ఎన్ని కుట్రలు జరిగినా కలిసే ఉంటాం.. కాంగ్రెస్తో విభేదాలపై అఖిలేష్ యాదవ్
ABN , Publish Date - Nov 27 , 2026 | 07:06 PM
సమాజ్వాది పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తేయన్న ఊహాగానాలను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. ఎన్ని కుట్రలు జరుగుతున్నా.. తమ పార్టీలు కలిసికట్టుగానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సమాజ్వాది పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తేయన్న ఊహాగానాలను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. ఎన్ని కుట్రలు జరుగుతున్నా.. తమ పార్టీలు కలిసికట్టుగానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అయితే 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఎస్పీ, కాంగ్రెస్ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని అఖిలేష్ తెలిపారు. చర్చల్లో పాల్గొని సీట్ల కేటాయింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. గెలుపోటములను దృష్టి పెట్టుకునే బరిలోకి దిగే అభ్యర్థులను ఎంచుకుంటామని చెప్పారు. ఈరోజు (శుక్రవారం) మీడియా సమావేశంలో పాల్గొన్న సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ఈ విషయాలను వెల్లడించారు.
‘సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఎస్పీ చర్చలో పాల్గొంటాయి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేయాలో చర్చిస్తాయి. ఎక్కడ ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలో నిర్ణయిస్తాయి’ అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. గెలిచే అవకాశాలున్న వారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆయన తేల్చిచెప్పారు. కాగా కాంగ్రెస్, ఎస్పీ నడుమ సీట్ల పంపకంపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మొదటి విడత చర్చల్లో పాల్గొన్న కాంగ్రెస్.. 181 సీట్లు కావాలని డిమాండ్ చేసింది. తరువాత తమకు 100 నుంచి 120 సీట్ల వరకు ఇస్తే చాలని చెప్పింది. మరోవైపు కాంగ్రెస్కు 26 సీట్లు ఇస్తామని ఎస్పీ ప్రతిపాదనలు చేసింది. ఇలా సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగాయి. త్వరలోనే సీట్ల కేటాయింపుపై స్పష్టతనిస్తామని అఖిలేష్ యాదవ్ చెబుతున్నారు. 2027లో ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నకలు జరగనున్నాయి.
ఈ వార్తలూ చదవండి
డీలిమిటేషన్ బిల్లు.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు మద్దతిస్తారా..
అలా అయితేనే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు.. డీఎంకే డిమాండ్