రాజస్థాన్ కోటాలో ఘోర ప్రమాదం.. ట్రక్కును కారు ఢీకొని 9 మంది మృతి..
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:19 AM
రాజస్థాన్‌లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై పార్కు చేసి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో 9 మంది చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై పార్కు చేసి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో 9 మంది చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు. మృతులందరికీ ఒకే కుటుంబం. శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కోటాలోని శంభూపుర గ్రామం వద్ద కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది తమ క్రూయిజ్ కారులో రాజస్థాన్‌లోని శిఖర్ జిల్లాకు వెళ్లారు. అక్కడ కటుశ్యామ్‌జీ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం శనివారం రాత్రి తిరిగి మహారాష్ట్రకు పయనమయ్యారు. ఈ క్రమంలో వారి వాహనం కోటా జిల్లాకు చేరుకుంది. అక్కడ శంభూపుర గ్రామం వద్ద రోడ్డుపై పార్కు చేసిన ట్రక్కును వెహికల్ బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కున్న బాధితులను బయటకు తీసి న్యూ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. కోటా ఎస్పీ తేజస్విని గౌతమ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారని కోటా జిల్లా అదనపు కలెక్టర్ రాజేష్ జోషి కన్ఫం చేశారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని ఆయన తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక