హిమంత బిశ్వ శర్మ భారీ విజయం
ABN , Publish Date - May 04 , 2026 | 06:00 PM
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. హిమంత సైతం తన సొంత నియోజకవర్గమైన జలుక్‌బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 89,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.
గువాహటి: అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. హిమంత సైతం తన సొంత నియోజకవర్గమైన జలుక్‌బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 89,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన బిదిష నియోగ్‌కు 31,951 ఓట్లు పోలయ్యాయి.
హిమంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2021 నుంచి అస్సాంలో బీజేపీకి కీలకనేతగా నిలిచారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను వ్యతిరేకించడం, ఆదివాసీ భూములను చొరబాటుదారుల నుంచి విముక్తి కలిగించడంతో ముఖ్యమంత్రిగా అన్ని ప్రధాన వర్గాలుగా చేరువయ్యారు. ముఖ్యంగా చికెన్‌నెక్ కారిడార్‌పై బంగ్లా ప్రకటనలు తిప్పికొట్టడం, బెలూచిస్థాన్ స్వాతంత్ర పోరాటానికి మద్దతుగా నిలవడం, అసాంలో వరద నివారణ చర్యలు తీసుకోవడం వంటి చర్యల ద్వారా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లా చొరబాట్లకు పూర్తి అడ్డుకట్ట వేస్తామని, ఎన్ఆర్‌సీని కచ్చితంగా అమలవుతుందని ఆయన చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది. ప్రధానమంత్రి మోదీ సైతం హిమంత్ బిశ్వ శర్మ ప్రచారానికి దన్నుగా నిలవడంతో అస్సాంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని మరోసారి సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మూడు రాష్ట్రాల్లో విజయం దిశగా బీజేపీ.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు..
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు