-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 5th July 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 05 , 2026 | 06:02 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 05, 2026 21:50 IST
ZEE5 నుంచి దిల్జిత్ దోసాంజ్ చిత్రం ‘సట్లుజ్’ తొలగింపు
జూలై 3న విడుదలైన ఈ చిత్రాన్ని భారత్‌లో నిలిపేసిన ZEE5
తదుపరి ప్రకటన వచ్చే వరకు భారత్‌లో స్ట్రీమింగ్ నిలిపివేత
సినిమాను తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ZEE5 ప్రకటన
-
Jul 05, 2026 21:45 IST
కృష్ణా: రావణ్ కేసులో సుధీర్ఘ వాదనలు వినిపించాం: న్యాయవాది శ్రావణ్
రావణ్‌పై దేశద్రోహం కేసు పెట్టారు: న్యాయవాది శ్రావణ్
మరణశిక్ష పడేలాంటి కేసు రావణ్‌పై పెట్టారు: న్యాయవాది శ్రావణ్
మీడియాలో నక్సలైట్ల గురించి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రిపై ఎన్ని కేసులు పెట్టాలి: న్యాయవాది శ్రావణ్
నక్సలిజాన్ని సపోర్ట్ చేసిన ఉప ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసు పెట్టాలి: న్యాయవాది శ్రావణ్
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు: న్యాయవాది శ్రావణ్
సామాన్యుడిని శిక్షించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది: న్యాయవాది శ్రావణ్
-
Jul 05, 2026 21:41 IST
థానె: మ్యాట్రిమోని సైట్‌లో కోటీశ్వరుడినని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి
పెళ్లి పేరుతో మహిళపై పలుమార్లు అత్యాచారం
రూ.41.25 లక్షలు కాజేసిన నిందితుడు
కారు విక్రయానికి నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణ
ఇదే తరహాలో మరికొందరినీ మోసం చేసి ఉండొచ్చని పోలీసుల అనుమానం
కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
-
Jul 05, 2026 21:39 IST
కృష్ణా: గన్నవరం కోర్టులో జోసెఫ్ రావణ్ కేసులో ముగిసిన విచారణ
ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య హోరాహోరి వాదనలు
దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన విచారణ
తీర్పు వెల్లడించనున్న న్యాయమూర్తి
బెయిల్ లేదా రిమాండ్‌పై కొనసాగుతోన్న ఉత్కంఠ
-
Jul 05, 2026 21:37 IST
నంద్యాల: ఏఎస్ఐ సురేశ్‌రెడ్డి మృతిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంతాపం
కారు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి దురదృష్టకరం: జనార్దన్ రెడ్డి
ఏఎస్ఐ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి
-
Jul 05, 2026 21:32 IST
మధ్యప్రదేశ్‌లో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ డిఫెన్స్
శివపురిలో అతిపెద్ద ప్రైవేట్ క్షిపణి తయారీ కేంద్రం ఏర్పాటు
దక్షిణాసియాలోనే అతిపెద్ద మిస్సైల్ తయారీ ఎకోసిస్టమ్‌గా కంపెనీ వెల్లడి
మిస్సైల్, కాంపోజిట్ ప్రొపెలెంట్, TNT తయారీ ఒకేచోట

-
Jul 05, 2026 21:30 IST
విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు కోశాధికారి
తాజాగా ప్రకటన జారీ చేసిన ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి
హుండీ విరాళాల లెక్కింపుతో తనకు సంబంధం లేదని వివరణ
స్థానిక ట్రస్టీలే మొదటి నుంచీ ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని వెల్లడి
-
Jul 05, 2026 21:24 IST
సోమవారం అయోధ్య రామమందిర ట్రస్ట్ అత్యంత కీలక సమావేశం
ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం.
సిట్ సమర్పించిన మధ్యంతర నివేదికపై కూడా చర్చించే అవకాశం.
-
Jul 05, 2026 21:15 IST
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
8 మందికి గాయాలు.. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు
ఓ మహిళ పరిస్థితి విషమం
కాల్పులు జరిపిన నిందితుడు పరారీ.. ఘటనాస్థలంలో తుపాకీ స్వాధీనం
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
-
Jul 05, 2026 21:06 IST
నెల్లూరు: డబ్బు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి జబ్బు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కష్టపడేవారే రాజకీయాల్లోకి రావాలి: వెంకయ్య నాయుడు
కుల రాజకీయాలు ప్రజాస్వామ్యానికి నష్టం: వెంకయ్య నాయుడు
వారసత్వ రాజకీయాలు నాకు ఇష్టం లేదు: వెంకయ్య నాయుడు
విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి: వెంకయ్య నాయుడు
అమరావతే అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే రాజధాని: వెంకయ్య నాయుడు
-
Jul 05, 2026 20:55 IST
హైదరాబాద్: హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్
కాంగ్రెస్ అండతోనే ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: బండి సంజయ్
అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా?: బండి సంజయ్
కోర్టులు, చట్టాలంటే MIMకు గౌరవం లేదు: బండి సంజయ్
ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదు?: బండి సంజయ్
హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు?: బండి సంజయ్
చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేయడమే తప్పు: బండి సంజయ్
ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?: బండి సంజయ్
-
Jul 05, 2026 20:27 IST
జిల్లాల పర్యటన తర్వాత రేపు అమరావతికి సీఎం చంద్రబాబు
నాలుగు జిల్లాల్లో సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలు
హీరో, అడిడాస్, JSW వంటి ప్రఖ్యాత సంస్థలకు శంకుస్థాపన
కుప్పం పర్యటనలో 30కి పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
కుప్పం నుంచి రేపు నేరుగా సచివాలయానికి సీఎం చంద్రబాబు
RTGS, 3 ప్రాంతాల ఎకనమిక్ రీజియన్లపై రేపు సీఎం సమీక్ష
-
Jul 05, 2026 20:18 IST
నంద్యాల: పాణ్యం దగ్గర హైవేపై కారు ప్రమాదం
ASI సురేష్ మృతి, హెడ్‌కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
-
Jul 05, 2026 20:16 IST
అమరావతి: నటుడు ప్రకాష్‌రాజ్‌కు మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్
సెలెక్టివ్‌గా కొన్ని అంశాల్లోనే జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు: దుర్గేష్
తప్పులు జరిగిన అన్ని సందర్భాల్లోనూ జస్ట్ ఆస్కింగ్ అని అడిగి ఉంటే అనుమానాలు ఉండవు: దుర్గేష్
2019-24 మధ్య ఏ ప్యాలెస్ మీ గొంతుకు తాళం వేసింది?: దుర్గేష్
అప్పుడు గుర్తుకురాని జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడే ఎందుకు?: దుర్గేష్
ప్రశ్నించాల్సిన సందర్భాలు లేనప్పుడే గుర్తుకొస్తాయా?: దుర్గేష్
సమాజంలో చీలికలు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నట్లుంది: దుర్గేష్
ఏపీలో విధ్వంసం సృష్టించే ప్రయత్నంలా కనబడుతోంది: దుర్గేష్
-
Jul 05, 2026 20:15 IST
హైదరాబాద్: దొరల భూములు గుంజుకుని పేదలకు పంచడమే లక్ష్యం: తీన్మార్ మల్లన్న
నల్లగొండ జిల్లా రెడ్డి ఎమ్మెల్యేలు, మంత్రులను అసెంబ్లీ గేటు తాకనివ్వం: తీన్మార్ మల్లన్న
ప్రజల రక్తం తాగి పెత్తనం చేస్తున్నవారిని రాజకీయంగా ఖతం చేస్తాం: తీన్మార్ మల్లన్న
అధికారమే లక్ష్యంగా రాజ్యాధికార పార్టీ ముందుకెళ్తుంది: తీన్మార్ మల్లన్న
వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణకు బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి: మల్లన్న
-
Jul 05, 2026 20:13 IST
సియోల్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేశ్
ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే: మంత్రి లోకేశ్
ప్రవాసాంధ్రులతో కలిసి పనిచేసేందుకు సిద్ధం: మంత్రి లోకేశ్
భారత్‌లో కొరియాకు నమ్మకమైన భాగస్వామి ఏపీ: లోకేశ్
కియా లాంటి మరిన్ని పరిశ్రమల కోసం ఎదురుచూస్తున్నాం: లోకేశ్
-
Jul 05, 2026 20:13 IST
విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు
హెడ్ కానిస్టేబుల్ అశోక్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తింపు
సిట్ అదుపులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ స్నేహితుడు సుశాంత్
సాయికృష్ణ ఘటన తర్వాత సుశాంత్‌కు ఫోన్, ఆధార్‌కార్డ్, వాలెట్ ఇచ్చి గోవాకు పంపిన హెడ్ కానిస్టేబుల్ అశోక్
గోవా వెళ్లిన సుశాంత్‌తో అశోక్ ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తింపు
కృష్ణలంక పీఎస్‌లో మరో ముగ్గురి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్
-
Jul 05, 2026 19:39 IST
ముంబై: అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారంపై శివసేన (యూబీటీ) నిరసన
ముంబై దాదర్ హనుమాన్ ఆలయంలో ‘రామ్ రక్ష’ పేరుతో ఆందోళన
రామమందిరం విరాళాల దుర్వినియోగంపై విచారణకు డిమాండ్
-
Jul 05, 2026 19:36 IST
కర్నూలు: ఎమ్మిగనూరులో కోచింగ్ సెంటర్‌లో విషాద ఘటన
గురు నవోదయ కోచింగ్ సెంటర్ మూడో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి నిశాంత్
తీవ్ర గాయాలతో నిశాంత్ ఆస్పత్రికి తరలింపు
హాస్టల్ నుంచి ఇంటికి వస్తానంటూ తండ్రితో వాగ్వాదం అనంతరం ఘటన
అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారంటూ విద్యార్థి సంఘాల ఆందోళన
-
Jul 05, 2026 19:33 IST
భార్యను దోశల పెనంతో కొట్టి చంపిన భర్త
ఢిల్లీలో శనివారం ఘటన
రెండు మూడేళ్లుగా భర్తకు షిజోఫ్రేనియా
ఇటీవల జాబ్ పోవడంతో పెరిగిన మానసిక ఒత్తిడి
శనివారం రాత్రి గొడవ సందర్భంగా భార్యను హత్య చేసిన భర్త
-
Jul 05, 2026 19:24 IST
సంగారెడ్డి: జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం
డాక్టర్ లేకపోవడంతో గర్భిణికి డెలివరీ చేసిన నర్సు, ఆయా
ఆక్సిజన్ అందక నవజాత శిశువు మృతి
సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
-
Jul 05, 2026 19:09 IST
‘ఆపరేషన్ అమిస్టాడ్’ పేరుతో వెనిజులాలో భారత్ సహాయక చర్యలు
భూకంప బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న భారత ఆర్మీ బృందం
చికిత్సకు బాధితులు, కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
భారత వైద్య బృందాన్ని ప్రశంసించిన స్థానికులు
భారత సహాయంపై విదేశాంగ శాఖ వీడియో విడుదల
-
Jul 05, 2026 18:32 IST
కృష్ణా: గన్నవరం కోర్టుకు జోసెఫ్ రావణ్ తరలింపు
గన్నవరం పీఎస్ నుంచి భారీ బందోబస్తుతో తరలింపు
-
Jul 05, 2026 18:32 IST
చిత్తూరు: పీ4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో సీఎం చంద్రబాబు భేటీ
సమావేశానికి హాజరైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా, అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థల ప్రతినిధులు
బంగారు కుటుంబాలు ఆర్థికంగా ఎదిగి మరికొంతమందిని ఆదుకునే స్థాయికి రావాలి: సీఎం చంద్రబాబు
P4 కార్యక్రమంతో జీరో పావర్టీ సాధించేలా కార్యాచరణ: సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా 12 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాం: సీఎం చంద్రబాబు
1.10 లక్షల మంది మార్గదర్శులు ఆదుకోవడానికి ముందుకొచ్చారు: సీఎం చంద్రబాబు
-
Jul 05, 2026 18:10 IST
మహారాష్ట్రలో భారీ వర్షాలు, ముంబై, పుణెలో స్తంభించిన జనజీవనం
ముంబై-గోవా హైవేపై వరదనీరు, నిలిచిన వందలాది వాహనాలు
ముంబై సహా పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఢిల్లీలోనూ భారీ వర్షాలు, 15 విమానాల దారిమళ్లింపు
-
Jul 05, 2026 18:07 IST
అన్షులా కపూర్ పెళ్లి వేడుకలు ప్రారంభం
మెహందీ వేడుకలో సందడి చేసిన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్
సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన అన్షులా కపూర్
-
Jul 05, 2026 18:05 IST
ఒడిశా తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న
మత్స్యకారులను రక్షించేందుకు ఒడిశా మెరైన్, మత్స్యశాఖ అధికారులతో నిరంతరం మాట్లాడి సహాయకచర్యలు చేపట్టాం: మంత్రి అచ్చెన్న
సకాలంలో స్పందించడంతో మత్స్యకారులు క్షేమం: మంత్రి అచ్చెన్న
ఒడిశా ప్రభుత్వం, మెరైన్, మత్స్యశాఖకు ధన్యవాదాలు: అచ్చెన్న
-
Jul 05, 2026 17:43 IST
తిరుమల: కాలినడకన తిరుమలకు వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు
స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమల చేరుకున్న బామ్మ
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బామ్మ వీడియో
వీఐపీ దర్శనం చేయిస్తామని ప్రకటించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
-
Jul 05, 2026 17:21 IST
విజయనగరం: ఒడిశా తీరంలో చిక్కుకున్న మరో మత్స్యకారుల బోటు
ఇంజిన్‌లో సాంకేతికలోపంతో 6 రోజులుగా సముద్రంలోనే మత్స్యకారులు
తమను రక్షించాలంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వీడియో సందేశం పంపిన మత్స్యకారులు
సముద్రంలో చిక్కుకున్నాం.. రక్షించండంటూ కోరిన మత్స్యకారులు
-
Jul 05, 2026 17:15 IST
నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన
కాలువలు, పాఠశాలల అధునీకరణ పనుల పరిశీలన
ఐదేళ్లలో వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలి: మంత్రి నారాయణ
వైసీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: మంత్రి నారాయణ
మీ బెదిరింపులకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదు: మంత్రి నారాయణ
వైసీపీ చీప్ పాలిటిక్స్‌కు అభివృద్ధితోనే సమాధానం చెబుతాం: మంత్రి నారాయణ
పేద పిల్లలకు మంచి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు: నారాయణ
-
Jul 05, 2026 17:12 IST
హైదరాబాద్: కాళేశ్వరంపై కేటీఆర్ కొత్త కథలు చెబుతున్నారు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎవరైనా చూడొచ్చని చెప్పిందే మా ప్రభుత్వం: అద్దంకి
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లాలని చూస్తే అరెస్ట్ చేశారు: అద్దంకి
పనీపాట లేక కేటీఆర్ కాళేశ్వరం వెళ్లారు: ప్రభుత్వ విప్ అద్దంకి
అరెస్ట్ చేస్తే సానుభూతి పొందవచ్చన్నది కేటీఆర్ ఆలోచన: అద్దంకి
-
Jul 05, 2026 16:12 IST
పుణె: పైప్‌లైన్ టెస్టింగ్.. రోడ్డును చీల్చుకుని బయటకు వచ్చిన నీరు
ఈ ఘటనతో భయాందోళనకు గురైన జనాలు
తాలేగావ్‌లో చోటు చేసుకున్న ఘటన
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
-
Jul 05, 2026 16:07 IST
మూడో వివాహం చేసుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్
గౌరి స్ప్రాట్‌తో ముంబైలో సాదాసీదా రిజిస్టర్ మ్యారేజ్
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం
పెళ్లికి సంబంధించి తొలి ఫొటో విడుదల
రెండేళ్ల ప్రేమ తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంట

-
Jul 05, 2026 15:58 IST
భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచలో ఆటోలో తరలిస్తున్న ఎండు గంజాయి పట్టుకున్న పోలీసులు
ఆటో డ్రైవర్ ప్రభాకర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఒడిశా నుంచి నిజామాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
రూ.14 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆటో సీజ్ చేసి, కేసు నమోదు చేసిన పోలీసులు
-
Jul 05, 2026 15:41 IST
కర్ణాటక: సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్
కర్టాటక ఆర్టీసీ బస్సులో రాత్రి వేళ ఘటన
హెడ్‌లైడ్స్ పనిచేయకపోవడంతో సెల్‌ఫోన్ లైట్ పెట్టిన కండక్టర్
నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
-
Jul 05, 2026 15:21 IST
తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం: ఐఎండీ
జులై-ఆగస్టులో ఎల్‌నినో ప్రభావం పెరిగే అవకాశం: ఐఎండీ
సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో మరింత బలపడే అవకాశం: ఐఎండీ
ఎల్‌నినో ప్రభావంతో దక్షిణ భారతంలో వర్షాలు తగ్గే అవకాశం: ఐఎండీ
-
Jul 05, 2026 15:20 IST
హైదరాబాద్: పార్టీకి దూరంగా ఉంటున్నానన్నది అవాస్తవం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
పార్టీలో కొన్ని అంశాలను తప్పుపడుతున్నా.. పార్టీని కాదు: రాజగోపాల్‌రెడ్డి
రాహుల్‌తో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయలు చర్చించా: రాజగోపాల్‌రెడ్డి
మానవత్వం ఉన్న గొప్ప నాయకుడు రాహుల్: రాజగోపాల్‌రెడ్డి
రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం: రాజగోపాల్‌రెడ్డి
-
Jul 05, 2026 15:18 IST
హైదరాబాద్: బీఆర్ఎస్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ నాయకులకు లాభం చేకూర్చడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు: ఉత్తమ్
రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు ఇచ్చారు: ఉత్తమ్
నాసిరకం పనులతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లు దెబ్బతిన్నాయి: ఉత్తమ్
బీఆర్ఎస్ హయంలోనే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయింది: ఉత్తమ్
బీఆర్ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగించలేక పోతున్నాం: ఉత్తమ్
-
Jul 05, 2026 15:13 IST
విశాఖ: ఫిషింగ్ హార్బర్‌లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎమ్మెల్యేల పరామర్శ
బోటు గల్లంతు ఘటన బాధాకరం: ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, లోకం మాధవి
గల్లంతైన ఏడుగురిలో ఆరుగురు నెల్లిమర్లకు చెందినవారే: ఎమ్మెల్యేలు
రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి: ఎమ్మెల్యేలు
గల్లంతయిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం: ఎమ్మెల్యేలు
-
Jul 05, 2026 15:01 IST
భూపాలపల్లి: కన్నెపల్లి పంప్ హౌస్‌కు కేటీఆర్
కేటీఆర్ కాన్వాయ్‌ని లోపలకు అనుమతించిన పోలీసులు
పంప్ హౌస్ సమీపంలోని గోదావరిని పరిశీలిస్తున్న కేటీఆర్ బృందం
-
Jul 05, 2026 14:51 IST
కర్నూలు: ఆదోనిలో రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్త కల్లుబోతుల సురేశ్
రూ.4 లక్షల బకాయి చెల్లిస్తానంటూ పిలిచి ఇద్దరు సోదరులపై దాడి చేసిన సురేశ్
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన
పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన బాధితులు
గతంలో సచివాలయ ఉద్యోగిపై దాడి వీడియో వైరల్
-
Jul 05, 2026 14:38 IST
హైదరాబాద్: పుప్పాలగూడలో ప్రణీత్ కన్‌స్ట్రక్షన్స్ బాధితుల ధర్నా
ఏడేళ్లుగా ఫ్లాట్లు అప్పగించట్లేదని కొనుగోలుదారుల ఆవేదన
రూ.70లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేశారని ఆరోపణ
110 ఫ్లాట్లను 220 మందికి డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపణ
ప్రణీత్ గ్రూప్ అధినేత సురేష్, కుమారుడు ప్రణీత్‌పై ఆరోపణలు
ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్
-
Jul 05, 2026 13:56 IST
హైదరాబాద్: మెట్రో ఫేజ్-2పై కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ
కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
మెట్రో ఫేజ్-2కు వెంటనే ఆమోదం కోరిన సీఎం
మెట్రో ఫేజ్-1 టేకోవర్ వేగవంతం చేయాలని విజ్ఞప్తి
రుణాల రీఫైనాన్సింగ్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 05, 2026 13:54 IST
దేశంలో టెలివిజన్ రేటింగ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ రేటింగ్స్‌పై పూర్తిస్థాయిలో నిషేధం విధించిన కేంద్రం
అన్ని ఛానెల్స్ రేటింగ్స్ నిలిపివేయాలని BARCకి ఆదేశం
'టెలివిజన్ రేటింగ్స్ పాలసీ-2026' ప్రకారం కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ రేటింగ్స్ నిలిపివేత
-
Jul 05, 2026 13:27 IST
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: చేజర్ల మండలంలో మంత్రి ఆనం పర్యటన
రూ. 5.5 కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన
చేజర్ల మండలంలో పలు సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి ఆనం
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది: మంత్రి ఆనం
-
Jul 05, 2026 13:25 IST
భువనగిరి: రోడ్డు ప్రమాదంలో BRS ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలు
వరంగల్ పర్యటనకు వెళ్తుండగా భువనగిరి దగ్గర జరిగిన ప్రమాదం
శంభీపూర్ రాజు కారును ఢీకొట్టిన మరో కారు
శంభీపూర్ రాజుకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Jul 05, 2026 13:24 IST
మెటాకు కేంద్రం హెచ్చరిక.. నోటీసులు జారీ
ఇన్‌స్టా పెయిడ్ ప్రకటనల్లో 'CSEAM' కలకలం
చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌ను ప్రోత్సహించే ప్రకటనలపై కేంద్రం కీలక ఆదేశాలు
మెటా సంస్థకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ హెచ్చరిక నోటీస్
ఇన్‌స్టా ప్రకటనలపై 7రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని సమన్లు
-
Jul 05, 2026 13:12 IST
కృష్ణా: గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో యూట్యూబర్ జోసఫ్ రావణ్
ఉదయం నుంచీ ప్రశ్నిస్తున్న పోలీసు అధికారులు
రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు
ప్రజల మధ్య విద్వేషాలు, ఘర్షణలు సృష్టించేలా రావణ్ కుట్రలు
విచారణ తర్వాత రావణ్‌ను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
-
Jul 05, 2026 12:53 IST
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు
కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రానన్ని పారిశ్రామిక ప్రాజెక్టులు: సీఎం చంద్రబాబు
నియోజకవర్గానికి రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కనెక్టివిటీ: చంద్రబాబు
అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారు: చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్నీ ఇలాగే తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
-
Jul 05, 2026 12:51 IST
మహారాష్ట్రలో రుతుపవనాలతో విస్తారంగా భారీ వర్షాలు
జెనిత్ జలపాతం దగ్గర వరద ఉధృతి, 100 మంది పర్యాటకులు సేఫ్
ముంబ్రాలో కూలిన ప్రహరీగోడ, 3 బైక్‌ల ధ్వంసం
ముంబై, రాయగఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు రెడ్ అలర్ట్
-
Jul 05, 2026 12:50 IST
విశాఖ: మత్స్యకారుల గల్లంతుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా
గాలింపు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం
మెరైన్ పోలీసులు, కోస్ట్‌గార్డ్, నేవీ సహకారం తీసుకోవాలని పవన్ సూచన
-
Jul 05, 2026 12:49 IST
హనుమకొండ: కేటీఆర్ కాళేశ్వరం పర్యటనపై MLA నాయిని ఆగ్రహం
కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేశారు: నాయిని రాజేందర్‌రెడ్డి
ప్రాజెక్ట్ వైఫల్యంపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: నాయిని
మీ అవినీతి, వైఫల్యాలను ప్రజలు మర్చిపోతారనుకోవడం భ్రమ: నాయిని
ప్రజలకు నిజాలు చెప్పి రాజకీయ సన్యాసం చేసుకునే సమయం వచ్చింది: MLA నాయిని
-
Jul 05, 2026 11:56 IST
ఒడిశా: పూరీ దగ్గర సముద్రంలో చిక్కుకున్న మరో బోటు
సాంకేతిక లోపంతో నిలిచిన విశాఖకు చెందిన బోటు
బోటులో 9 మంది మత్స్యకారులు
అధికారులకు సమాచారం ఇచ్చిన మత్స్యకారులు
-
Jul 05, 2026 11:01 IST
జనగామ: పెంబర్తిలో కేటీఆర్ కాన్వాయ్‌ని నిలిపేసిన పోలీసులు
కాన్వాయ్‌ను నిలిపివేసిన పోలీసులు.. భారీగా పోలీసుల మోహరింపు
కేటీఆర్ కాన్వాయ్‌లో నలభైకి పైగా వాహనాలు
మూడు వాహనాలకే అనుమతి ఇస్తామన్న పోలీసులు
వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్ నేతలు
-
Jul 05, 2026 10:58 IST
అల్లూరి: పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం
ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దగెడ్డ వాగు
20 గ్రామాలకు రాకపోకలు బంద్
-
Jul 05, 2026 10:57 IST
కామారెడ్డి: బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో ట్రాక్టర్ చోరీకి యత్నం
గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన నలుగురు యువకులు
చెత్త ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా ప్రహరీని ఢీకొట్టిన యువకులు
ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.. మరో ముగ్గురు పరారీ
