Share News

నిద్రమాత్రలు వాడిన ఎయిర్‌ ఇండియా పైలట్‌!

ABN , Publish Date - Aug 13 , 2026 | 06:31 AM

పుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తూ ఈ నెల 4న అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తు కోల్పోయిన ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌కి సంబంధించి...

నిద్రమాత్రలు వాడిన ఎయిర్‌ ఇండియా పైలట్‌!

  • ఇప్పటికే గంజాయి వాడినట్లు నిర్ధారణ

న్యూఢిల్లీ, ఆగస్టు 12: పుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తూ ఈ నెల 4న అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తు కోల్పోయిన ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌కి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. అతడికి నిద్ర లేమి సమస్య ఉండడంతో మాత్రలు వాడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ పైలట్‌కి రెండుసార్లు చేసిన డ్రగ్‌ టెస్ట్‌ల్లో మార్జువానా వాడినట్లు నిర్ధారణ అయ్యింది. కాగా అతడు ఇచ్చిన ఫ్లైట్‌ సేఫ్టీ స్టేట్‌మెంట్‌లో.. తాను వ్యక్తిగత సమస్యల కారణంగా కొంత కాలంగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు. తమ కుటుంబ వైద్యుడి సూచన మేరకు అందుకు మందులు వాడుతున్నట్లు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో పైలట్‌ తన సీట్లో లేరని, విమానాన్ని కోపైలట్‌ నడుపుతున్నట్లు సమాచారం. అనంతరం పైలట్‌ గాయపడిన ప్రయాణికులను చూసేందుకు క్యాబిన్‌లోకి వచ్చి...విమానాన్ని, తనను వీడియోలు తీయవద్దని కోరారని తెలిసింది.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 06:31 AM