-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Live Updates of 6th June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 06 , 2026 | 06:41 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 06, 2026 21:11 IST
హైదరాబాద్: గచ్చిబౌలిలో యువతి ఆత్మహత్య
హాస్టల్ ఐదో అంతస్తు నుంచి దూకి యువతి దుర్గ (23) ఆత్మహత్య
తీవ్రగాయాలపాలైన యువతి, ఆస్పత్రికి తరలించేలోపు మృతి
పోలీసుల అదుపులో నిందితుడు సాయికుమార్
-
Jun 06, 2026 20:33 IST
చేతకాకపోతే దిగిపొమ్మంటున్నారు.. మేం అల్లాటప్పాగా రాలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంగతి చెప్తాం: సీఎం రేవంత్ రెడ్డి
మర్యాద తప్పితే.. పొలిమేరలు కూడా దాటనివ్వం..
ప్రధాని మోదీని చూపి భయపెట్టాలనుకుంటే.. ఇక్కడెవరూ భయపడేవారు లేరు..
ఈ నెల 15 తర్వాత వడ్లు కొనకపోతే మీ సంగతి చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
Jun 06, 2026 20:32 IST
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
భూముల ధరలు బాగా పెరిగాయి: సీఎం రేవంత్ రెడ్డి
రియల్ ఎస్టేట్ పెరగడంతో వ్యవసాయం కుంటుపడింది..
హైదరాబాద్‌లో 1.34 కోట్ల మంది నివసిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Jun 06, 2026 20:31 IST
న్యూయార్క్‌లో తెలుగు యువకుడి హత్య
పిజ్జా డెలివరీ చేస్తుండగా తుపాకీతో కాల్చిచంపిన దుండగులు
మృతుడు మేడ్చల్ మల్చాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్‌గా గుర్తింపు
-
Jun 06, 2026 19:33 IST
సీఎం చంద్రబాబును కలిసిన జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్
సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన లింగమనేని రమేష్
తన అభ్యర్థిత్వానికి సహకరించిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన లింగమనేని
-
Jun 06, 2026 19:32 IST
రష్యాలో యాండెక్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ
అమరావతి, విశాఖలో ప్రిడిక్టివ్ ట్రాన్సిట్ షెడ్యూలింగ్ అమలుపై మంత్రి లోకేష్ చర్చ
పబ్లిక్ సేఫ్టీ అనలిటిక్స్, Ai ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్స్‌పై ప్రత్యేక దృష్టి
-
Jun 06, 2026 19:30 IST
బొగ్గు నిల్వలపై తెలంగాణ సింగరేణి సంస్థ ప్రకటన
సింగరేణిలో ప్రస్తుతం 26.51 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు
పదేళ్లలో ఇదే అత్యల్ప బొగ్గు స్టాక్: సింగరేణి సంస్థ
2014–2024 మధ్య సగటు బొగ్గు నిల్వలు 50 లక్షల టన్నులు
-
Jun 06, 2026 19:02 IST
రంగారెడ్డి: కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి
ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు శంకుస్థాపన
రూ.2,284 కోట్లతో 239 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం
-
Jun 06, 2026 19:01 IST
కామారెడ్డి: బిచ్కుంద మండలం పత్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం
హైవేపై రెండు బైకుల ఢీ.. రమేష్(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 06, 2026 18:46 IST
విశాఖ: భీమిలి NRI మెడికల్ కాలేజ్ స్నాతకోత్సవం
స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా గవర్నర్ అబ్దుల్ నజీర్
188 మంది మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
-
Jun 06, 2026 18:45 IST
విజయవాడ: ఉగ్రలింకుల కేసు నిందితులకు NIA కస్టడీ
విశాఖలో 13 మంది నిందితులను ప్రశ్నించనున్న NIA
ఈనెల 8 నుంచి 12 వరకు నిందితులను ప్రశ్నించనున్న NIA
-
Jun 06, 2026 18:18 IST
రంగారెడ్డి: కోహెడ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
కాసేపట్లో ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు శంకుస్థాపన
