Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 09 , 2026 | 06:41 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Apr 09, 2026 21:29 IST

    నెల్లూరు: కాకాణి బెదిరింపులపై ABN ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్‌ ఫిర్యాదు

    • పోలీసులకు ABN ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్‌ హరికృష్ణ ఫిర్యాదు

    • చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: సీఐ శ్రీనివాసరావు

  • Apr 09, 2026 21:29 IST

    మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలు

    • సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు

    • సోషల్ మీడియాకు దూరంగా పిల్లలను ఉంచక తప్పదు: లోకేష్‌

    • పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినకుండా చట్టం రూపొందించండి: లోకేష్‌

  • Apr 09, 2026 21:28 IST

    వికారాబాద్‌: దోమ మండలం బడెంపల్లిలో దారుణం

    • వివాహేతర సంబంధం నేపథ్యంలో లాలయ్య (52) అనే వ్యక్తి హత్య

    • వివాహిత సుజాత భర్త సహా మరో ఇద్దరు కలిసి హత్య

    • లాలయ్యపై కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసిన నిందితులు

    • పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన సుజాత కొడుకు భాస్కర్‌

    • పరారీలో మరో ఇద్దరు నిందితులు, కేసు నమోదు

  • Apr 09, 2026 21:07 IST

    కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారు: హరీష్‌రావు

    • పాలమూరు వలస జిల్లాగా మారడానికి కాంగ్రెస్సే కారణం: హరీష్‌రావు

    • సీఎం రేవంత్ నల్లమల పులి కాదు.. పిల్లి: హరీష్‌రావు

    • ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు: హరీష్‌రావు

    • ఇప్పటివరకు మూడు రైతుబంధులు ఎగ్గొట్టారు: హరీష్‌రావు

    • ఈసారి ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే కాంగ్రెస్‌ పరిమితం: హరీష్‌రావు

  • Apr 09, 2026 21:07 IST

    సంగారెడ్డి: జీవన్‌రెడ్డి పార్టీ వీడటం బాధాకరం: జగ్గారెడ్డి

    • కాంగ్రెస్‌కి విధేయుడిగా ఉన్న వ్యక్తి జీవన్‌రెడ్డి: జగ్గారెడ్డి

    • జీవన్‌రెడ్డి విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి: జగ్గారెడ్డి

    • సమస్యను అధిష్ఠానం పరిష్కరించి ఉంటే బాగుండేది: జగ్గారెడ్డి

  • Apr 09, 2026 20:30 IST

    సీఎం రేవంత్‌ చెప్పినట్లు మహేష్‌గౌడ్‌ తలాడిస్తున్నారు: జీవన్‌రెడ్డి

    • కార్యకర్తలు అంటే.. మహేష్‌గౌడ్‌కు గౌరవం ఉందా?: జీవన్‌రెడ్డి

    • మహేష్‌గౌడ్‌.. మధ్యలో టీడీపీలోకి వెళ్లలేదా?: జీవన్‌రెడ్డి

    • రేవంత్‌ కంటే కేసీఆర్‌ పాలనే బెటర్: జీవన్‌రెడ్డి

  • Apr 09, 2026 20:00 IST

    నటుడు మోహన్‌బాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ

    • విద్యార్థి నాయకుడు కిడ్నాప్‌ కేసులో మోహన్‌బాబు బెయిల్‌ పిటిషన్

    • మోహన్‌బాబుపై తదుపరి విచారణ వరకు తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

    • కేసు సీడీని తమకు సమర్పించాలని తిరుపతి పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం

  • Apr 09, 2026 19:33 IST

    నోరుపారేసుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌

    • టీడీపీ, జనసేనకు పోరాడే శక్తిలేదు: అన్నాబత్తుని శివకుమార్‌

    • చంద్రబాబు, పవన్‌కు సొంతంగా పోటీచేసే శక్తి లేదు: అన్నాబత్తుని

  • Apr 09, 2026 19:17 IST

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత

    • రూ.4.6 కోట్ల విలువైన 13.2 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం

    • బ్యాంకాక్‌ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి పట్టివేత

  • Apr 09, 2026 19:16 IST

    వరంగల్: రాయపర్తి మండలంలో సామూహిత హత్యాచారం

    • యువతిపై హత్యాచారం చేసిన నలుగురు యువకులు

    • నిందితులది రావూరు తండాగా బాధిత కుటుంబం ఆరోపణ

    • అత్యాచారం అనంతరం ఉరి వేసి చంపారని ఆరోపణ

  • Apr 09, 2026 18:09 IST

    అసోం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

    • సాయంత్రం 5 గంటల వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్‌

    • అసోంలో 84.42, కేరళం 75.01 శాతం పోలింగ్‌ నమోదు

    • సా.5 గంటల వరకు పోలింగ్‌ శాతాలను అధికారికంగా ప్రకటించిన ఈసీ

  • Apr 09, 2026 17:58 IST

    ప్రెస్ మీట్‌లో బొత్స సత్యనారాయణ భావోద్వేగం

    • వైఎస్‌ను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న బొత్స

    • అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు ఆపాలి: బొత్స

    • రాజకీయ లబ్ధి కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు: బొత్స

    • కావాలనే జగన్‌పై బురద జల్లుతున్నారు: బొత్స

  • Apr 09, 2026 17:40 IST

    ఢిల్లీ: మూడు రాష్ట్రాలలో కొనసాగుతున్న పోలింగ్

    • అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ

    • సాయంత్రం 5 గంటల వరకు నమోదు అయిన పోలింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించిన ఈసీ

    • అస్సాంలో 84.42 శాతం పోలింగ్ నమోదు

    • కేరళంలో 72.07 శాతం పోలింగ్ నమోదు

    • పుదుచ్చేరిలో 72.40 శాతం పోలింగ్ నమోదు

  • Apr 09, 2026 17:20 IST

    కాకినాడ: యానాంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

    • సాయంత్ర 5 గంటలకు 89.80 శాతం పోలింగ్ నమోదు

  • Apr 09, 2026 17:15 IST

    బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: జీవన్‌రెడ్డి

    • రెండేళ్లలోనే రాష్ట్రం తిరోగమనంలో పడింది

    • విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా చెల్లించలేకపోతోంది

    • ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కారు నెరవేర్చలేకపోతోంది

  • Apr 09, 2026 17:08 IST

    సీఎం రేవంత్‌ అధికార మత్తులో ఉన్నారు: కేటీఆర్‌

    • జీవన్‌రెడ్డి లాంటి సీనియర్లను అవమానిస్తున్నారు: కేటీఆర్‌

    • రైతులు, పేదలు మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని భావిస్తున్నారు

    • కేసీఆర్‌తో జీవన్‌రెడ్డికి బలమైన బంధం ఉంది: కేటీఆర్‌

    • 2014 ఎన్నికల్లోనే జీవన్‌రెడ్డిని కేసీఆర్‌ ఆహ్వానించారు: కేటీఆర్‌

    • జీవన్‌రెడ్డి చేరిక BRSకు అతిపెద్ద బలం: కేటీఆర్‌

  • Apr 09, 2026 17:07 IST

    శబరిమలలో మహిళల ప్రవేశం వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • ఆలయంలోకి వెళ్లేటప్పుడు సంప్రదాయాలు పాటించాల్సిందే: సుప్రీం

    • CJI నేతృత్వంలో 9 మంది సభ్యుల ధర్మాసనం విచారణ

    • హిందువుల్లో విభిన్న సంప్రదాయాలు: జస్టిస్‌ నాగరత్న

    • ఆలయానికి తగినట్లు సంప్రదాయాలు పాటించాల్సిందే: జస్టిస్‌ నాగరత్న

  • Apr 09, 2026 16:41 IST

    ఖమ్మం: బీఆర్ఎస్ దోపిడీ వల్లే తెలంగాణ అభివృద్ధి జరగలేదు: భట్టి విక్రమార్క

    • తెలంగాణలో వనరులను బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారు

    • విద్య ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

    • జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం

    • ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

  • Apr 09, 2026 16:35 IST

    భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 931 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 222 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Apr 09, 2026 16:20 IST

    అసోం, కేరళం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

    • మ.3 వరకు అసోం 75.91, పుదుచ్చేరి 72.40, కేరళం 62.71 శాతం పోలింగ్‌

    • కర్ణాటక, నాగాలాండ్‌, త్రిపురలో అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్‌

  • Apr 09, 2026 15:59 IST

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మాజీమంత్రి కాకాణి బెదిరింపులు

    • వైసీపీ అధికారంలోకి వస్తే ఏబీఎన్ ఉండదు.. ఆంధ్రజ్యోతి ఉండదు: కాకాణి

    • కొత్తపలుకు ఉండదు.. అసలు పలుకే ఉండదు: కాకాణి

  • Apr 09, 2026 15:59 IST

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎదుట వైసీపీ నిరసనలను ఖండించిన వీహెచ్‌

    • మీడియా సంస్థల ఎదుట నిరసనలు మంచి పద్ధతి కాదు: వీహెచ్‌

    • వైసీపీ తమకు నచ్చని వార్తలు రాస్తే దాడులు చేయడమేంటి?: వీహెచ్‌

  • Apr 09, 2026 15:58 IST

    జీవన్‌రెడ్డి పార్టీ మారే విషయంలో చాలా తొందరపడ్డారు: ఎంపీ అర్వింద్‌

    • జీవన్‌రెడ్డి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు: ఎంపీ అర్వింద్

    • ఎమ్మెల్యే సంజయ్‌ ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీలో మంటపెడతారు

    • ఎమ్మెల్యే సంజయ్‌ మళ్లీ బీఆర్ఎస్‌లోకి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు

    • బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోయింది: ఎంపీ ధర్మపురి అర్వింద్

  • Apr 09, 2026 15:28 IST

    హెజ్‌బొల్లా నేత హతం.. ఇజ్రాయెల్ ప్రకటన

    • హెజ్‌బొల్లా చీఫ్ బంధువు యూసుఫ్‌ను అంతం చేశామన్న ఐడీఎఫ్

    • హెజ్‌బోల్లా చీఫ్‌ నజీమ్ ఖాసిమ్‌‌కు యూసుఫ్ బంధువని వెల్లడి

    • ఆయుధాలు నిల్వ చేసిన కేంద్రాలనూ ధ్వంసం చేసినట్టు ప్రకటన

  • Apr 09, 2026 15:10 IST

    హోర్ముజ్ మూసివేతతో మళ్లీ చిక్కులు

    • అంతర్జాతీయ మీడియాలో కథనాలు

    • హోర్ముజ్‌ మూసివేతతో వెనక్కు మళ్లుతున్న నౌకలు

    • పర్షియన్ గల్ఫ్ జలాల్లో చైనా నౌకల వెయిటింగ్

  • Apr 09, 2026 15:08 IST

    సూర్యాపేట: గాంధీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

    • సూర్యాపేట-అర్వపల్లి హైవేపై ధాన్యం ఆరబోసిన రైతులు

    • అదుపుతప్పిన కారు.. ఒకరికి తీవ్ర గాయాలు

  • Apr 09, 2026 15:05 IST

    జగిత్యాల చేరుకున్న కేటీఆర్

    • జగిత్యాలలో బీఆర్ఎస్ భవన్‌లో ముఖ్య నేతలతో సమావేశం

    • కాసేపట్లో జీవన్ రెడ్డి ఇంటికి రానున్న కేటీఆర్

  • Apr 09, 2026 15:00 IST

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.18 కోట్ల విలువైన 30 రోలెక్స్‌ వాచ్‌లు సీజ్‌

