Share News

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:44 AM

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం ట్వీట్ చేశారు.

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
CM Chandrababu

అమరావతి, ఏప్రిల్ 6: బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం (BJP Foundation Day) సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. జాతీయవాదమే పునాదిగా, దేశ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బీజేపీ నిర్ణయాత్మక పాలన, ప్రగతి పట్ల ఉన్న నిబద్ధతతో దేశాన్ని శక్తివంతం చేసిందని సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.


సీఎం చంద్రబాబు ట్వీట్

‘భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయవాదమే పునాదిగా, దేశ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్న ఈ పార్టీ.. మన సంస్కృతిని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, సమగ్ర అభివృద్ధి, దేశ సేవ కోసం నిరంతరం కృషి చేస్తోంది. పార్టీ వ్యవస్థాపక నేతల నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తన నిర్ణయాత్మక పాలన, ప్రగతి పట్ల ఉన్న నిబద్ధతతో దేశాన్ని శక్తివంతం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రెట్టింపు వేగంతో పనిచేస్తోన్న ఎన్డీయే డబుల్ ఇంజన్ సర్కార్.. ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందిస్తూ, సహకార సమాఖ్య స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో.. దేశ సేవలో బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని, 'వికసిత్ భారత్' లక్ష్యం దిశగా మన ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి..

విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: పీవీఎన్ మాధవ్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 11:55 AM