రూ.2,284 కోట్లతో 239 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం
-
Jun 06, 2026 17:56 IST
అమరావతి: రేపు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటన
పులివెందుల బ్రాంచ్ కెనాల్‌ను సందర్శించనున్న పవన్ కళ్యాణ్
-
Jun 06, 2026 17:44 IST
RS ప్రవీణ్ ఇంగితం మరిచి సీఎంపై విమర్శలు చేస్తున్నారు: ఎమ్మెల్సీ అద్దంకి
సీఎం రేవంత్.. 3 వాహనాల కాన్వాయ్‌నే వినియోగిస్తున్నారు: అద్దంకి
సీఎం సామాన్యుడిలా ప్రయాణిస్తున్నారు: అద్దంకి
కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వానికి సరిపోతోంది
తెలంగాణను అప్పులకుప్పగా మార్చి దిగిపోయారు: MLC అద్దంకి
-
Jun 06, 2026 17:42 IST
వైసీపీ మాజీ MLA బొల్లా బ్రహ్మనాయుడికి రిమాండ్
14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పరపల్లి కోర్టు
చంచల్‌గూడ జైలుకు బ్రహ్మనాయుడు తరలింపు
గండిపేట భూ కబ్జా కేసులో అరెస్టయిన బ్రహ్మనాయుడు
-
Jun 06, 2026 17:17 IST
చండీగఢ్ టెస్ట్: ముగిసిన తొలిరోజు ఆట
భారత్ స్కోర్- 368/3
క్రీజులో శుభ్‌మన్ గిల్(103), రిషభ్ పంత్(50)
కేఎల్ రాహుల్ 100, సాయి సుదర్శన్ 81 పరుగులు
అఫ్గానిస్థాన్ బౌలింగ్: సలీమ్ 2, షరీఫ్‌కు 1 వికెట్
-
Jun 06, 2026 17:16 IST
హైదరాబాద్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్‌కు మాతృ వియోగం
శంకర్‌గౌడ్ తల్లి భారతమ్మ పార్థివదేహానికి పవన్ నివాళులు
-
Jun 06, 2026 17:13 IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
ఖైరతాబాద్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌లో వర్షం
పలుచోట్ల ట్రాఫిక్ జామ్, వాహనదారుల ఇబ్బందులు
మరికొన్ని గంటలపాటు వర్ష సూచన: వాతావరణశాఖ
-
Jun 06, 2026 16:22 IST
హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి చర్చి గాగిల్లాపూర్‌లో దారుణ హత్య
అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను చంపిన భర్త
నిద్రిస్తున్న భార్యను (38) గొడ్డలితో తలపై మోది హత్య చేసిన భర్త సంతోష్
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
-
Jun 06, 2026 15:59 IST
హైదరాబాద్: నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతాల్లో ఈగల్ ఫోర్స్ దాడులు
గంజాయి బ్యాచ్ తిరుగుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు
ఆకస్మిక దాడులు నిర్వహించి, పరీక్షలు నిర్వహించిన ఈగల్ పోలీసులు
ఐదుగురికి పాజిటివ్.. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలింపు
-
Jun 06, 2026 15:47 IST
టీ20 కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తొలి స్పందన
కొత్త జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన స్కై
సవాళ్లకు సిద్ధంగా ఉండాలని ఆటగాళ్లకు సూచన
టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ
నిర్ణయంపై హుందాగా స్పందించిన సూర్యకుమార్ యాదవ్
కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌కు అభినందనలు: సూర్యకుమార్ యాదవ్
-
Jun 06, 2026 15:40 IST
UPSC ఆధారంగా TGPSCలో మార్పులు అమలు: సీఎం రేవంత్ రెడ్డి
15 నెలల్లో 67వేల ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్ రెడ్డి
త్వరలో 5వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్: సీఎం రేవంత్
దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే రైతు రుణమాఫీ అమలు: సీఎం రేవంత్ రెడ్డి
-
Jun 06, 2026 15:38 IST
ఢిల్లీ: రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భేటీ
కేబినెట్‌లో చోటు కల్పించాలని కోరిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ను కలుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
