అదానీ డిఫెన్స్ ‘బఘీరా’ సామర్థ్యం ప్రదర్శన!
ABN , Publish Date - Nov 22 , 2026 | 08:00 AM
భారత రక్షణ రంగంలోని ప్రైవేటు పరిశ్రమైన అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థ తాను అభివృద్ధి చేసిన ‘బఘీరా ఏటీ1’ అనే యాంటీ ట్యాంక్ క్షిపణీ వ్యవస్థ సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించింది. భారత సైన్యం, రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో రాజస్థాన్‌లోని పోక్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ ఆయుధాన్ని శుక్రవారం ప్రయోగించింది.
8 కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ, నవంబరు 21: భారత రక్షణ రంగంలోని ప్రైవేటు పరిశ్రమైన అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థ తాను అభివృద్ధి చేసిన ‘బఘీరా ఏటీ1’ అనే యాంటీ ట్యాంక్ క్షిపణీ వ్యవస్థ సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించింది. భారత సైన్యం, రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో రాజస్థాన్‌లోని పోక్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ ఆయుధాన్ని శుక్రవారం ప్రయోగించింది. ఇందులో భాగంగా బఘీరా ఏటీ1 నుంచి నాలుగు క్షిపణులను విజయవంతంగా ప్రయోగించామని అదానీ సంస్థ ప్రకటించింది. ప్రత్యేకంగా తయారు చేసిన ఓ సాయుధ వాహనంపై ఈ క్షిపణి వ్యవస్థ అమర్చబడి ఉంటుంది. 8 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ వ్యవస్థలోని క్షిపణులు ఛేదిస్తాయని, భూమి మీద నుంచి ప్రయోగించే సంప్రదాయ యాంటీ ట్యాంక్ క్షిపణుల పరిధి కంటే ఇది రెట్టింపని అదానీ డిఫెన్స్ సంస్థ పేర్కొంది. రేడియో సిగ్నళ్ల ఆధారంగా కాకుండా లేజర్ కిరణాల ఆధారంగా క్షిపణులు ప్రయాణిస్తాయని తెలిపింది.