-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Live Updates of 27th May 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 27 , 2026 | 07:20 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 27, 2026 21:28 IST
IPL: రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 243/3
సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 244 పరుగులు
తృటిలో చేజారిన వైభవ్ సూర్యవంశీ సెంచరీ
29 బంతుల్లో 97 పరుగులు చేసిన వైభవ్
ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ చేసుకున్న వైభవ్ సూర్యవంశీ
-
May 27, 2026 21:19 IST
తొలిరోజు మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
హైబ్రీడ్ విధానంలో మహానాడు నిర్వహించుకుంటున్నాం: సీఎం చంద్రబాబు
1,875 క్లస్టర్ల నుంచి 7.5లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారు: సీఎం చంద్రబాబు
ఇంతమంది కార్యకర్తలు మహానాడులో పాల్గొనడం ఓ చరిత్ర: సీఎం చంద్రబాబు
-
May 27, 2026 21:11 IST
తెలంగాణలో అకాల వర్షాలపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్
రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్
తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యం బాయిల్డ్ మిల్లులకు తరలింపు: మంత్రి ఉత్తమ్
రైతులకు నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించం: మంత్రి ఉత్తమ్
-
May 27, 2026 20:46 IST
ఖమ్మం: BRS నేతల ప్రకటనలు చూస్తే అసహ్యం వేస్తోంది: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
గత BRS ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని పట్టించుకోలేదు: భట్టి
అభయ హస్తం ప్రాజెక్ట్‌ను కూడా పక్కన పడేసింది: భట్టి విక్రమార్క
వడ్డీ లేని రుణాలను కూడా BRS ప్రభుత్వం రద్దు చేసింది: భట్టి
-
May 27, 2026 20:21 IST
కరుప్పు సినిమా నిషేధంపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు
కోర్టుల్లో అవినీతి చూపించినంత మాత్రాన సినిమాను నిషేధించలేం: మద్రాస్ హైకోర్టు
గతంలోనూ అవినీతి జడ్జిలు ఉన్నారు.. ఇప్పుడూ ఉన్నారు: మద్రాస్ హైకోర్టు
సినిమాలో చూపించిన కోర్టు ఊహాజనితమైనది: మద్రాస్ హైకోర్టు
దీనికి కోర్టు ధిక్కరణ చట్టం వర్తించదు: మద్రాస్ హైకోర్టు
-
May 27, 2026 19:58 IST
ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీ రికార్డ్(60* సిక్స్‌లు)
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డ్
గతంలో ఈ రికార్డ్ క్రిస్ గేల్ (59, 2012) పేరిట ఉండేది
-
May 27, 2026 19:40 IST
తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తాం: కేంద్ర మంత్రి సింధియా
టీ-ఫైబర్ కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్‌కు ఆమోదం
రింగ్ ఆర్కిటెక్చర్‌తో గ్రామ పంచాయతీల అనుసంధానం
తొలి దశలో 3,089 గ్రామాల్లో కనెక్టివిటీ పునరుద్ధరణ
-
May 27, 2026 19:37 IST
కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్, సీఎం స్పెషల్ సెక్రటరీ
పెండింగ్ నిధుల విడదలను వేగవంతం చేయాలని కోరిన రేవంత్
కేంద్రంతో ఒప్పందం త్వరగా పూర్తి చేయాలని రేవంత్ ప్రతిపాదన
-
May 27, 2026 19:36 IST
అమరావతి: ముగిసిన తొలిరోజు టీడీపీ మహానాడు
వివిధ తీర్మానాలపై మాట్లాడిన 48 మంది నేతలు
పార్టీకి తొలిరోజు రూ.12కోట్ల విరాళం ఇచ్చిన నాయకులు
రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు
రూ.కోటి చొప్పున బీసీ జనార్ధన్‌రెడ్డి, భాష్యం రామకృష్ణ, మాగుంట శ్రీనివాసరెడ్డి విరాళం
-
May 27, 2026 19:11 IST
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చకు తెలంగాణ సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
-
May 27, 2026 19:09 IST
చెన్నై: పళనిస్వామిని కలిసిన AIADMK రెబల్ వర్గం
పళనిస్వామికి పూర్తిగా మద్దతు ప్రకటించిన వేలుమణి వర్గం
అందరం ఐక్యంగా ఉన్నాం: AIADMK నేత వేలుమణి
AIADMKలో చీలిక లేదు.. భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి: వేలుమణి
-
May 27, 2026 19:02 IST
ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఎస్ఆర్‌హెచ్
తొలుత బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్
మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్
-
May 27, 2026 18:45 IST
పోక్సో కేసులో ముగిసిన బండి భగీరథ్ తొలిరోజు కస్టడీ
పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు బండి భగీరథ్ తరలింపు
-
May 27, 2026 18:44 IST
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక మలుపు
హైదరాబాద్‌కు చెందిన రాజకీయ నేత, ఆయన కుమారుడి అరెస్ట్
మలక్‌పేట, లక్డికాపూల్, మల్లేపల్లి భూముల వివాదాలతో హత్య
వక్ఫ్ బోర్డు నుంచి రాజకీయ నేతను తప్పించాలని న్యాయవాది ప్రయత్నం
రూ.15లక్షల సుపారీ ఇచ్చి న్యాయవాదిని చంపించిన తండ్రి, కుమారుడు
-
May 27, 2026 18:28 IST
చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన పర్సంటేజీ వివాదం
జూన్ 30లోపు పర్సంటేజ్ సమస్యలను పరిష్కరిస్తామని చిరంజీవి హామీ ఇచ్చారు: తెలంగాణ ఎగ్జిబిటర్స్
రెంటల్ విధానంలోనే పెద్ది సినిమా ప్రదర్శన: ఎగ్జిబిటర్స్
టికెట్ ధరలు పెంచితే 7.5శాతం అదనంగా చెల్లింపు: ఎగ్జిబిటర్స్
-
May 27, 2026 18:03 IST
అమరావతి: జగన్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్
వెన్నుపోటు, గొడ్డలిపోటు గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం: మంత్రి నిమ్మల
వెన్నుపోటు, గొడ్డలిపోటుకు పేటెంట్ హక్కు జగన్‌కే ఉంది: నిమ్మల
రాష్ట్రంలో గొడ్డలి పార్టీగా వైసీపీ రూపాంతరం చెందింది: మంత్రి నిమ్మల
-
May 27, 2026 17:45 IST
జనసేన, బీజేపీపై వ్యాఖ్యలను ఎనలిస్ట్ వెనక్కి తీసుకున్నారు: మాధవ్
కొందరు కావాలని చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
ముసుగువీరులను విడిచిపెట్టం: మాధవ్
జగన్ సహా ఎవరు చేసిన పాపాలకు వారు పరిహారం చెల్లించక తప్పదు: మాధవ్
కూటమిని విచ్ఛిన్నం చేయాలనుకునే మీ కుట్రలు ఫలించవు: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
-
May 27, 2026 17:44 IST
హైదరాబాద్: గాంధీభవన్ గొడవపై స్పందించిన ఫిరోజ్‌ఖాన్
మిస్‌అండర్‌స్టాండింగ్‌తో గొడవ జరిగింది: ఫిరోజ్‌ఖాన్
మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు: ఫిరోజ్‌ఖాన్
ఉస్మాన్ హజ్రీ నాకు పెద్దన్న వంటి వారు: ఫిరోజ్‌ఖాన్
ఇది మా కుటుంబ విషయం: ఫిరోజ్‌ఖాన్
-
May 27, 2026 17:27 IST
హైదరాబాద్: గాంధీభవన్ గొడవపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ కార్వాన్ ఇన్‌చార్జ్ ఉస్మాన్
ఫిరోజ్ ఖాన్‌కు క్షమాపణ చెప్పాను: ఉస్మాన్
ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ: ఉస్మాన్
మాది కాంగ్రెస్ ఫ్యామిలీ.. ఫ్యామిలీలో గొడవలు జరుగుతూ ఉంటాయి: ఉస్మాన్
నేను తోసేసింది చూశారు.. అంతకు ముందు జరిగింది కూడా తెలుసుకోండి: ఉస్మాన్
-
May 27, 2026 17:19 IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా హవాలా డబ్బు పట్టివేత
ముంబై నుంచి తీసుకొస్తున్న రూ.1.70కోట్లను సీజ్ చేసిన రైల్వే పోలీసులు
-
May 27, 2026 17:19 IST
జగన్ నిరసనలు ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఉందా?: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఏ హామీ అమలు చేయలేదో ముందు సమాచారం తెలుసుకోవాలి: మంత్రి సత్యకుమార్
పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు అమలు చేస్తున్నాం
ప్రజల మధ్య కాకుండా విజిటింగ్ పొలిటీషియన్‌లా ఉంటే ఏం తెలుస్తుంది?: మంత్రి సత్యకుమార్
-
May 27, 2026 17:18 IST
ఏపీలో 41 మంది DSPలకు ASPలుగా పదోన్నతి
పదోన్నతులతో పాటు పోస్టింగ్స్ ఇచ్చి బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
-
May 27, 2026 17:15 IST
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో రసాభాస
ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ మధ్య ఘర్షణ
మంత్రులు పొన్నం, అజరుద్దీన్ ముందే కొట్టుకునేందుకు యత్నం
పరస్పరం చొక్కాలు పట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్
ఫిరోజ్‌ఖాన్‌ను తోసేసిన ఉస్మాన్.. కిందపడ్డ ఫిరోజ్
మంత్రి అజరుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఘర్షణ
గొడవతో సమావేశం ముగిసిందని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
-
May 27, 2026 16:48 IST
హైదరాబాద్: కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
పదేళ్ల BRS పాలనలో కట్టిన ఇళ్లకంటే ఎక్కువ కడితేనే..వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: మంత్రి పొంగులేటి
లేదంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయను: పొంగులేటి
మీకంటే ఎక్కువ ఇళ్లు కడితే పోటీకి దూరంగా ఉంటారా అంటూ కేటీఆర్‌కు పొంగులేటి సవాల్
-
May 27, 2026 16:47 IST
ఢిల్లీ: ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ప్రధానిని కలిసిన విజయ్
-
May 27, 2026 16:43 IST
హైదరాబాద్: చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్స్ భేటీ
పర్సంటేజ్ విధానం కొలిక్కి వచ్చే అవకాశం
-
May 27, 2026 16:19 IST
పేట్‌బషీరాబాద్ పోలీసుల కస్టడీకి బండి భగీరథ్
మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు భగీరథ్ తరలింపు
సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం భగీరథ్‌ను తీసుకెళ్లిన పోలీసులు
భగీరథ్‌ను 3 రోజల పాటు ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్
-
May 27, 2026 16:11 IST
అమరావతి: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష
అధిక వేడి, గాలి వానలతో పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం: మంత్రి గొట్టిపాటి
విద్యుత్ అంతరాయాలపై ప్రజలకు సమాచారం పంపాలి: మంత్రి గొట్టిపాటి
1912 కాల్ సెంటర్లు 24 గంటలూ అందుబాటులో ఉండాలి: మంత్రి గొట్టిపాటి
-
May 27, 2026 16:09 IST
కేరళం: ఈడీ దాడులపై మాజీ సీఎం విజయన్ తీవ్ర ఆగ్రహం
ఈడీ దాడుల వెనుక రాహుల్‌గాంధీ ఉన్నారు: విజయన్
నన్ను అరెస్ట్ చేయాలని రాహుల్ కుట్ర చేస్తున్నారు
కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి: విజయన్
-
May 27, 2026 15:36 IST