Jun 06, 2026 15:30 IST
మిర్యాలగూడలో వృద్ధ దంపతులకు అండగా కలెక్టర్ చంద్రశేఖర్
కన్నవారిని ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్న కుమారుడు
వయోవృద్ధుల చట్టం-2007 ప్రకారం ఇల్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటిని వృద్ధ దంపతులకు అప్పగించిన అధికారులు
-
Jun 06, 2026 15:29 IST
అఫ్గాన్‌తో టెస్ట్ మ్యాచ్.. కేఎల్ రాహుల్ ఔట్
సెంచరీతో చెలరేగిన ఓపెనర్ (165 బంతుల్లో 100; 11 ఫోర్లు)
శతకం అనంతరం జియావురు రెహ్మాన్ బౌలింగ్‌లో వెనుదిరిగిన రాహుల్
ప్రస్తుతం భారత్ స్కోర్ 249-3 (61 ఓవర్లలో)
-
Jun 06, 2026 15:02 IST
అమరావతి: మంచివారికి మంచివాళ్లే తోడవుతారు: సీఎం చంద్రబాబు
చెడ్డవాళ్ల చుట్టూ గొడ్డలి బ్యాచ్ జత అవుతుంది: చంద్రబాబు
ఇకపై పార్టీకి ఓటమిలేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం: చంద్రబాబు
పార్టీ పదవుల నుంచి టికెట్ల కేటాయింపుల వరకు సర్వేలు: సీఎం చంద్రబాబు
క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో సీఎం చంద్రబాబు
-
Jun 06, 2026 15:00 IST
టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 209/2
రెండో సెషన్‌లో దూకుడుగా ఆడిన భారత బ్యాటర్లు
క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (81), శుభ్‌మన్ గిల్ (20*)
అంతకుముందు సాయి సుదర్శన్ 81 పరుగుల వద్ద ఔట్
సెంచరీని చేజార్చుకున్న సాయి సుదర్శన్
తొలి రోజు ఆటపై భారత్ ఆధిపత్యం కొనసాగింపు
-
Jun 06, 2026 14:33 IST
కామారెడ్డి: బిక్కనూర్ మండలం బస్వాపూర్ వద్ద మాజీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా కారును ఢీకొట్టిన లారీ
డివైడర్‌పైకి దూసుకెళ్లి, 50 మీటర్ల మేర ఈడ్చుకుపోయిన మాజీ ఎమ్మెల్యే కారు
కారులో ఉన్న బిగాల గణేష్ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితం
-
Jun 06, 2026 13:51 IST
ఢిల్లీ: అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం
గాయం కారణంగా జట్టుకు దూరమైన కోహ్లీ
కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం
-
Jun 06, 2026 13:42 IST
ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు
రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తరిస్తున్న రుతుపవనాలు
-
Jun 06, 2026 13:41 IST
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
అతి చిన్న వయసులో భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన వైభవ్
-
Jun 06, 2026 13:33 IST
హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం
లిఫ్ట్ క్యాబిన్ రాకముందే తెరుచుకున్న గ్రిల్
లిఫ్ట్ వచ్చిందనుకుని మనవడితో లోపలకు అడుగు పెట్టిన మహిళ
లిఫ్ట్ గుంతలో పడి మహిళ మృతి, బాలుడికి తీవ్రగాయాలు
-
Jun 06, 2026 13:32 IST
సిద్దిపేట: సీఎంగా రేవంత్‌రెడ్డి విఫలం: హరీష్‌రావు
రైతు కనకయ్య మృతికి ప్రభుత్వమే కారణం: హరీష్ రావు
45 రోజుల నుంచి వడ్లు కొనుగోలు చేయడం లేదు: హరీష్‌రావు
కోతలు లేకుండా రైతుల నుంచి వడ్లు కొనడం లేదు: హరీష్‌రావు
తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారు: హరీష్‌రావు
కనకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: హరీష్‌రావు
-
Jun 06, 2026 13:31 IST
హైదరాబాద్: అమీర్‌పేటలో మరోసారి అగ్నిప్రమాదం
కమర్షియల్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
-
Jun 06, 2026 13:30 IST
ఎన్టీఆర్ జిల్లా: ఆర్టీసీ బస్సులో మంటలు
అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్
ప్రయాణికులందరూ సమయానికి బస్సు దిగడంతో తప్పిన ప్రమాదం
ఆర్టీసీ బస్సు జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన
-
Jun 06, 2026 13:26 IST
