Share News

చెక్కులను రాధే నాకు ఇచ్చింది.. నేను దొంగిలించలేదు: నటి అంబిక

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:55 PM

దొంగతనం చేశానని సోదరి రాధ ఫిర్యాదు చేయడంపై నటి అంబిక స్పందించారు. సొంత సోదరి తనపై దొంగతనం కేసు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దొంగతనం చేయలేదని అంబిక స్పష్టం చేశారు.

చెక్కులను రాధే నాకు ఇచ్చింది.. నేను దొంగిలించలేదు: నటి అంబిక
actress ambica reacts on complaint filed by radha

ఇంటర్నెట్ డెస్క్: తన గదిలోకి వెళ్లి చెక్కులు దొంగతనం చేశానని రాధ ఫిర్యాదు చేయడం బాధ కలిగించిందని అంబిక అన్నారు. రూ.46 కోట్ల కోసం సొంత సోదరి దగ్గర దొంగతనం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాధకు తెలియకుండా తన గదిలోకి వెళ్లి దొంగతనం చేయడం ఎలా సాధ్యమవుతుందన్నారు. తాను చెక్కులను దొంగతనం చేయలేదని స్పష్టం చేశారు. ఆ చెక్కులను రాధే తనకు ఇచ్చిందని.. ఆ తర్వాత ఆమే పేమెంట్స్ బ్లాక్ చేశారని అంబిక పేర్కొన్నారు.


ఆస్తులు, వ్యాపారం, బంగారం అంశాలపై చాలాకాలంగా తమ మధ్య వివాదం కొనసాగుతోందని అంబిక వెల్లడించారు. బంగారు ఆభరణాల విషయంలోనూ.. తమ మధ్య వివాదం ఉందన్నారు. కొన్ని నగలు రాధ వద్దే ఉన్నాయని అంబిక ఆరోపించారు. ఈ వివాదాల నేపథ్యంలో గతంలోనే తాను అధికారులను ఆశ్రయించానని చెప్పారు. ఈ చెక్కులు దొంగతనం వివాదం వెనుక కూడా ఆస్తుల, వ్యాపార అంశాలున్నాయని అంబిక వెల్లడించారు.


కుటుంబ వివాదాలు మీడియా ముందుకు రావడం చాలా బాధ కలిగించిందని.. ఇకపై ఏ వివాదాన్ని మీడియా ముందుకు తీసుకురానని అంబిక తెలిపారు. ఈ వివాదాన్ని అధికారులకే వదిలేస్తున్నానని చెప్పారు. ఏఆర్ఎస్ గార్డెన్స్ పేరు మార్చడం తీవ్రంగా బాధించిందని ఆమె అన్నారు. కాగా.. చెక్కులు బౌన్స్ అవడంపై న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామని.. రాధ చేసిన ఫిర్యాదును న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని అంబిక తరఫు న్యాయవాది పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు

Updated Date - Sep 23 , 2026 | 04:59 PM