సీసీ టీవీలో రికార్డైన చోరీ దృశ్యాలు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 05, 2026 10:30 IST
జమ్మూకశ్మీర్ షోపియాన్‌లో ఉగ్రవాదుల కోసం వేట
7 గ్రామాల్లో మోహరించిన పోలీసులు, భద్రతా బలగగాలు
-
Jul 05, 2026 10:30 IST
వర్షాలతో నవీ ముంబైలో కూలిన శిథిలావస్థలో ఉన్న భవనం
థానేలో లోతట్టు ప్రాంతాలు జలమయం
ముంబై, రాయిగఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్
-
Jul 05, 2026 10:29 IST
కృష్ణా: యూట్యూబర్ జోసఫ్ రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు
రావణ్‌పై గన్నవరం పీఎస్‌లో జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు
రావణ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
చట్టవిరుద్ధ కార్యకలాపాలు, దేశద్రోహపూరిత చర్యలను రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో రావణ్‌పై కేసు నమోదు
-
Jul 05, 2026 10:26 IST
విశాఖలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోం మంత్రి అనిత ఆరా
కలెక్టర్, ఎస్పీ, మత్స్య శాఖ అధికారులకు హోం మంత్రి అనిత ఫోన్
కోస్టుగార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం
గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలకు ఆదేశం
మత్స్యకారుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం: హోం మంత్రి అనిత
-
Jul 05, 2026 10:25 IST
విశాఖ: గల్లంతైన మత్స్యకారుడు చిన్నాను రక్షించిన కోస్ట్‌గార్డ్
మిగతా వారి కోసం కొనసాగుతున్న గాలింపు
మత్స్యకారుల గల్లంతు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆరా
-
Jul 05, 2026 10:00 IST
ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాకు రెడ్ అలర్ట్
కేరళ, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Jul 05, 2026 09:54 IST
మత్స్యకారుల గల్లంతు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆరా
కోస్టుగార్డు నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని చంద్రబాబు ఆదేశం
మత్స్యకారులను రక్షించేందుకు చేపట్టిన చర్యలను సీఎంకు వివరించిన అధికారులు
నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని తెలిపిన అధికారులు
-
Jul 05, 2026 09:05 IST
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్
కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులపై సతీష్‌కుమార్ ఆరా
కోచ్ ఫ్యాక్టరీ కోసం అదనపు భూమి సేకరించాలని సతీష్‌కుమార్ ఆదేశం
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి: సతీష్‌కుమార్
త్వరలోనే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం: రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్
-
Jul 05, 2026 08:58 IST
కాకినాడ జిల్లా: తుని జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సుకు ప్రమాదం
డ్రైవర్‌కు కళ్లు తిరగడంతో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు
39 మందితో వెళ్తున్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు
తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
-
Jul 05, 2026 08:39 IST
విశాఖ: మత్స్యకారుల గల్లంతు ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశం
మత్స్యకారుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు
-
Jul 05, 2026 08:38 IST
పల్నాడు జిల్లా: రొంపిచర్ల మండలం అలవాలలో విషాదం
ఇంట్లో ఉరివేసుకొని తండ్రి, కూతురి ఆత్మహత్య
మృతులు తండ్రి గొనుగుంట్ల పోతులూరయ్య (60), కూతురు రామాంజమ్మ (39)
ఆత్మహత్యకి కుటుంబ కలహాలే కారణంగా చెబుతున్న గ్రామస్తులు, బంధువులు
-
Jul 05, 2026 08:08 IST
ఏలూరు: నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో కత్తిపోట్ల కలకలం
ఇంటి సరిహద్దు వివాదంలో కుటుంబాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 05, 2026 08:06 IST
ఏలూరు: ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వేస్టేషన్ దగ్గర ప్రమాదం
రైలు ఢీకొని నలుగురి మృతి, మృతుల్లో ముగ్గురు మహిళలు, పురుషుడు
