Share News

లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 10 మందికి గాయాలు..

ABN , Publish Date - Jul 05 , 2026 | 06:34 AM

జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి.

లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 10 మందికి గాయాలు..
Jogulamba Gadwal accident

జోగులాంబ గద్వాల, జులై 5: జిల్లాలోని మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి. శనివారం రాత్రి హిందూపూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మందికి గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jul 05 , 2026 | 06:37 AM