Share News

రష్యాలో యాండెక్స్‌తో నారా లోకేష్ కీలక చర్చలు.. AI ట్రాఫిక్ సిస్టమ్స్‌పై దృష్టి

ABN , Publish Date - Jun 06 , 2026 | 07:19 PM

రష్యాలో మంత్రి నారా లోకేష్, యాండెక్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమరావతి, విశాఖలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, AI ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్స్, ప్రిడిక్టివ్ ట్రాన్సిట్ షెడ్యూలింగ్‌పై చర్చించారు.

రష్యాలో యాండెక్స్‌తో నారా లోకేష్ కీలక చర్చలు.. AI ట్రాఫిక్ సిస్టమ్స్‌పై దృష్టి
Nara Lokesh Russia visit

రష్యా: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రముఖ టెక్ సంస్థ యాండెక్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమరావతి, విశాఖపట్నంలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థల అమలుపై కీలక చర్చలు జరిగాయి.


ప్రిడిక్టివ్ ట్రాన్సిట్ షెడ్యూలింగ్, పబ్లిక్ సేఫ్టీ అనలిటిక్స్, AI ఆధారిత ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్స్‌ను రెండు నగరాల్లో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించినట్లు సమాచారం. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. లాస్ట్ మైల్ రవాణా ఖర్చులను తగ్గించే మార్గాలపై కూడా లోకేష్ సూచనలు చేశారు. అలాగే క్విక్ కామర్స్, డెలివరీ ఫ్లీట్లలో ఆటోనమస్ వెహికల్స్ వినియోగంపై యాండెక్స్ బృందంతో చర్చించారు.


విశాఖలో ఏర్పాటు చేయనున్న AI డేటా సెంటర్‌కు సాంకేతిక భాగస్వామ్యం, అలాగే హై-పెర్ఫార్మెన్స్ క్లౌడ్ ఫ్రేమ్‌వర్క్‌ల వినియోగంపై కూడా సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలిసింది. స్థానిక పరిపాలనలో AI మోడల్స్‌ వినియోగంపై సమావేశంలో చర్చలు జరిపారు. రష్యాలోని స్బేర్ సిటీలో యాండెక్స్ ఉన్నతస్థాయి బృందంతో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఐదవ రోజు పలు కీలక సంస్థలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని

దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

Read Latest AP News

Updated Date - Jun 06 , 2026 | 07:28 PM