ఆత్మహత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
-
Jul 05, 2026 08:05 IST
అనంతపురం: నేడు ఉరవకొండలో మంత్రి పయ్యావుల టూర్
కూటమి విజయోత్సవ సభలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్
-
Jul 05, 2026 08:04 IST
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
-
Jul 05, 2026 07:46 IST
చేపల వేటకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
నల్లగొండ: ఖాజీరామారం గ్రామ సమీపంలోని బావిలో విషాద ఘటన
చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన మణి భార్గవ్ (13), వినయ్ (10 )
-
Jul 05, 2026 07:44 IST
కృష్ణా: గన్నవరం పోలీసుల అదుపులో రావణ్
పాయకరావుపేట నుంచి గన్నవరం పీఎస్‌కు రావణ్ తరలింపు
-
Jul 05, 2026 06:51 IST
నల్లగొండ: చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం
కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ప్రమాదంలో నలుగురి మృతి
చిట్యాల నుంచి హైద్రాబాద్ వైపు వెళ్తున్న కారు
-
Jul 05, 2026 06:39 IST
తమిళనాడు TVK ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. నేడు విచారణ
కేసులో కీలకంగా ఉన్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ
సెంథిల్ బాలాజీ ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ
ఇప్పటికే 9 మంది DMK, అన్నాడీఎంకే నేతల అరెస్ట్
-
Jul 05, 2026 06:38 IST
అయోధ్య విరాళాల కేసులో నేడు నిందితుల విచారణ
జైల్లో ఐదుగురు నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు
-
Jul 05, 2026 06:37 IST
చిత్తూరు: కుప్పంలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు టూర్
శాంతిపురం మండలం కడపల్లిలో ప్రజాప్రతినిధులతో చంద్రబాబు భేటీ
ద్రవిడియన్ యూనివర్సిటీలో సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Jul 05, 2026 06:19 IST
నేడు భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన
కన్నెపల్లి ఫాంహౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్
-
Jul 05, 2026 06:10 IST
విశాఖ: సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు
ఈ నెల 1న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లు
జాలర్ల ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ అవడంతో గల్లంతయ్యారని మెరైన్ పోలీసులకు సమాచారం
గల్లంతైన వారి కోసం కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసుల గాలింపు
-
Jul 05, 2026 06:09 IST
జోగులాంబ గద్వాల: మానవపాడు దగ్గర రోడ్డు ప్రమాదం
లారీని వెనుక నుంచి ఢీకొట్టి ప్రైవేట్ బస్సు బోల్తా
బస్సులోని 10 మందికి గాయాలు
హిందూపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు
-
Jul 05, 2026 06:07 IST
నేటి నుంచి ఈ నెల 11 వరకు దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ పర్యటన
ఏపీలో పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ చర్చ
కొరియా మంత్రిత్వశాఖల ప్రతినిధులతో లోకేశ్ సమావేశాలు
సియోల్‌లో ఇండియా డయాస్పోరా భేటీలో లోకేశ్ ప్రసంగం
సియోల్‌లో భారతీయులు, తెలుగువారితో లోకేశ్ ఆత్మీయ భేటీ
-
Jul 05, 2026 06:05 IST
ముంబైలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
ముంబైలో నిన్న 200 మి.మి. వర్షపాతం నమోదు
పుణేలో భారీ వర్షాలు, పలుచోట్ల విరిగిపడ్డ కొండచరియలు
-
Jul 05, 2026 06:03 IST
రేపటి నుంచి ఈ నెల 11 వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటన
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మోదీ టూర్
-
Jul 05, 2026 06:03 IST
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఆగస్ట్ 13 వరకు కొనసాగనున్న సమావేశాలు: కిరణ్ రిజిజు
జాతీయ అంశాలపై చర్చలు, నిర్ణయాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
-
Jul 05, 2026 06:02 IST
నేడు ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్
లార్డ్స్‌లో రాత్రి 8 గంటలకు ఇంగ్లండ్ Vs ఆస్ట్రేలియా