఉంటుంది. పూర్వ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్, సౌత్ కోల్‌కతాలోని భవానీపూర్ నుంచి ఇటీవల సువేందు పోటీ చేశారు.


నందిగ్రామ్ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థిగా పబిత్ర కర్ పోటీ చేశారు. ఆయనపై సువేందు 9,655 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేశారు. అయితే సువేందు చేతిలో 15,105 ఓట్ల తేడాతో ఆమె ఓడిపాయారు.


నందిగ్రామ్‌నూ అభివృద్ధి చేస్తా

నందిగ్రామ్ సీటుకు రాజీనామాచేసిన అనంతరం సువేందు మాట్లాడుతూ, భవానీపూర్ నుంచి తాను ప్రమాణస్వీకారం చేశారని, నిబంధనల ప్రకారం ఒక సీటును వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. నందిగ్రామ్ నియోజకవర్గం అభివృద్ధిని కొనసాగిస్తానని, నియోజకవర్గానికి తాను దూరమయ్యాయని ప్రజలు అనుకోవద్దని అన్నారు. ఫిరోజా బీబీ సమయం నుంచి కూడా తాను ఆ నియోజకవర్గం కోసం పాటుపడుతున్నట్టు చెప్పారు.


పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా రాహుల్ విదేశీ పర్యటనలు.. కిరణ్ రిజిజు

జయ్ పోస్టర్ ముందు ఫోజులిచ్చిన త్రిష... వీడియో వైరల్

Updated Date - May 15 , 2026 | 05:16 PM