Share News

పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల పౌరసత్వం తప్పనిసరి.. అమెరికా మరో నిబంధన..

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:03 PM

ఇకపై అమెరికాలో పుట్టిన పిల్లలకు పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్‌ స్థితికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి రావచ్చు. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది

పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల పౌరసత్వం తప్పనిసరి.. అమెరికా మరో నిబంధన..
US child passport rule

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో పిల్లలకు పాస్‌పోర్ట్‌ జారీ చేసే నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై అమెరికాలో పుట్టిన పిల్లలకు పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్‌ స్థితికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి రావచ్చు. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది (US child passport rule).


ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌ కోసం తల్లిదండ్రులు ప్రధానంగా పిల్లలతో తమ సంబంధాన్ని నిరూపించడంతో పాటు ప్రభుత్వ జారీ చేసిన ఫొటో గుర్తింపు పత్రాలను సమర్పించాలి. దరఖాస్తులో తమ పౌరసత్వ స్థితిని కూడా తెలియజేయాలి. అయితే తల్లిదండ్రుల ఇమ్మిగ్రేషన్‌ స్థితికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ విధానం మారుతుంది (parents citizenship proof).


పిల్లల పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసే సమయంలో తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్‌ స్టేటస్‌కు సంబంధించిన ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా పౌరులైన తల్లిదండ్రులు చెల్లుబాటు అయ్యే యూఎస్ పాస్‌పోర్ట్‌ లేదా జనన ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాలను సమర్పించాల్సి రావచ్చు. అమెరికా పౌరులు కాని తల్లిదండ్రులు తమ చట్టబద్ధ ఇమ్మిగ్రేషన్‌ స్థితిని నిరూపించేందుకు ఐ-94 ఫారం లేదా గ్రీన్‌ కార్డ్‌ వంటి పత్రాలను ఇవ్వాల్సి రావచ్చు (US citizenship proof).


అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే విధానాన్ని పరిమితం చేయాలన్నది ట్రంప్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. కాగా, బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌ను పరిమితం చేసేందుకు ట్రంప్‌ గతంలో చేసిన ప్రయత్నానికి అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ ప్రభుత్వం బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌ను పరిమితం చేసే ప్రయత్నాలపై ఇప్పటికే పలు న్యాయపోరాటాలు జరుగుతున్నాయి. కొందరు న్యాయవాదులు ఫెడరల్‌ కోర్టులను ఆశ్రయించారు.


ఇవి కూడా చదవండి

ఆ వైపు వెళ్లవద్దు.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ జెలెన్‌స్కీ వార్నింగ్

సీఎస్కే కోచ్‌ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్

Updated Date - Sep 02 , 2026 | 04:13 PM