ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
ABN , Publish Date - May 12 , 2026 | 12:58 PM
కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
బెంగళూరు, మే 12: కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఢీ కొట్టింది. అనంతరం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బీదర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు సంగారెడ్డి జిల్లా వాసులు ఉన్నారని పోలీసులు వివరించారు.
బీదర్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియాతో భేటీ కానున్న కేరళ నేతలు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై చర్చ
లిక్కర్ షాపుల్లో భారీ కుంభకోణం.. రంగంలోకి ఐటీ అధికారులు
For More National News And Telugu News