అశోక్ సింఘాల్ పోరాట ఫలమే భవ్య రామమందిరం: అమిత్ షా
ABN , Publish Date - Sep 27 , 2026 | 09:58 PM
విశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు దివంగత అశోక్ సింఘాల్ 100వ జయంతి ఉత్సవాలను ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 27: అయోధ్యలో నేడు భవ్య రామమందిర నిర్మాణం నెరవేరిందంటే అది అశోక్ సింఘాల్‌తో పాటు ఎందరో చేసిన త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితమేనని అమిత్ షా కొనియాడారు. ఆయన నిరంతరం దేశభక్తితో 16 గంటలు శ్రమించేవారని గుర్తుచేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ (VHP) మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, దివంగత అశోక్ సింఘాల్ 100వ జయంతి ఉత్సవాలను ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
అశోక్ సింఘాల్ శత జయంతి కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ్టి తన 138వ 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగంలో అశోక్ సింఘాల్ సేవలను స్మరించుకున్నారు. సింఘాల్ సమాజంలో ఉంటూనే ఒక రుషిలా జీవించారని, రామజన్మభూమి ఉద్యమానికి ఆయన ఇచ్చిన దిశానిర్దేశం, శక్తి వల్లే నేడు అయోధ్యలో రామాలయం సాకారమైందని మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఏవి పని చేయవు.. ఏవి పనిచేస్తాయంటే..
వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..