Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 06 , 2026 | 05:58 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 06, 2026 19:31 IST

    ప.గో: భీమవరంలో ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్‌

    • రూ.2.9 కోట్ల విలువైన డమ్మీ నోట్లు, కారు స్వాధీనం

    • డమ్మీ నోట్లు సరఫరా చేస్తున్న బర్రే సుధీర్ కోసం గాలింపు

  • Apr 06, 2026 19:24 IST

    ఏపీ లిక్కర్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లపై ACB కోర్టులో విచారణ

    • ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ

    • ఫోన్‌, ట్యాబ్‌ తెరవడానికి అనుమతిపై పిటిషన్‌

    • బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 8కి విచారణ వాయిదా

  • Apr 06, 2026 19:17 IST

    పుదుచ్చేరిలో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం

    • కాంగ్రెస్-డీఎంకేను గెలిపిస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తాం: రాహుల్

    • నిరుద్యోగ యువతకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం: రాహుల్‌

    • పుదుచ్చేరిలో 30వేల ఉద్యోగాలు కల్పిస్తాం: రాహుల్‌ గాంధీ

  • Apr 06, 2026 19:01 IST

    అసోంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

    • పాక్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలు నెరుపుతోంది: ప్రధాని మోదీ

    • ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ పాక్ పాటే పాడింది

    • ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో..

    • పాక్ ఛానల్‌ 11 టాక్‌షోలు నిర్వహించింది: మోదీ

    • ప్రతి షోలో కాంగ్రెస్ గెలవాలని చెప్పారు: ప్రధాని మోదీ

  • Apr 06, 2026 18:53 IST

    కేరళ సీఎం పినరయి విజయన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్

    • ఏప్రిల్ 7న తిరువనంతపురంలో ముఖాముఖి చర్చకు సిద్ధం: రేవంత్

    • కేరళ సీఎం వాడుతున్న గణాంకాలు పాతవి: సీఎం రేవంత్‌రెడ్డి

    • 2024-25లో తెలంగాణ GSDP 10.1శాతం వృద్ధి సాధించింది: రేవంత్

  • Apr 06, 2026 18:49 IST

    తమిళనాడు: మదురై హైకోర్టు సంచలన తీర్పు

    • లాకప్‌ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష

    • 2020లో తండ్రీకొడుకుల లాకప్ డెత్

  • Apr 06, 2026 18:47 IST

    అనంతపురం: తాడిపత్రి టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

    • కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: సీఎం

    • ఎన్నికలను దీటుగా ఎదుర్కొని అన్ని స్థానాలు దక్కేలా కృషిచేయాలి: చంద్రబాబు

    • సీఎం చంద్రబాబు సభకు పలు శాఖల అధికారులు గైర్హాజరు

    • నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశం

  • Apr 06, 2026 18:31 IST

    తిరుపతి: రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

    • రేణిగుంట మండలం మామండూరు దగ్గర లారీని ఢీకొన్న బైక్‌

    • ఇద్దరు యువకుల మృతి

  • Apr 06, 2026 18:23 IST

    విజయనగరం: వంగరలో విషాదం

    • పొలంలో మొక్కజొన్న ఏరుతుండగా పిడుగుపాటుకు గురై మహిళా రైతు మృతి

  • Apr 06, 2026 18:12 IST

    అమరావతి: మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు

    • ఫలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృషి

    • అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వేస్టేషన్

    • రూ.37.25 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

  • Apr 06, 2026 18:09 IST

    అమరావతి: ఏపీ గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలక మార్పులు

    • గ్రేడ్-III ఉద్యోగుల స్కేలు సవరణ

    • రూ.28,280-89,720 నుంచి రూ.25,220-80,910కు సవరణ

  • Apr 06, 2026 17:55 IST

    ఏపీలో ఈనెల 28న గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన

    • 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ నిర్మాణం

    • విశాఖ సమీపంలో మూడుచోట్ల మొత్తం 601.4 ఎకరాల కేటాయింపు

  • Apr 06, 2026 17:29 IST

    ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడికి జీవితఖైదు

    • NCP నేత రమావతార్ జగ్గీ హత్యకేసులో అమిత్ జోగికి శిక్ష

    • 2003 నాటి హత్య కేసులో శిక్ష విధించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