    • రోలెక్స్‌ వాచ్‌లను హైదరాబాద్‌ నుంచి ముంబై తీసుకెళ్తున్న ఇద్దరు అరెస్టు

  • Apr 09, 2026 14:59 IST

    ఇవాళ సాయంత్రం ఢిల్లీకి నితీష్‌కుమార్‌

    • రేపు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నితీష్

    • ఇటీవల MLC సభ్యత్వానికి నితీష్‌కుమార్‌ రాజీనామా

  • Apr 09, 2026 14:59 IST

    పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

    • తిరుక్కనూర్ పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల ఘర్షణ

    • కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల పరస్పర దాడులు, పోలీసుల లాఠీచార్జ్‌

  • Apr 09, 2026 14:48 IST

    ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: అచ్చెన్నాయుడు

    • పత్రిక గురించి మాట్లాడుతున్నావు.. నీ భార్య కూడా పత్రికా అధిపతే

    • అవినీతి డబ్బుతో జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాధాకృష్ణ పత్రిక పెట్టుకోలేదు

    • రాధాకృష్ణ జర్నలిస్టుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక పెట్టుకున్నారు

    • ఏపీలో జరుగుతున్న వాస్తవాలను రాధాకృష్ణ ముందుంచారు: అచ్చెన్నాయుడు

  • Apr 09, 2026 14:37 IST

    నాదర్‌గుల్‌ భూములపై పొంగులేటి అవాస్తవాలు చెబుతున్నారు: హరీష్‌రావు

    • 2016లో నాదర్‌గుల్‌ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది

    • అవి ప్రభుత్వ భూములేనని హైకోర్టులో ప్రభుత్వం కేసు గెలిచింది

    • ప్రభుత్వ భూములైతే కబ్జాదారులు బౌన్సర్లతో ఎందుకు కాపలా కాస్తున్నారు?

    • ప్రభుత్వ భూములైతే హైడ్రా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?

    • రోజుకో కంపెనీ పేరుతో బోర్డులు ఎందుకు వస్తున్నాయి?

  • Apr 09, 2026 14:36 IST

    ఒక సైకోకు పదవీ వ్యామోహం వస్తే ఏమైనా చేస్తారు: మంత్రి అచ్చెన్న

    • ఆనాడు తండ్రి మరణాన్ని మలచుకుని ఎలా ప్రవర్తించారో చూశాం: అచ్చెన్న

    • తండ్రి మరణం నిర్థారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారు

    • YSR చనిపోయిన సమయంలో జగన్‌ ఎక్కడున్నారో చెప్పాలి: అచ్చెన్న

  • Apr 09, 2026 14:03 IST

    YSR పేరు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారు: షర్మిల

    • వైసీపీలో YSR ఐడియాలజీ ఉంటే అధికారంలోకి వచ్చాక కూడా..

    • జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు?: షర్మిల

    • 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్‌లు కట్టుకున్నారు: షర్మిల

    • ఇప్పుడు 'మావిగన్ జోకర్‌'గా జగన్ మిగిలారు: షర్మిల

  • Apr 09, 2026 13:32 IST

    వైసీపీ నేతలంతా సైకోలుగా మారారాని సీఎం చంద్రబాబు వ్యాఖ్య

    • ఇప్పటివరకు జగన్ ఒక్కడే సైకో అనుకున్నాం..

    • వైసీపీ నేతలంతా సైకోలుగా మారారు: చంద్రబాబు

    • మొన్నటివరకు మూడు ముక్కలాట.. ఇప్పుడు మావిగన్

    • ఇంకా నయం.. వాటికన్ అనలేదు: సీఎం చంద్రబాబు

  • Apr 09, 2026 13:26 IST

    ఏలూరు: మావిగన్ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు: హోంమంత్రి అనిత

    • వైసీపీ హయాంలో ఒక్క ఫైర్ ఇంజిన్ కొనుగోలు చేయలేదు: అనిత

    • తప్పుచేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు: అనిత

  • Apr 09, 2026 13:02 IST

    పత్రికలు, మీడియాపై శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉంది: వెంకయ్య నాయుడు

    • భౌతిక దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

    • అలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి: వెంకయ్య నాయుడు

    • పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పించే చర్యలు..

    • రాజకీయ పార్టీలకు మంచిదికాదు: వెంకయ్య నాయుడు

    పూర్తి కథనం

  • Apr 09, 2026 12:53 IST

    బాపట్ల: భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

    • 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

    • రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

    • సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం: సీఎం

    • 21 నెలల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం: చంద్రబాబు

    • ఎన్నికల్లో చెప్పనివి కూడా అమలు చేస్తున్నాం: చంద్రబాబు

    పూర్తి కథనం

  • Apr 09, 2026 12:48 IST

    అమరావతి: తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీల తొలగింపు

    • జగన్ ఇంటి ఎదుట మావిగన్‌కు మద్దతుగా ఫ్లెక్సీల ఏర్పాటు

    • వైసీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులు

  • Apr 09, 2026 12:45 IST

    జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసింది: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

    • రేవంత్ పోవాలి.. మార్పు రావాలి అనడానికి జీవన్‌రెడ్డి ఎవరు?: మహేశ్ గౌడ్

    • కేసీఆర్ అవినీతిని అనేకసార్లు జీవన్‌రెడ్డి విమర్శించారు: మహేశ్ గౌడ్

  • Apr 09, 2026 12:24 IST

    సిద్దిపేట: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ

    • పాల్గొన్న వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎల్.రమణ, వినోద్‌కుమార్

    • జీవన్‌రెడ్డి చేరికపై కేసీఆర్‌తో చర్చించిన కేటీఆర్

    • కేసీఆర్‌తో భేటీ తర్వాత జగిత్యాల బయల్దేరిన కేటీఆర్

  • Apr 09, 2026 12:23 IST

    జగిత్యాల: నేను BRSలో చేరుతున్నా: జీవన్‌రెడ్డి

    • రేవంత్ పాలన కంటే కేసీఆర్ పాలన భేష్: జీవన్‌రెడ్డి

    • ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోతోంది: జీవన్ రెడ్డి

    • జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్రంలో BRS బెటర్: జీవన్‌రెడ్డి

    పూర్తి కథనం

  • Apr 09, 2026 12:17 IST

    హోర్ముజ్‌లో నిలిచిన భారత నావికులకు కేంద్రం అడ్వైజరీ

    • నావికులు అప్రమత్తంగా ఉండాలని,..

    • అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచన

    • ఎంబసీతో టచ్‌లో ఉండాలని సూచించిన కేంద్రం

  • Apr 09, 2026 12:09 IST

    నేపాల్‌లో మరో మాజీ ప్రధాని అరెస్ట్‌కు రంగం సిద్ధం

    • అవినీతి, మనీలాండరింగ్ కేసులో..

    • మాజీ ప్రధాని షేర్ బహదూర్‌ దేవ్‌బాపై అరెస్ట్ వారెంట్

  • Apr 09, 2026 12:04 IST

    కోనసీమ: అంతర్వేది దేవస్థానంలో మంచినీటి పథకం ప్రారంభం

    • జల్‌ జీవన్ మిషన్ మంచినీటి పథకాన్ని వర్చువల్ విధానంలో..

    • ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

  • Apr 09, 2026 11:55 IST

    బాపట్ల: అమరావతి అందరి ఆశీస్సులతో నిలబడింది: మంత్రి అనగాని

    • అన్ని పార్టీలు అమరావతి కావాలన్నారు: అనగాని సత్యప్రసాద్‌

    • వైసీపీ మాత్రమే అమరావతిని వ్యతిరేకిస్తోంది: మంత్రి అనగాని

  • Apr 09, 2026 11:46 IST

    బాపట్ల: భట్టిప్రోలు మండలం సూరేపల్లికి సీఎం చంద్రబాబు

    • గ్రామసభకు హాజరైన సీఎం చంద్రబాబు

    • మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో..

    • రాజముద్రతో కూడిన పాసు పుస్తకాల పంపిణీ

  • Apr 09, 2026 11:39 IST

    శ్రీసత్యసాయి: జగన్‌కు CPM నేత బీవీ రాఘవులు చురకలు

    • జగన్‌కు రాజకీయ మెచ్యూరిటీ లేదు: బీవీ రాఘవులు

    • అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్నారు..

