జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:56 AM
జమ్మూ కశ్మీర్ లడఖ్‌లోని లేహ్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.5గా నమోదు అయింది.
శ్రీనగర్, ఆగస్టు 13: జమ్మూ కశ్మీర్ లడఖ్‌లోని లేహ్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.5గా నమోదు అయింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగలేదని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. గురువారం ఉదయం 6 గంటలకు ఈ భూకంప వచ్చిందని వివరించింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. భూమి ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల లోతు వరకు ఎక్కడైనా భూకంపాలు సంభవించవచ్చని చెప్పింది. యూఎస్‌జీఎస్ డేటా ప్రకారం.. 0 - 700 కిలోమీటర్ల లోతు వరకు భూకంపాలు సంభవించవచ్చని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నీట్ పీజీ పరీక్ష కేంద్రాలపై గందరగోళం!
నిద్రమాత్రలు వాడిన ఎయిర్ ఇండియా పైలట్!
For National News And Telugu News