ఇంగ్లండ్, ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
సూర్యకుమార్ యాదవ్‌కు ఉద్వాసన
వైభవ్ సూర్యవంశీ, నితీష్, సిరాజ్‌కు చోటు
-
Jun 06, 2026 13:26 IST
నీట్ పరీక్ష రద్దు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: మహేష్ గౌడ్
కేంద్రమంత్రి ధర్మేంద్ర వెంటనే రాజీనామా చేయాలి: మహేష్ గౌడ్
నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: మహేష్ గౌడ్
విద్య, వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మహేష్ గౌడ్
-
Jun 06, 2026 13:00 IST
అభివృద్ధి చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కావాలనే కోహెడ మార్కెట్ భూములపై వివాదాలు సృష్టిస్తున్నారు: మంత్రి తుమ్మల
రైతులకు పరిహారం చెల్లించే భూములు సేకరించాం: మంత్రి తుమ్మల
3 దశల్లో మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తాం: ABNతో మంత్రి తుమ్మల
-
Jun 06, 2026 12:40 IST
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్
ఏపీ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసిన లింగమనేని రమేష్
నామినేషన్‌పై సంతకాలు చేసిన 10 మంది కూటమి ఎమ్మెల్యేలు
-
Jun 06, 2026 12:30 IST
హైదరాబాద్: బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి PDSU యత్నం
మంత్రి తుమ్మల కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు
నిరసనకారులను అడ్డుకుని పీఎస్‌కు తరలించిన పోలీసులు
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని PDSU డిమాండ్
-
Jun 06, 2026 12:19 IST
హైదరాబాద్: జవహర్‌నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
వృద్ధ దంపతులను టార్గెట్ చేసి పనిలో చేరిన నేపాలీ ముఠా
2 గ్రూపులుగా విడిపోయి వాటాలు పంచుకున్న దొంగలు
దొంగలు నేపాల్‌కు పారిపోతుండగా సరిహద్దుల్లో అరెస్ట్
60 తులాల బంగారం, 15 కిలోల వెండి, 3వేల అమెరికన్ డాలర్ల స్వాధీనం
నిందితులపై 2023లో మొయినాబాద్‌లో కేసులు ఉన్నట్టు గుర్తింపు
-
Jun 06, 2026 12:17 IST
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు
కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం
-
Jun 06, 2026 12:15 IST
హైదరాబాద్: తెలంగాణ ప్రజల జాగీర్.. పవన్ జాగీర్ కాదు: కవిత
ఆంధ్రా విష కోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నాం: కవిత
ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోం: కవిత
-
Jun 06, 2026 11:51 IST
విజయవాడ: సింగపూర్ వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వేపై నిలిచిపోయిన విమానం
133 మందితో సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం
ఎయిర్‌పోర్టులో పడిగాపులుకాస్తున్న ప్రయాణికులు
-
Jun 06, 2026 11:32 IST
సీఎం రేవంత్‌రెడ్డిపై TRS చీఫ్ కవిత విమర్శలు
రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ సర్కార్ పెద్దలకు అప్పగిస్తోంది: కవిత
సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలో ఉన్నారు: కవిత
-
Jun 06, 2026 11:32 IST
కడప: రైజింగ్ రాయలసీమ సదస్సు
పాల్గొన్న మంత్రులు సత్యకుమార్, టీజీ భరత్, బీజేపీ నేత మాధవ్
రామలసీమ అభివృద్ధి, పారిశ్రామిక వికాసం, పెట్టుబడులపై చర్చ
-
Jun 06, 2026 11:26 IST
డి.రామానాయుడు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
నిర్మాతగా రామానాయుడు ఎన్నో రికార్డులు సృష్టించారు
తెలుగువారి కళాసేవకు రామానాయుడు ప్రతీకగా నిలిచారు
సినీ పరిశ్రమకు రామానాయుడు సేవలు మరవలేనివి: సీఎం చంద్రబాబు
-
Jun 06, 2026 11:22 IST
నిజామాబాద్: ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థినికి లైంగిక వేధింపులు
హాస్టల్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థిని
కాంట్రాక్టు అధ్యాపకుడు గౌతమ్‌పై వేధింపుల కేసు నమోదు
విధుల నుంచి తొలగించిన కళాశాల ప్రిన్సిపాల్
-
Jun 06, 2026 11:14 IST
కరీంనగర్: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తప్పిన ప్రమాదం
కెమిస్ట్ భవన్ రెండో అంతస్తు నుంచి కిందికి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయిన లిఫ్ట్, తప్పిన ప్రమాదం
మాజీ ఎమ్మెల్యే మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో ఘటన
-
Jun 06, 2026 11:13 IST
మేడ్చల్: ఓఆర్ఆర్‌పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో
ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతుడు మనోహరాబాద్ మండలం కూచారం వాసి కిషోర్‌గా గుర్తింపు
-
Jun 06, 2026 10:56 IST
పంజాబ్: ఫిరోజ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
జీప్‌ను ఢీకొన్న ట్రక్కు, 9 మంది మృతి
15 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
ప్రమాద సమయంలో ట్రక్కులో 28 మంది ప్రయాణికులు
-
Jun 06, 2026 10:55 IST
మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష
అధికారులతో వర్చువల్‌గా సమావేశమైన పవన్ కల్యాణ్
-
Jun 06, 2026 10:42 IST
ఢిల్లీ: జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన
నీట్ పేపర్ లీక్, CBSC ఓఎస్ఎం వివాదంపై సీజేపీ నిరసన
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
ఇప్పటికే సీజేపీ ధర్నాకు ఢిల్లీ పోలీసుల అనుమతి
సా.5 గంటల వరకు సీజేపీ నిరసన కార్యక్రమం
కాక్రోచ్ మాస్కులతో నిరసనకు తరలివచ్చిన యువత
ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
-
Jun 06, 2026 10:41 IST
నాగ్‌పూర్‌లో భారీగా గంజాయి పట్టివేత
రూ.2.61కోట్ల విలువైన 522 కిలోల గంజాయి సీజ్
డ్రగ్ స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jun 06, 2026 10:40 IST
హైదరాబాద్: నార్సింగి పీఎస్‌కు వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు
నిన్న కాంచీపురంలో అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
కాంచీపురం నుంచి రోడ్డు మార్గంలో నార్సింగికి తరలింపు
బొల్లా బ్రహ్మనాయుడు స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న పోలీసులు
మెజిస్ట్రేట్ ఎదుట బ్రహ్మనాయుడును హాజరుపరచనున్న పోలీసులు
-
Jun 06, 2026 10:39 IST
చండీగఢ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్
-
Jun 06, 2026 10:18 IST
నటుడు రామ్‌చరణ్ 'పెద్ది' సినిమా వివాదం
సినిమాలో జాన్వీకపూర్ పాత్ర చిత్రణపై విమర్శలు
పాత్రను జుగుప్సాకరంగా చూపించారని నెటిజన్స్ ఫైర్
జాన్వీకపూర్ సన్నివేశాలు తొలగిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటన
సినిమాలోని సన్నివేశాలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలని ఎక్స్‌లో దర్శకుడు బుచ్చిబాబు పోస్ట్
-
Jun 06, 2026 10:05 IST
ఢిల్లీ: జంతర్ మంతర్ దగ్గర CJP ధర్నాకు అనుమతి
కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CJP డిమాండ్
జంతర్ మంతర్ దగ్గర భారీగా బందోబస్తు
-
Jun 06, 2026 10:01 IST
పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చురక
భారత్ సార్వభౌమ దేశం: రష్యా అధ్యక్షుడు పుతిన్
రక్షణ, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే హక్కు భారత్‌కు ఉంది
ఆంక్షలతో భారత్‌ను ఇబ్బంది పెడితే.. అవి తిప్పికొడుతాయి: పుతిన్
-
Jun 06, 2026 09:42 IST
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై కొనసాగుతున్న కసరత్తు
సానా సతీష్‌కు మరోసారి అవకాశం ఇస్తారని ప్రచారం
మరో రెండు స్థానాలకు పేర్లు ఖరారు చేయనున్న టీడీపీ హైకమాండ్