    • ఇప్పుడు మావిగన్ అంటున్నారు: బీవీ రాఘవులు

    • రాజధానిపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు: బీవీ రాఘవులు

    • ఇప్పుడైనా అమరావతికి జగన్ సహకరించాలి: బీవీ రాఘవులు

  • Apr 09, 2026 11:21 IST

    గుంటూరు: అంబటి రాంబాబుపై అరండల్‌పేట పీఎస్‌లో కేసు

    • ABN ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎదుట ఆందోళనపై కేసు

    • అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు

    • నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన చేయడంపై కేసు

  • Apr 09, 2026 11:13 IST

    పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

    • విచారణ మ.2:15కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

    • అస్సాం సీఎం భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ ఖేరా

    • గువాహటిలో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా..

    • ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన పవన్ ఖేరా

  • Apr 09, 2026 10:59 IST

    హైదరాబాద్: మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు

    • సిట్ కస్టడీకి రోహిత్‌రెడ్డి, నమిత్ శర్మ, రితేశ్‌రెడ్డి

    • ముగ్గురిని ప్రశ్నిస్తోన్న సిట్ అధికారులు

  • Apr 09, 2026 10:52 IST

    సంగారెడ్డి: కంగ్టి మండలం రాసోల్‌ గ్రామంలో అమానుషం

    • అంగన్వాడీ టీచర్‌ను ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు

    • జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని బెదిరింపులు

    • గ్రామస్థుల నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేసి..

    • అంగన్వాడీ టీచర్ వసంత కుమారి భర్త తిరిగి ఇవ్వలేదని ఆరోపణ

    • పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు, ఐదుగురిపై కేసు నమోదు

    పూర్తి కథనం

  • Apr 09, 2026 10:49 IST

    ఢిల్లీ: రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

    • మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు సహా..

    • ప్రస్తుత రాజకీయ పరిణామాలపై CWC చర్చ

  • Apr 09, 2026 10:41 IST

    వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిలిచిన మిర్చి కొనుగోళ్లు

    • మార్కెట్ యార్డు ప్రధాన కార్యాలయం వద్ద రైతుల నిరసన

    • వ్యాపారి తిరుపతిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన

    • రైతుల ఆందోళనతో మార్కెట్ యార్డు వద్ద పోలీసుల మోహరింపు

  • Apr 09, 2026 10:35 IST

    మహారాష్ట్ర: నాందేడ్‌ జిల్లాలో ఫుడ్‌ పాయిజన్ కలకలం

    • ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 150 మందికి అస్వస్థత

    • వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక

    • 10 మంది పరిస్థితి విషమం

  • Apr 09, 2026 10:34 IST

    తగ్గిన బంగారం, వెండి ధరలు

    • రూ.2,340 తగ్గి రూ.1,51,480కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.2,150 తగ్గి రూ.1,38,850కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. పసిడి

    • కిలోపై రూ.5 వేలు మేర తగ్గి రూ.2,60,000కు చేరిన వెండి

    పూర్తి కథనం

  • Apr 09, 2026 10:30 IST

    హైదరాబాద్: స్కీమ్ పేరుతో జనగామ MLA పల్లాకు టోకరా

    • ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అంటూ పల్లాకు ఫోన్

    • వికసిత్ భారత్‌లో రూ.10 లక్షల వరకు రుణాలు ఉన్నాయని..

    • MLA పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు

    • దరఖాస్తుకు రూ.2,500 చొప్పున రూ.1 లక్ష వసూలు చేసిన కేటుగాళ్లు

    • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు

    పూర్తి కథనం

  • Apr 09, 2026 10:29 IST

    ఇరాన్‌కు ట్రంప్ మరోసారి హెచ్చరిక

    • హోర్ముజ్‌ను తెరవకపోతే దాడులు తప్పవు: ట్రంప్

    • ఒప్పందం కుదరకపోతే ఈసారి తీవ్రమైన దాడులు చేస్తాం: ట్రంప్

    • ఎన్నడూ లేని విధంగా ఇరాన్‌పై విరుచుకుపడతాం: ట్రంప్

    • ఇప్పటికే ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలున్నాయి: ట్రంప్

    • అణ్వాయుధాలను ఇరాన్ వదలాల్సిందే: ట్రంప్

  • Apr 09, 2026 10:22 IST

    అమరావతి: తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ కలకలం

    • జగన్ ఇంటి ఎదుట మావిగన్ ఫ్లెక్సీ ఏర్పాటు

    • రాజధాని అమరావతి వద్దు..

