Share News

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి..

ABN , Publish Date - Jul 05 , 2026 | 07:22 AM

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి..
Nalgonda road accident

ఇంటర్‌నెట్ డెస్క్: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ వెళుతున్న కారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలుడితో సహా నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.


మరో ఘటనలో.. హిందూపూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మందికి గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి

లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 10 మందికి గాయాలు..

జడ శ్రవణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోరా?

Updated Date - Jul 05 , 2026 | 07:28 AM