  • Apr 06, 2026 17:23 IST

    హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్‌ యత్నం.. కాపాడిన యువకుడు

    • గోల్కొండ దగ్గర బాలికతో ఆటో డ్రైవర్ సలీం అసభ్య ప్రవర్తన

    • చిన్నారి ఏడుపు గమనించి అడ్డుకున్న యువకుడు మహ్మద్

    • నిందితుడు సలీం అరెస్ట్.. ఆటో సీజ్

  • Apr 06, 2026 17:12 IST

    పాక్ మంత్రి వ్యాఖ్యల అంశంలో మోదీ వైఖరిని తప్పుబట్టిన మమత

    • ఈసారి యుద్ధం జరిగితే కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ మంత్రి అన్నారు: మమత

    • పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై మోదీ ఎందుకు స్పందించలేదు?: మమత

    • ఎన్నికల కోసం మాత్రమే కోల్‌కతాను పట్టించుకుంటారా?: మమత

    • ప్రధాని మోదీ వెంటనే రాజీనామా చేయాలి: పశ్చిమ బెంగాల్ సీఎం మమత

  • Apr 06, 2026 17:08 IST

    ఢిల్లీ అసెంబ్లీ గేటును కారుతో ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్

    • అసెంబ్లీ ప్రాంగణంలో పుష్పగుచ్ఛం ఉంచి పరారైన డ్రైవర్

    • పుష్పగుచ్ఛంలో బాంబు లేదని తేల్చిన పోలీసులు

    • నిందితుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేసిన ఢిల్లీ పోలీసులు

  • Apr 06, 2026 16:57 IST

    విజయవాడ: టెర్రర్ లింక్ కేసులో ముగిసిన నిందుతుల రిమాండ్

    • కోర్టులో హాజరుపరిచిన అధికారులు

    • రిమాండ్ ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన కోర్టు

  • Apr 06, 2026 16:49 IST

    విజయవాడలో అగ్ని ప్రమాదం

    • విజయవాడ దుర్గగుడి పైవంతెనపై కారు దగ్ధం

    • షార్ట్‌సర్క్యూట్‌తో కారులో చెలరేగిన మంటలు

    • సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు

  • Apr 06, 2026 16:29 IST

    ఆదిలాబాద్: ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం: భట్టి

    • కొందరు అధికారంలోకి రాగానే హామీలు మర్చిపోతారు.. మేం అలా కాదు: భట్టి

    • అధికారం అంటే హోదా కాదు.. బాధ్యత: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • Apr 06, 2026 16:22 IST

    ఆదిలాబాద్: కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం: మహేశ్ గౌడ్

    • ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం: మహేశ్ గౌడ్

    • వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం: మహేశ్ గౌడ్

    • గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది: జూపల్లి

    • పదేళ్ల BRS పాలన బాధ్యతారహిత్యంగా కొనసాగింది: మంత్రి జూపల్లి

  • Apr 06, 2026 16:17 IST

    ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న ధోని!

    • సీఎస్కే ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. రెండు రోజుల్లో ధోనీకి ఫిట్‌నెస్ టెస్ట్

    • అది పూర్తయ్యాక ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం

    • శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న సీఎస్కే

    పూర్తి కథనం

  • Apr 06, 2026 16:09 IST

    కర్నూలు: గూళ్యం వీఆర్వోపై సస్పెన్షన్ వేటు

    • సర్వే సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా కౌతాళం-1 సచివాలయం..

    • గ్రామ సర్వేయర్‌కు సీసీఏ రూల్స్ ప్రకారం రెండు ఇంక్రిమెంట్స్ కట్

    • IVRS ద్వారా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల గూళ్యం వీఆర్వోకు..

    • సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిరి

  • Apr 06, 2026 16:02 IST

    అమరావతి: ఏపీలో బస్సు ప్రమాదాలపై సమీక్ష

    • మంగళవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో సమీక్ష

  • Apr 06, 2026 15:56 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 787 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 255 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Apr 06, 2026 15:51 IST

    అమరావతి: ఏపీకి అదనంగా చేరిన 1.90 లక్షల డోసుల HPV టీకా

    • 3.45 లక్షల డోసుల్లో ఇప్పటికే 33.19 శాతం మంది బాలికలకు..

    • వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు మంత్రి సత్యకుమార్‌ వెల్లడి

  • Apr 06, 2026 15:41 IST

    విశాఖ: కోస్తా జిల్లాలకు వర్ష సూచన

    • పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

    • ఒడిశా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం

    • రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, అనకాపల్లి..

    • కాకినాడ, యానాం, కోనసీమ, అల్లూరి, తూ.గో, ఏలూరు జిల్లాల్లో వర్షాలు

  • Apr 06, 2026 15:34 IST

    దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు

    • చండీగఢ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు బెదిరింపు మెుయిల్స్

    • అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు ముమ్మరం

  • Apr 06, 2026 15:32 IST

    ఆదిలాబాద్: పిప్రీలో సీఎం రేవంత్, మంత్రుల పర్యటన

    • రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజలు

    • ప్రగతి పాలన బహిరంగ సభకు హాజరైన సీఎం రేవంత్

  • Apr 06, 2026 15:28 IST

    ఢిల్లీ అసెంబ్లీ దగ్గర భద్రతా వైఫల్యం

    • అసెంబ్లీ గేటు దగ్గరకు దూసుకొచ్చిన కారు

    • మొహానికి మాస్క్ వేసుకుని కారు నడిపిన ఆగంతకుడు

    • గేట్ నం.2ను ఢీకొట్టి లోపలకు వచ్చిన అనుమానిత కారు

    • స్పీకర్ కార్యాలయం వరకు దూసుకొచ్చిన కారు

  • Apr 06, 2026 15:17 IST

    ఆదిలాబాద్: పిప్రీలో సీఎం రేవంత్, మంత్రుల పర్యటన

    • రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజలు

    • ప్రగతి పాలన బహిరంగ సభకు హాజరైన సీఎం రేవంత్

  • Apr 06, 2026 15:08 IST

    కాల్పుల విరమణ దిశగా ఇరాన్‌, అమెరికా

    • 45 రోజులు కాల్పుల విరమణకు ప్రతిపాదనలు

    • నేటి నుంచి హోర్ముజ్‌ను తెరవాలని అమెరికా ప్రతిపాదన

    • అమెరికా-ఇరాన్ చర్చలకు పాక్‌, తుర్కియే, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం

    • ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్న అమెరికా, ఇరాన్

  • Apr 06, 2026 15:07 IST

    తమిళనాడు: పోరూరులో నటి సుభాషిణి ఆత్మహత్య

    • అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని నటి సుభాషిణి(36) బలవన్మరణం

    • భర్తతో వీడియో కాల్‌లో వాగ్వాదం.. తర్వాత ఆత్మహత్య

  • Apr 06, 2026 14:47 IST

    మలక్‌పేటలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో విజిలెన్స్ తనిఖీలు

    • రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు

  • Apr 06, 2026 14:31 IST

    హైదరాబాద్: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు

    • కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా

    • నిందితులను మరో 5 రోజుల పాటు కస్టడీకి కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

  • Apr 06, 2026 13:48 IST

    రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అమరావతి చట్టబద్ధత బిల్లు

    • పరిశీలన, న్యాయ నిపుణుల సంప్రదింపుల తర్వాత..

    • ఆమోదం తెలపనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    పూర్తి కథనం

  • Apr 06, 2026 13:23 IST

    సంగారెడ్డి: జహీరాబాద్‌లో పరువు హత్య

    • ప్రియుడితో పారిపోయిన భార్యను హత్య చేసిన భర్త

    • మార్చి 27న ప్రియుడితో వెళ్లిపోయిన కవిత

  • Apr 06, 2026 13:22 IST

    బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం.. డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు

    • ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ: డిప్యూటీ సీఎం

    • దేశ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేసింది..

    • బీజేపీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలి: పవన్ కల్యాణ్

  • Apr 06, 2026 12:49 IST

    మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌: సీఎం చంద్రబాబు

    • ఎన్టీఆర్ జలసిరి, నీరు-మీరు, నీరు-ప్రగతి తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు

    • భూమినే ఒక జలాశయంగా మార్చుకోవాలి..

    • నీటి బొట్టు విలువను ప్రతి ఒక్కరూ గ్రహించాలి..