    • మూడు జిల్లాల మావిగన్‌తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ

  • Apr 09, 2026 10:19 IST

    పశ్చిమాసియాలో పరిణామాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    • ఇరాన్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేవరకు..

    • మా ఆయుధాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయి: ట్రంప్

  • Apr 09, 2026 10:13 IST

    భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

    • సెన్సెక్స్ 800 పాయింట్ల డౌన్

    • సుమారు 200 పాయింట్లకుపైగా నష్టంతో నిఫ్టీ

    పూర్తి కథనం

  • Apr 09, 2026 09:20 IST

    పల్నాడు జిల్లా: మాచర్లలో మహిళా అత్యాచార ఘటనలో నిందితుడి అరెస్ట్

    • నామాల శ్రీనివాసరావును అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచిన పోలీసులు

    • నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

  • Apr 09, 2026 08:58 IST

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

    • మాజీ ముఖ్య మంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి..

    • సంయమనం పాటించకుండా దూషణలు చెయ్యడం సరికాదన్న పార్థసారథి

    • పత్రికా స్వేచ్చ ప్రజాస్వామ్యంకు బలమైన ఆయుధం: మంత్రి పార్థసారథి

  • Apr 09, 2026 08:47 IST

    చిత్తూరు: నేడు చిత్తూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన

    • ఉదయం 11 గంటలకు జరిగే ఎన్‌పీ సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల..

    • స్నాత కోత్సవంలో పాల్గొనున్న వెంకయ్య నాయుడు

  • Apr 09, 2026 08:39 IST

    కడప: గండికోటలో చిరుతపులుల సంచారం

    • గ్రామస్థులను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు

    • ఎర్ర కొండల వైపు వెళ్లొద్దని పశువుల కాపరులకు సూచన

    • రెండు రోజుల క్రితం గొర్రెల మందపై దాడిచేసిన చిరుతలు

  • Apr 09, 2026 08:19 IST

    విశాఖ: నేడు బీజేపీ ఆధ్వర్యంలో మన ఊరు - మన జెండా కార్యక్రమం

    • ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్.మాధవ్

  • Apr 09, 2026 08:09 IST

    హైదరాబాద్: దుండిగల్ పరిధిలోని బహదూర్ పల్లి, గ్రీన్ హిల్స్ కాలనీలో అగ్ని ప్రమాదం

    • డెకరేషన్ సామగ్రి గోదాంలో చెలరేగిన మంటలు

    • గోదాం పక్కనే ఉన్న ఇంట్లోకి వ్యాపించిన మంటలు

  • Apr 09, 2026 08:08 IST

    హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డి నగర్లో భారీ అగ్ని ప్రమాదం

    • ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్ముల గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

    • అగ్ని ప్రమాదంలో రోడ్లపై ఎగిసిపడుతున్న కెమికల్ సాల్వెంట్స్ డ్రమ్ములు

    • భయాందోళనలో స్థానికులు

  • Apr 09, 2026 07:52 IST

    విజయవాడ: దేవాదాయ ఏసీ కె.శాంతిని కస్టడీకి కోరిన ఏసీబీ అధికారులు

    • అక్రమాస్తుల కేసులో 5 రోజుల పాటు శాంతిని విచారించేందుకు..

    • అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అధికారులు

    • నేడు విచారించనున్న ఏసీబీ న్యాయస్థానం

  • Apr 09, 2026 07:45 IST

    విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో కస్టడీలోకి మరో ఆరుగురు నిందితులు

    • నేటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్న కొత్తపేట పోలీసులు

    • ఈ నెల 13వ తేదీ వరకు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన CJM కోర్టు

  • Apr 09, 2026 07:36 IST

    నేడు వనపర్తిలో మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ సభ

    • వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి..

    • వ్యతిరేకంగా రైతులు 100 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతుగా హరీశ్ రావు సభ

    • సాయంత్రం 4:00 గంటలకు బహిరంగ సభలో మాట్లాడనున్న హరీశ్ రావు

    • హరీశ్ రావు వనపర్తి సభకు అనుమతినిచ్చిన హైకోర్టు

  • Apr 09, 2026 07:15 IST

    నేడు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ

    • మధ్యాహ్నం పార్టీ నేతలతో కలసి జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్

    • కేటీఆర్ భేటీ తర్వాత జీవన్ రెడ్డి పార్టీలో చేరే తేదీపై క్లారిటీ

  • Apr 09, 2026 07:01 IST

    ఇరాన్‌ బలహీనపడింది: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు

    • మా వేలు ట్రిగ్గర్‌పై స్ధిరంగా ఉంది: ఇజ్రాయెల్‌ ప్రధాని

    • కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదు: నెతన్యాహు

    • లెబనాన్‌.. సంధిలో భాగం కాదు: నెతన్యాహు

    • హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తాం: నెతన్యాహు

    • ఇరాన్‌తో యుద్ధంలో పలు లక్ష్యాలను సాధించాం: నెతన్యాహు

    • అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పది: నెతన్యాహు

  • Apr 09, 2026 06:59 IST

    లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

    • 10 నిమిషాల్లో వందకుపైగా ఎయిర్‌ స్ట్రయిక్స్‌

    • లెబనాన్‌లో ఇప్పటివరకు 254 మంది మృతి

    • వందలాది మందికి తీవ్రగాయాలు

    • 1982 తర్వాత లెబనాన్‌పై అతిపెద్ద దాడి

  • Apr 09, 2026 06:57 IST

    ఇరాన్‌ సంచలన నిర్ణయం.. హోర్ముజ్‌ జలసంధి మళ్లీ మూసివేత

    • లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌ నిర్ణయం

    • ఇజ్రాయెల్‌ చర్యలపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం

    • హోర్ముజ్‌లో ఆయిల్‌ ట్యాంకర్ల రాకపోకల నిలిపివేత

  • Apr 09, 2026 06:55 IST

    బాపట్ల జిల్లా వేమూరులో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

    • ‘మీ భూమి-మీ హక్కు’లో భాగంగా రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ

  • Apr 09, 2026 06:51 IST

    పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు, బరిలో 294 మంది అభ్యర్థులు

    • పుదుచ్చేరిలో NDA, DMK, TVK పార్టీల మధ్య ప్రధాన పోటీ

    • పుదుచ్చేరిలో ఓటుహక్కు వినియోగించుకోనున్న 9.5 లక్షల మంది

  • Apr 09, 2026 06:49 IST

    అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు, బరిలో 722 మంది అభ్యర్థులు

    • అస్సాంలో అధికార NDA, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూటముల మధ్య ప్రధాని పోటీ

    • అస్సాంలో ఓటుహక్కు వినియోగించుకోనున్న సుమారు 2.5 కోట్ల మంది

  • Apr 09, 2026 06:48 IST

    కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు, బరిలో 883 మంది అభ్యర్థులు

    • కేరళంలో LDF, UDF, NDA కూటముల మధ్య ప్రధాన పోటీ

    • కేరళంలో ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.71 కోట్ల మంది

  • Apr 09, 2026 06:47 IST

    శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ

    • నేడు మూడో రోజూ కొనసాగనున్న వాదనలు

  • Apr 09, 2026 06:42 IST

    నేడు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

    • కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

    • మే 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు

  • Apr 09, 2026 06:41 IST

    నేటి మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

    • 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,53,830

    • 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,010

    • సుమారు రూ.2.65 లక్షల వద్ద ట్రేడ్ అవుతున్న కిలో వెండి రేటు