ఇవాళ లేదా రేపు టీడీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
-
Jun 06, 2026 09:42 IST
హైదరాబాద్: ORRపై అర్ధరాత్రి యువకుల వీరంగం
కార్ రేసింగ్లు, స్టంట్లతో రెచ్చిపోయిన యువకులు
TS 35 H 5397 నంబర్ కారుతో ఓఆర్ఆర్ పై హల్‌చల్
కారు డోర్‌పై కూర్చుని యువకుల స్టంట్లు
భయాందోళనకు గురైన ఇతర వాహనదారులు
-
Jun 06, 2026 09:41 IST
నల్లగొండ: ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన, విచారణ చేపట్టిన పోలీసులు
-
Jun 06, 2026 09:40 IST
చిత్తూరు: బసిరెడ్డిపల్లి దగ్గర మద్యం వ్యాన్ బోల్తా
రూ.10లక్షల విలువైన మద్యం బాటిళ్లు తీసుకెళ్లిన స్థానికులు
కార్వేటి నగరానికి మద్యం తీసుకెళ్తుండగా ఘటన
-
Jun 06, 2026 09:37 IST
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్
శ్రీవారి సేవలో సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, హీరో రవితేజ కొడుకు మహాధన్, కూతురు మోక్షద
-
Jun 06, 2026 08:50 IST
నైజర్ దేశంలోని సహారా ఎడారిలో విషాదం
ఎడారి మధ్యలో నిలిచిపోయిన ప్రయాణికుల లారీ
3 రోజుల పాటు తాగు నీరు దొరక్క ప్రయాణికుల నరకయాతన
దాహం తట్టుకోలేక 49మంది ప్రయాణికుల మృతి
-
Jun 06, 2026 08:50 IST
పల్నాడు: వినుకొండ పీఎస్‌లో లొంగిపోయిన మాజీ సీఐ చిన్నమల్లయ్య
అత్యాచారం చేశాడని చిన్నమల్లయ్యపై ఏప్రిల్ 29న మహిళ ఫిర్యాదు
కేసు నమోదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చిన్న మల్లయ్య
ఇప్పటికే చిన్నమల్లయ్య బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు, సుప్రీంకోర్టు
చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిన అధికారులు
-
Jun 06, 2026 06:51 IST
నేడు టీమిండియా T20 జట్టు ప్రకటన
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు జట్టు ప్రకటన
కొత్త కెప్టెన్‌ను ప్రకటించనున్న సెలక్షన్ కమిటీ
-
Jun 06, 2026 06:50 IST
నేటి నుంచి భారత్-అఫ్గాన్ టెస్ట్ మ్యాచ్
ఏడు నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా
ఉదయం 9:30కు మొహాలి వేదికగా మ్యాచ్
-
Jun 06, 2026 06:50 IST
హైదరాబాద్: SRనగర్‌లో సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు
హోటళ్లు, లాడ్జీల్లో గెస్ట్ రికార్టుల పరిశీలన
అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా
సీసీటీవీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లపై కఠిన ఆదేశాలు
-
Jun 06, 2026 06:49 IST
రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు
రాయలసీమ, దక్షిణకోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరణ
ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలుచోట్ల వర్షాలు
-
Jun 06, 2026 06:48 IST
నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన
నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
మిగిలిన జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
-
Jun 06, 2026 06:47 IST
హైదరాబాద్: పాతబస్తీలో లాడ్జీలు, హోటళ్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు
మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, చాదర్‌ఘాట్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
రూములు తీసుకున్న వారి ఆధార్ కార్డులు, గుర్తింపు పత్రాలను పరిశీలించిన పోలీసులు
అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక
-
Jun 06, 2026 06:41 IST
సికింద్రాబాద్: గాంధీలో ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తికి ఎబోలా నెగెటివ్
NIV పుణె నుంచి గాంధీ వైద్యులకు అందిన రిపోర్ట్
సుడాన్ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా నెగెటివ్