Share News

బిగ్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:28 PM

ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

బిగ్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
Andhra Pradesh Weather Alert

అమరావతి, ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ సూచించారు.


తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షంతో పాటూ గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలుల తీవ్రత దృష్ట్యా పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్ట కింద, బోర్డింగ్స్ సమీపంలో ఉండటం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

'పక్కకు తప్పుకో'.. సంజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎస్కే ఫ్యాన్స్

ఐపీఎల్ 2026: భువనేశ్వర్‌ అరుదైన రికార్డు..

Updated Date - Apr 06 , 2026 | 12:31 PM