    • హార్టికల్చర్‌కు వచ్చే ఆరేళ్లలో రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తాం: సీఎం చంద్రబాబు

  • Apr 06, 2026 12:35 IST

    ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాల సంయుక్త దాడులు

    • టెహ్రాన్‌లోని జనావాసాలపై క్షిపణి దాడులు

    • ఆరుగురు చిన్నారులు సహా 13 మంది మృతి

    • టెహ్రాన్‌లోని షరీఫ్‌ యూనివర్సిటీపైనా దాడులు

  • Apr 06, 2026 12:28 IST

    కర్నూలు: ఆదోనిలో షార్ట్ సర్క్యూట్‌‌తో లారీ దగ్ధం

    • రూ. 4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని వెల్లడి

    • సకాలంలో స్పందించి మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది

  • Apr 06, 2026 12:09 IST

    కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై వేముల వీరేశం ఆగ్రహం

    • సీఎం రేవంత్‌పై బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారు..

    • నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..

    • దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర.. కాంగ్రెస్ పార్టీది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

  • Apr 06, 2026 11:51 IST

    మహారాష్ట్రలో విషాద ఘటన..

    • బాస్కెట్ బాల్ హూప్ పట్టుకుని పుల్‌అప్స్ చేస్తుండగా ప్రమాదం

    • విద్యార్థిపై ఊడిపడ్డ ఫ్రేమ్

    • తలకు తీవ్రగాయాలై విద్యార్థి మృతి

  • Apr 06, 2026 11:49 IST

    హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,49,130

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,36,700

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900

    పూర్తి కథనం..

  • Apr 06, 2026 11:42 IST

    బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

    • దేశాన్ని బీజేపీ శక్తివంతం చేసింది..

    • 'వికసిత్ భారత్' లక్ష్యం దిశగా ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయాలి: సీఎం చంద్రబాబు

  • Apr 06, 2026 11:40 IST

    చెన్నైలో ఐటీ అధికారుల దాడులు

    • చెన్నై సిటీలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు

    • ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందాలతో కలిసి సోదాలు

    • ఎగ్మూర్‌, కీల్పాక్‌, అన్నాశాలై, పెరంబూర్ సహా 10 ప్రాంతాల్లో తనిఖీలు

  • Apr 06, 2026 11:39 IST

    ట్రంప్ హెచ్చరికలతో భగ్గుమన్న ముడిచమురు ధరలు

    • బ్రెంట్‌ క్రూడ్ ఆయిల్ ధర 110.58 డాలర్లకు చేరిక

    • 1.42 శాతం పెరిగిన బ్రెంట్‌ క్రూడ్ ఆయిల్ ధర

  • Apr 06, 2026 11:37 IST

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై ఆగిన విమానం..

    • రన్‌వేపై నిలిచిపోయిన రాయపూర్‌ వెళ్లాల్సిన విమానం

    • విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం.. అప్రమత్తమైన అధికారులు

    • ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కావాల్సిన 2 విమానాలు గాల్లో చక్కర్లు

    • టేక్‌ ఆఫ్‌ కావాల్సిన మరో మూడు విమానాల ఆలస్యం

  • Apr 06, 2026 10:37 IST

    హైదరాబాద్: విజిలెన్స్ అధికారులమంటూ బెదిరింపులు

    • గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన యూట్యూబర్స్

    • రెండు లక్షలు డిమాండ్ చేసిన యూట్యూబర్స్

    • కేసు నమోదు.. పోలీసుల అదుపులో ఇద్దరు యూట్యూబర్స్

    పూర్తి కథనం..

  • Apr 06, 2026 10:20 IST

    ఇవాళ కేరళం వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • రేపు కేరళంలో ఎన్నికల ప్రచారం చేయనున్న సీఎం

    • రేపటితో ముగియనున్న కేరళం ఎన్నికల ప్రచారం

  • Apr 06, 2026 10:18 IST

    విజయవాడ టెర్రర్ లింకుల కేసు

    • ఐదుగురు నిందితులకు ముగిసిన కస్టడీ

    • నిందితులను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

    • మరో ఏడుగురు నిందితుల కస్టడీ కోరనున్న పోలీసులు

  • Apr 06, 2026 10:17 IST

    పోలవరం: దండంగి దగ్గర లేగదూడలపై దాడి చేసిన పులి

    • వీరవరంలోని కొండల్లో పులి సంచారం

    • పెద్దపల్లి, నాగలపల్లి, బోడిగూడెం ప్రాంతాల్లో దూడలను చంపేస్తున్న పులి

  • Apr 06, 2026 10:15 IST

    పాదయాత్రగా దుర్గమ్మ ఆలయానికి అమరావతి రైతులు

    • మొక్కులు చెల్లించుకునేందుకు రైతుల పాదయాత్ర

    • అమరావతి రైతులకు స్వాగతం పలికిన ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ

    • అమ్మవారికి సారె, చీరలు సమర్పించిన రాజధాని మహిళలు

  • Apr 06, 2026 09:57 IST

    నిర్మల్: సీఎం రేవంత్ రెడ్డికి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల విజ్ఞప్తి

    • పర్యటనలో క్యాంపస్‌ను సందర్శించాలని వేడుకోలు

    • సీఎం వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి: విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఆకాష్ యాదవ్

  • Apr 06, 2026 09:55 IST

    ముగిసిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

    • కడప: ముగిసిన ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

    • టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వైభవంగా జరిగిన ఉత్సవాలు

  • Apr 06, 2026 09:53 IST

    కుందూ నదిలో పడి బాలిక మృతి

    • నంద్యాల: కుందూ నది సంతజూటూరు ఆనకట్ట వద్ద విషాద ఘటన

    • కుందూ నది సందర్శనకు వచ్చిన పదేళ్ల బాలిక షేక్ షబానా

    • ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి

  • Apr 06, 2026 09:50 IST

    నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

    • సెన్సెక్స్ 438, నిఫ్టీ 108 పాయింట్లకు పైగా నష్టం

    • డాలర్‌తో పోలిస్తే 105 పైసలు బలపడిన రూపాయి విలువ

    • డాలర్‌తో పోలిస్తే 93.65 దగ్గర రూపాయి విలువ

  • Apr 06, 2026 09:49 IST

    కడప: వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురి గల్లంతు

    • షార్ట్ ఫిల్మ్ తీసుకునేందుకు వచ్చిన ముగ్గురు యువకులు

    • ఇద్దరి మృతదేహాల లభ్యం.. మరో మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు

    • గల్లంతైన వారు హరిబాబు , హర్షవర్ధన్ , కృష్ణ చైతన్యలుగా గుర్తింపు

    • అన్నమయ్య , చిత్తూరు, కడప వాసులుగా గుర్తింపు

  • Apr 06, 2026 09:04 IST

    ఇరాన్‌: టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 13 మంది మృతి

    • టెహ్రాన్‌లోని భవనంపై ఇజ్రాయెల్ దాడి

  • Apr 06, 2026 09:04 IST

    నేటి నుంచి ఏపీలో టెన్త్ పేపర్ వాల్యుయేషన్‌

    • తొలిసారిగా డిజిటల్‌ విధానంలో పేపర్ వాల్యుయేషన్‌

    • మార్కుల నమోదులో పొరపాట్లు జరగకుండా డిజిటల్ విధానం

  • Apr 06, 2026 09:03 IST

    ఇరాన్‌కు మరోసారి గడువు పొడిగించిన ట్రంప్‌

    • ఇరాన్‌కు నాలుగోసారి గడువు పెంచిన ట్రంప్‌

    • ఇరాన్‌కు మరో 34 గంటల గడువు పొడిగించిన ట్రంప్‌

    పూర్తి కథనం..

  • Apr 06, 2026 09:02 IST

    కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

    • బెంగళూరు, చెన్నై హైవేపై గంగవరం జక్షన్‌ దగ్గర ప్రమాదం

    • కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

    • మృతులు యుగంధర్‌, హరీష్‌గా గుర్తింపు

  • Apr 06, 2026 08:59 IST

    హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ కీలక నేత లొంగుబాటు

    • PLGA డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగుబాటు

    • పోలీసుల ఎదుట మల్లాతో పాటూ లొంగిపోయిన 30మంది మావోయిస్టులు

    • AK-47తో పాటూ భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • లొంగుబాటును త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం

  • Apr 06, 2026 08:49 IST

    కడప: ఆలంఖాన్‌పల్లె గంగమ్మ జాతరలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

    • కత్తిపోట్లతో వ్యక్తి మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు

    • డీజే డాన్స్ దగ్గర రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ

    • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Apr 06, 2026 08:34 IST

    మూడోసారి డ్రగ్స్‌ కేసు నిందితులను కస్టడీకి కోరిన పోలీసులు

    • ఆర్థిక సంబంధాలపై లోతుగా విచారించాల్సి ఉందన్న పోలీసులు

    • ఇప్పటికే రెండు సార్లు విచారించిన పోలీసులు

    • నేడు విచారించనున్న ఉప్పర్‌పల్లి కోర్టు

    • రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు వాదనలు

  • Apr 06, 2026 07:32 IST

    డెడ్‌లైన్ ఒక రోజు పెంపు.. ఇరాన్‌కు మరో అవకాశమిచ్చిన ట్రంప్

    • రేపు (మంగళవారం) రాత్రి 8 గంటల వరకూ గడువు పొడిగించిన ట్రంప్

    • సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఇంకా సజీవంగా ఉందన్న ట్రంప్

  • Apr 06, 2026 07:20 IST

    ఎయిరిండియా కీలక నిర్ణయం

    • మే 31 వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిరిండియా

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తల దృష్ట్యా నిర్ణయం

  • Apr 06, 2026 07:18 IST

    హైదరాబాద్‌: నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

    • పార్టీ ఆఫీసుల్లో జెండా ఎగురవేయనున్న బీజేపీ నేతలు

  • Apr 06, 2026 06:53 IST

    నేటి నుంచి ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌

    • పురుషుల ప్రీస్టైల్‌, గ్రీకో-రోమన్‌తో పాటూ..

    • మహిళల విభాగాల్లో జరగనున్న రెజ్లింగ్‌ పోటీలు

    • నేటి నుంచి పిస్టల్‌, రైఫిల్‌ షూటింగ్‌ ప్రపంచ కప్‌

    • తెలంగాణ నుంచి పాల్గొంటున్న ధనుష్‌ శ్రీకాంత్‌

    • ఏపీ నుంచి బరిలోకి ముకేష్ నేలపల్లి

  • Apr 06, 2026 06:52 IST

    LPGపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

    • వినియోగదారులకు అందుబాటులో 5 కిలోల సిలిండర్లు: కేంద్రం

    • LPG సరఫరాపై ఆందోళన చెందవద్దు..

    • బ్లాక్‌లో అమ్మే వారిపై కఠిన చర్యలు: కేంద్రం

  • Apr 06, 2026 06:49 IST

    నేడు హైదరాబాద్‌లో విద్యా శాఖ సమస్యలపై PDSU ఆందోళన

    • నాంపల్లిలోని ఇంటర్ బోర్డు దగ్గర నిరసన

  • Apr 06, 2026 06:48 IST

    తమిళ జాలర్ల సమస్యపై నేడు ప్రకాశం జిల్లాలో సమావేశం

    • పట్టపుపాలెంలో సమావేశం కానున్న 4 జిల్లాల మత్స్యకారులు

    • సమావేశానికి హాజరుకానున్న 160 గ్రామాల మత్స్యకారులు

  • Apr 06, 2026 06:47 IST

    నేడు తమిళనాడలో రాహుల్‌గాంధీ ప్రచారం

    • పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్న రాహుల్‌

  • Apr 06, 2026 06:47 IST

    నేడు పుదుచ్చేరిలో అమిత్‌షా ఎన్నికల ప్రచారం

    • మన్నడిపేటలో బహిరంగసభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

  • Apr 06, 2026 06:46 IST

    అనంతపురంలో నేడు గవర్నర్ నజీర్ పర్యటన

    • JNTU 15వ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్‌

  • Apr 06, 2026 06:06 IST

    మహారాష్ట్ర బారామతి అసెంబ్లీ ఉపఎన్నికకు నేడు నామినేషన్ల స్వీకరణ

    • బారామతిలో నామినేషన్ వేయనున్న డిప్యూటీ సీఎం సునేత్ర పవార్‌

    • బారామతిలో పోటీ చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌

  • Apr 06, 2026 06:03 IST

    ప్రజా పాలన‌‌–ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి హెల్త్ వీక్

    • తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు

    • హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులో ఫుడ్ సేఫ్టీ అవేర్‌‌నెస్ వాక్

  • Apr 06, 2026 06:03 IST

    IPL: నేడు కోల్‌కతా Vs పంజాబ్ మ్యాచ్‌

    • ఈడెన్‌ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

  • Apr 06, 2026 06:02 IST

    నేడు బాసరలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులు..

    • శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • Apr 06, 2026 05:58 IST

    నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • తాడిపత్రిలో సాగునీటి భద్రతపై అధికారులతో సీఎం సమీక్ష

    • నీటి నిర్వహణ, భూగర్భ జలాలపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

    • యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశం

    • హంద్రీనీవా కాలువ ప్రయోజనాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు