అయోధ్య రామాలయ ట్రస్ట్ సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
ABN , Publish Date - Sep 02 , 2026 | 04:49 PM
అయోధ్య రామాలయ ట్రస్ట్ సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఈ మేరకు జన్మభూమి ట్రస్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
అయోధ్య, సెప్టెంబరు 2: అయోధ్య రామాలయ ట్రస్ట్ సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఈ మేరకు జన్మభూమి ట్రస్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 5,585 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. 39 ఏళ్లపాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించిన జితేంద్ర మిశ్రాను ఆలయ ట్రస్ట్ సీఈఓగా నియమిస్తున్నట్టు ప్రకటించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో జన్మించిన మిశ్రా.. 1986లో ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశించారు. సుదీర్ఘ కాలం పాటు వైమానిక దళంలో పనిచేసి 2026 ఏప్రిల్లో రిటైరైయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో తన కృషికి గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్‌ను కూడా అందుకున్నారు. వీటితో పాటు విశిష్ట్ సేవా మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్స్‌ను పొందారు.
ట్రస్ట్‌లో ముగ్గురు కొత్త సభ్యులు..
రామాలయ ట్రస్ట్‌లో ముగ్గురు కొత్త సభ్యులను కూడా కమిటీ నియమించింది. మదన్ మోహన్ పాండే, మహేశ్ భగచంద్కా, నిర్మలా యాదవ్‌లను సభ్యులుగా ఎంపిక చేసింది. కొన్ని నెలల క్రితం అయోధ్య రామాలయ విరాళాల్లో దుర్వినియోగం జరిగిన విషయం తెలిసిందే. అందుకే ట్రస్ట్ ప్రక్షాళన దిశగా ఈ మేరకు మార్పలు అనివార్యమయ్యాయి. రాములోరి నిధులు కాజేసిన కేసులో ఎనిమిది మంది ఇప్పటికే అరెస్టయ్యారు. దీంతో అప్పటి జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా దేశంలో దుమారం రేగిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల పౌరసత్వం తప్పనిసరి.. అమెరికా మరో నిబంధన
చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చాడు.. షాకింగ్ వీడియో వైరల్