Share News

ఐపీఎల్ 2026: ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన హైదరాబాద్

ABN , Publish Date - May 27 , 2026 | 07:03 PM

ఐపీఎల్‌ 2026లో కీలక సమరానికి వేళైంది. మరికాసేపట్లో ముల్లాన్‌పుర్‌లో వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026:  ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన హైదరాబాద్
SRH vs RR Eliminator 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో కీలక సమరానికి వేళైంది. మరికాసేపట్లో ముల్లాన్‌పుర్‌లో వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-2 ఆడనుంది. ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. కాబట్టి విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడతాయనడంలో సందేహం లేదు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే రాజస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ‘ఆరెంజ్‌ ఆర్మీ’ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు తన చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో ప్లేఆఫ్స్‌ చేరిన రాజస్థాన్.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.


తుది జట్లు:

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌:

అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, సమ్రాన్‌ రవిచంద్రన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), శివాంగ్‌ కుమార్‌, ఎషాన్‌ మలింగ, షాకిబ్‌ హుస్సేన్‌, ప్రఫుల్‌ హింగే

ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్లు: సలీల్‌ అరోరా, అనికేత్‌ వర్మ, లివింగ్‌ స్టోన్‌, హర్ష్‌ దూబె, హర్షల్‌ పటేల్‌

రాజస్థాన్‌ రాయల్స్‌:

యశస్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, ధ్రువ్‌ జురేల్‌ (వికెట్‌ కీపర్‌), రియాన్‌ పరాగ్‌ (కెప్టెన్‌), ఫెరీరా, డాసున్‌ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్‌, నాంద్రే బర్గర్‌, బ్రిజేశ్‌ శర్మ, యశ్‌ రాజ్‌ పుంజా

ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్లు: శుభమ్‌ దూబె, సుశాంత్‌ మిశ్రా, అమన్‌ రావ్‌, రవి బిష్ణోయ్‌, తుషార్‌ దేశ్‌పాండే


ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

Updated Date - May 27 , 2026 | 07:18 PM