భారత్-పాక్ సరిహద్దులో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం
15 కిలోమీటర్ల పరిధిలో తక్షణమే కూల్చవేతలకు అమిత్‌షా ఆదేశం
సరిహద్దుల్లో చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు చెక్
జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించిన అమిత్‌షా
నకిలీ ఆధార్ కార్డులు, అనుమానాస్పద ఫండింగ్‌పై నిఘా
-
May 27, 2026 15:35 IST
రాజస్థాన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైలెవల్ సెక్యూరిట్ మీటింగ్
సరిహద్దు జిల్లాల కోసం 360 డిగ్రీల సెక్యూరిటీ ప్లాన్
రాజస్థాన్‌లోని 5 సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష
బిహార్ సీమాంచల్ తరహాలోనే రాజస్థాన్‌లోనూ ఆపరేషన్
అక్రమ ఆస్తుల ధ్వంసానికి అమిత్‌షా ఆదేశాలు
-
May 27, 2026 15:26 IST
హైదరాబాద్‌లోని పలు RTA కార్యాలయాల్లో ACB దాడులు
మేడ్చల్, నాగోల్ RTA కార్యాలయంలో ACB సోదాలు
RTA ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్న ACB
ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు నడుస్తున్నాయనే సమాచారంతో తనిఖీలు
ఎంవీఐలు, ఏఎంవీఐలను సైతం ప్రశ్నిస్తున్న ACB అధికారులు
-
May 27, 2026 15:07 IST
కేరళం మాజీ సీఎం విజయన్ నివాసం దగ్గర ఉద్రిక్తత
విజయన్ ఇంట్లో సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు
ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి
రాళ్లు, ప్లాస్టిక్ సీసాలు, హెల్మెట్లు విసిరిన నిరసనకారులు
పోలీస్ సిబ్బందికి గాయాలు, ఈడీ అధికారుల కారు ధ్వంసం
-
May 27, 2026 15:06 IST
పేట్‌బషీరాబాద్ పోలీసుల కస్టడీకి బండి భగీరథ్
మేడ్చల్ ప్రభుత్వాస్పత్రిలో భగీరథ్‌కు వైద్యపరీక్షలు
వైద్యపరీక్షల తర్వాత పేట్ బషీరాబాద్‌కు తరలింపు
-
May 27, 2026 15:06 IST
నీట్ పేపర్ లీక్ కేసులో దూకుడు పెంచిన CBI
మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన CBI అధికారులు
నీట్ పేపర్ లీక్ కేసులో 13కి చేరిన అరెస్టుల సంఖ్య
-
May 27, 2026 14:48 IST
గుజరాత్‌లోని కచ్ తీరంలో భారీగా డ్రగ్స్ సీజ్
రూ.వెయ్యి కోట్ల విలువైన 100 కిలోల కొకైన్ స్వాధీనం
గుజరాత్ ATS, కోస్ట్‌గార్డ్ సంయుక్త ఆపరేషన్
పాక్‌లోని పోర్ట్ ఖాసీం నుంచి వచ్చిన నౌకలో కొకైన్ గుర్తింపు
-
May 27, 2026 14:48 IST
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో సక్సెస్ అయ్యాం: ఎంపీ శ్రీభరత్
గతేడాది దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో.. 25% ఏపీకే వచ్చాయి
20-25 ఏళ్ల లోపు యువతకు పబ్లిక్ పాలసీ, రాజకీయాల్లో పెద్దపీట: శ్రీభరత్
భవిష్యత్‌లో మహిళా చట్టం రావడం ఖాయం: ఎంపీ శ్రీభరత్
మంత్రి లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తోంది: శ్రీభరత్
-
May 27, 2026 14:28 IST
ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో విజయ్ భేటీ
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మోదీని కలుస్తున్న సీఎం విజయ్
సోనియా, రాహుల్, ఖర్గేను కూడా కలవనున్న సీఎం విజయ్
-
May 27, 2026 14:27 IST
నాగోల్ జగ్జీవన్‌రామ్ RTA కార్యాలయంలో ACB సోదాలు
RTA ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్న ACB
ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు నడుస్తున్నాయనే సమాచారంతో తనిఖీలు
-
May 27, 2026 14:26 IST
మంచిర్యాల: ప్రజలను BRS రెచ్చగొడుతోంది: మంత్రి వివేక్
బాల్క సుమన్ డ్రామా చేయాలని చూస్తున్నారు: మంత్రి వివేక్
కార్యకర్తలను రెచ్చగొట్టి ఆందోళనలు చేయాలని కుట్ర: మంత్రి వివేక్
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించం: మంత్రి వివేక్
రాష్ట్ర ప్రజలకు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి వివేక్
-
May 27, 2026 10:19 IST
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు
కోర్టు ధిక్కారణ కేసులో శిక్ష
సింగపూర్ కోర్టు తీర్పునిచ్చినట్టు వార్తలు
-
May 27, 2026 10:07 IST
కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు
కన్నూరు, తిరువనంతపురంలోని విజయన్ నివాసాల్లో తనిఖీలు
CMRL కేసులో ఈడీ సోదాలు
కేరళలో 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు
-
May 27, 2026 10:02 IST
స్వల్ప నష్టాల్లో దేశీయ సూచీలు
83 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్
23 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.74
-
May 27, 2026 09:50 IST
ప్రారంభమైన టీడీపీ మహానాడు
-
May 27, 2026 09:47 IST
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు
పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు
పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు వేదికపైకి వచ్చిన చంద్రబాబు నాయుడు
-
May 27, 2026 09:46 IST
టీడీపీ మహానాడు ప్రారంభం
నేటి నుంచి రెండు రోజులు పసుపు పండుగ మహానాడు
వర్చువల్‌గా భారీ స్థాయిలో మహానాడు
ప్రతీ క్లస్టర్‌లోనూ మహానాడు నిర్వహిస్తోన్న శ్రేణులు
ఈ సారి 'స్త్రీ శక్తి' థీమ్‌తో మహానాడు
-
May 27, 2026 09:30 IST
కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు
మాజీ సీఎం నివాసంతోపాటు మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు
కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో భాగంగా దాడులు
-
May 27, 2026 09:27 IST
హమాస్ కొత్త మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్ హతం
ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని, రక్షణ మంత్రి
పదవిలోకి వచ్చిన 11 రోజుల్లోనే మరణం
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఒడెహ్
-
May 27, 2026 09:25 IST
హైదరాబాద్‌లో గ్రీన్ మొబిలిటీకి మరో కీలక ముందడుగు
హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
కూకట్‌పల్లి డిపోలో బస్సులను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
-
May 27, 2026 09:24 IST
ఏఐ గైడెడ్ టాక్టికల్ క్రూజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిన క్షిపణి
-
May 27, 2026 09:00 IST
హైదరాబాద్: నేడు పోలీసుల కస్టడీకి పోక్సో నిందితుడు బండి భగీరథ్
మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు
బండి భగీరథ్ నుంచి వివరాలు రాబట్టేందుకు సిద్ధమైన పేట్ బషీరాబాద్ పోలీసులు
చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్
-
May 27, 2026 08:40 IST
NIAకు విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు
జాతీయ భద్రత వ్యవహారం కావడంతో కేసును NIAకి అప్పగించిన NTR జిల్లా సీపీ రాజశేఖర్‌బాబు
కేసును విచారించాలని NIAకు ఇప్పటికే లేఖ రాసిన ఎన్టీఆర్ జిల్లా సీపీ
టెర్రర్ లింక్స్ కేసులో ఇప్పటికే 15మంది అరెస్ట్
-
May 27, 2026 08:40 IST
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి
శాంతి ఒప్పందం అమల్లో ఉన్నా ఇజ్రాయెల్ దాడులు
గాజాపై రెండుచోట్ల ఇజ్రాయెల్ వైమానిక దాడులు
దాడుల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మృతి, 12 మందికి గాయాలు
-
May 27, 2026 08:11 IST
భారత్ ఫ్యూచర్ సిటీకి భారీ మాస్టర్‌ప్లాన్ సిద్ధం
11 జోన్లతో రూపుదిద్దుకోనున్న ఫోర్త్ సిటీ
13,610 ఎకరాలకు భూ కేటాయింపులు పూర్తి
లైఫ్ సైన్సెస్ హబ్‌కు అత్యధికంగా 4 వేల ఎకరాల కేటాయింపు
రెసిడెన్షియల్ ఏరియాకు 2,477 ఎకరాల కేటాయింపు
డేటా సెంటర్ హబ్‌కు 2,177 ఎకరాల కేటాయింపు
-
May 27, 2026 08:01 IST
ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో రష్యా దాడులు
భవనాలు, రక్షణ రంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాలు లక్ష్యంగా రష్యా దాడులు
ఉక్రెయిన్ నుంచి విదేశీయులు వెళ్లి పోవాలని రష్యా హెచ్చరిక
-
May 27, 2026 08:00 IST
చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం
Ai నిపుణులు, అధికారుల ప్రయాణాలపై చైనా ఆంక్షలు
Ai నిపుణులు విదేశాలకు వెళ్లేముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చైనా ఆదేశాలు
-
May 27, 2026 07:59 IST
హైదరాబాద్: హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం
ఢీకొన్న టిప్పర్ లారీ, గూడ్స్ లారీ
ప్రమాదంలో క్యాబిన్‌లో చిక్కుకున్న టిప్పర్ డ్రైవర్ నవీన్ (30)
డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ బృందం
-
May 27, 2026 07:39 IST
కడప: రాయచోటి-కడప మధ్య రాకపోకలు బంద్
గువ్వల చెరువు ఘాట్‌లో 5వ మలుపు వద్ద బోల్తా పడిన ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్
రాయచోటి-కడప ప్రధాన రహదారి మధ్య వాహనాల రాక పోకలను నిలిపేసిన పోలీసులు
రాయచోటి నుండి చక్రాయపేట మీదుగా వాహనాల దారి మళ్లింపు
-
May 27, 2026 07:25 IST
చెన్నై: నేడు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
సీఎంగా బాధ్యతల స్వీకరణ తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటన
ప్రధాని మోదీతో పాటు సోనియాగాంధీని కలిసే అవకాశం
-
May 27, 2026 07:24 IST
IPL: నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ Vs రాజస్థాన్
ముల్లాన్‌పూర్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2 ఆడనున్న గుజరాత్
-
May 27, 2026 07:23 IST
ఇవాళ, రేపు హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణ
పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేలా రెండ్రోజుల కార్యక్రమాలు
ఏపీ 10, తెలంగాణ 4, ఉమ్మడిగా 4 తీర్మానాలు
అండమాన్ 1, చివరిగా ముఖ్యమైన రాజకీయ తీర్మానం
తీర్మానాలపై మొత్తం 65 మంది ప్రసంగాలు
పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల్లోని మొత్తం 250 మంది నేతలు
క్లస్టర్లలో జరిగే మహానాడుకు పరిశీలకులుగా 90 మంది నియామకం
-
May 27, 2026 07:22 IST
ఇవాళ, రేపు హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణ
మహానాడులో మహిళలు, యువతకు ప్రాధాన్యం
1,875 క్లస్టర్ల నుంచి లక్షలాది మంది పాల్గొనేలా ఏర్పాట్లు
20 రాజకీయ తీర్మానాలపై చర్చించనున్న నేతలు
-
May 27, 2026 07:22 IST
ఏపీలోని సత్యసాయి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం
కదిరి, తలుపుల, తనకల్లు మండలాల్లో వర్షం
పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
-
May 27, 2026 07:20 IST
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం