Share News

రాష్ట్రపతి భవన్‌కు చేరిన.. అమరావతి చటబద్ధత బిల్లు..

ABN , Publish Date - Apr 06 , 2026 | 02:02 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026.. సోమవారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది.

రాష్ట్రపతి భవన్‌కు చేరిన.. అమరావతి చటబద్ధత బిల్లు..
AP Reorganisation Bill 2026,

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026.. సోమవారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. లోక్ సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది.


అమరావతి చట్టబద్ధతపై పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. లోక్ సభ, రాజ్య సభలో సుమారు ఐదు గంటల పాటు ఈ బిల్లుపై చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రాధాన్యాన్ని వివరించింది. చర్చ అనంతరం ఎలాంటి సవరణలు లేకుండా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. రాజ్యగ నిబంధనల ప్రకారం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి సంతకం చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత హిందీ, ఆంగ్ల భాషల్లో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.


ఇవి కూడా చదవండి...

విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: పీవీఎన్ మాధవ్

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 02:50 PM