Share News

నటి సుభాషిణి ఆత్మహత్య.. పోలీసుల అదుపులో భర్త

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:21 PM

చెన్నై నగరంలోని పోరూరులో నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. తన అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఆమె ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నటి సుభాషిణి ఆత్మహత్య.. పోలీసుల అదుపులో భర్త

చెన్నై, ఏప్రిల్06: చెన్నై నగరంలోని పోరూరులో నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో సోమవారం ఆమె ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుభాషిణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ వివాదాలే ఈ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.


ఆత్మహత్యకు ముందు సుభాషిణి తన భర్తకు వీడియో కాల్‌ చేసినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం.. తన గదిలోకి వెళ్లి సుభాషిణి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. టీవీ సీరియల్‌తోపాటు పలు చిత్రాల్లో సుభాషిణి హీరోయిన్‌గా నటించారు. షూటింగ్‌ల కోసం సుభాషిణి చెన్నైలో ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. సుభాషిణి మృతిపై ఆమె భర్తకు సమాచారం అందించారు. అతడిని సైతం పోలీసులు విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గత పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

బంజారా నాయకులతో కల్వకుంట్ల కవిత భేటీ.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..

For More National News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 04:53 PM