అహంకారాన్ని తుడిచిపెట్టేస్తాం.. యూపీ సీఎంకు అఖిలేష్ యాదవ్ కౌంటర్
ABN , Publish Date - Oct 10 , 2026 | 09:48 PM
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనకు విసిరిన ప్రతిసవాల్‌పై సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనకు విసిరిన ప్రతిసవాల్‌పై సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ అహంకారాన్ని త్వరలో తుడిచిపెట్టేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలని యోగి ఆదిత్యనాథ్‌కు రెండు రోజుల క్రితం అఖిలేష్ యాదవ్ సవాలు విసిరారు. ఆ సవాలును యోగి స్వీకరించారు. అయితే అఖిలేష్ కూడా తనతోపాటే అయోధ్య నుంచి పోటీ చేయాలని ప్రతిసవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎంకు అఖిలేష్ కౌంటర్ ఇచ్చారు.
‘ఒక పెను తుపాను రాబోతోంది. అది అయోధ్య రామాలయం విరాళాలు కాజేసినవారి అహంకారం అణచివేయబోతోంది’ అని అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విరాళాల దొంగలను ఓడించడానికి తాను అవసరం లేదని తన పార్టీలోని కార్యకర్తలు చాలని ఆయన చెప్పారు. అలాగే యోగి తరఫున ఉత్తర్‌ప్రదేశ్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదని ఆరోపించారు.
ఈ వార్తలూ చదవండి
అంత్యక్రియలకు విమానంలో తీసుకెళ్తాం.. దీప్కేకు ఢిల్లీ పోలీసుల ఆఫర్..!
వారిని విడుదల చేయకపోతే మళ్లీ నిరాహారదీక్ష.. కేంద్రానికి వాంగ్‌చుక్ హెచ్చరిక