మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్.. మరోసారి మెటాకు కేంద్రం నోటీసులు..
ABN , Publish Date - Jul 05 , 2026 | 01:06 PM
ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్‌పై కేంద్రం మరోసారి స్పందించింది. శనివారం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్‌పై కేంద్రం మరోసారి స్పందించింది. శనివారం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించే అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అభ్యంతరకరమైన ప్రకటనలను ఇన్‌స్టాగ్రామ్ మోడరేషన్ సిస్టమ్ ఎలా అనుమతించిందని ఐటీ మంత్రిత్వ శాఖ ప్రశ్నించింది. ఆ ప్రకటనలను అడ్డుకోవడంలో భద్రతా వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయనే విషయాలపై 7 రోజులలోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని మెటాను ఆదేశించింది.
కాగా, చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రేరేపించేలా ఉండే కంటెంట్‌కు సంబంధించిన యాడ్స్ భారత్‌లోని ఇన్‌స్టా అకౌంట్స్‌లో కనిపించాయంటూ బీబీసీ ఓ పరిశోధాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ యాడ్స్ పలు టెలిగ్రామ్ ఛాన్సల్స్‌కు సంబంధించినవని పేర్కొంది. కేవలం 99 రూపాయలకే కంటెంట్ లభిస్తుందంటూ యాడ్స్ ఉన్నాయని పేర్కొంది.
బీబీసీ పరిశోధనాత్మక కథనంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. మెటా అధికారులను పిలిపించి విచారించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మెటాకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అసభ్యకరమైన ప్రకటనలను ఎలా అనుమతించారో చెప్పాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
సూజీ మంచూరియా.. తయారు చేసుకోండిలా..