-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 20th June 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 20 , 2026 | 06:06 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jun 20, 2026 21:55 IST
నేరస్తులకు కులాలను అంటగట్టొద్దు: పవన్ కల్యాణ్
క్రిమినల్స్‌ను వెనకేసుకొచ్చే నేతలను పక్కనపెట్టాలి: పవన్
డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు లేని కులం ఇప్పుడెందుకు వస్తోంది: పవన్
కులాల దరిద్రం వదిలితేనే ఏపీ బాగుపడుతుంది: పవన్
రానున్న మూడేళ్లలో వైసీపీకి నా యాక్షన్ చూపిస్తా: పవన్
-
Jun 20, 2026 21:43 IST
వైసీపీ బలమే కులం క్రిమినల్స్ ఉండడం: పవన్ కల్యాణ్
క్రిమినల్స్ పాలకులుగా ఉండకూడదు: పవన్ కల్యాణ్
నేరస్థులు రాజ్యాంగ పదవుల్లో కూర్చుని శాసిస్తామంటే జీవితాంతం పోరాడతా: పవన్ కల్యాణ్
వైసీపీ గూండాలను తొక్కిపట్టి నారతీస్తాం: పవన్ కల్యాణ్
-
Jun 20, 2026 21:42 IST
కాకినాడ: లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉండాలి: పవన్ కల్యాణ్
నేను హోంమంత్రిని కాను.. అది క్రిమినల్స్ అదృష్టం: పవన్
సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారు: పవన్
ఆధారాలు లేకపోతే ఎవరినీ ఏమీ చేయలేం: పవన్ కల్యాణ్
శవాలు లేస్తే గానీ వైసీపీకి సంతోషం రాదు: పవన్ కల్యాణ్
-
Jun 20, 2026 19:56 IST
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ భారత్ క్లీన్ స్వీప్
మూడో వన్డేలోనూ టీమిండియా విజయం
అఫ్గానిస్థాన్ 218, భారత్- 224/1
28.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్
సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్
-
Jun 20, 2026 19:46 IST
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
హోర్ముజ్ జలసంధిని మూసివేశాం: ఇరాన్
లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది: ఇరాన్
తాత్కాలిక ఒప్పందంలోని నిబంధనల అమలులో అమెరికా విఫలమైంది: ఇరాన్
-
Jun 20, 2026 19:46 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, హైటెక్ సిటీలో వర్షం
-
Jun 20, 2026 19:44 IST
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ మరో లేఖ
మెట్రో అంశంలో కేంద్రం సహకారం కోరుతూ లేఖ
రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని కోరిన రేవంత్
ఈనెల 22, 23న ఢిల్లీలోనే ఉంటానన్న సీఎం రేవంత్
అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరిన సీఎం రేవంత్
-
Jun 20, 2026 19:26 IST
ఈ నెల 24న కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
జొన్నగిరిలో గోల్డ్‌మైన్స్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
-
Jun 20, 2026 19:16 IST
TCA ఆరోపణలను ఖండించిన మంత్రి వివేక్
TCA జనరల్ సెక్రటరీ గురువారెడ్డి తప్పుడు ప్రచారం: మంత్రి వివేక్
HCA దగ్గర డబ్బు లేనప్పుడు ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి మేము నిధులు ఇచ్చాం: మంత్రి వివేక్
గతంలో HCA అపెక్స్ AGMలో విశాఖ షరతులను అంగీకరించారు: వివేక్
2011లో IPL హక్కుల వివాదం తర్వాత రూ.17 కోట్లు చెల్లిస్తామని అప్పటి HCA అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ ప్రతిపాదించారు: వివేక్
HCA-విశాఖ అంగీకరిస్తూ కోర్టులో ఉమ్మడి అఫిడవిట్ వేశారు: వివేక్
కానీ ఆ ఒప్పందాన్ని అమలు చేయలేదు: మంత్రి వివేక్
గురువారెడ్డికి పరువునష్టం నోటీసులు ఇచ్చాం: మంత్రి వివేక్
-
Jun 20, 2026 19:15 IST
హైదరాబాద్: గంజాయి లేడీ డాన్ నీతూబాయి విషయంలో పోలీసులు కీలక నిర్ణయం
నానక్‌రామ్‌గూడలో గంజాయి విక్రయాలకు అడ్డాగా మారిన నీతూబాయి కిరాణా దుకాణాన్ని కూల్చివేసిన అధికారులు
కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న నీతూబాయి
-
Jun 20, 2026 19:11 IST
RTI చట్టం దుర్వినియోగంపై ఏపీ సమాచార కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేసులో కీలక నిర్ణయం
ఫిర్యాదుదారుడి రెండో అప్పీల్‌ను కొట్టివేసిన సమాచార కమిషన్
ఒకే సమాచారంపై పదేపదే దరఖాస్తులు చేసినట్లు కమిషన్ గుర్తింపు
అధికారులను వేధించేందుకు RTI చట్టాన్ని వినియోగించొద్దు: కమిషన్
-
Jun 20, 2026 19:10 IST
నంద్యాల: మీనా ట్రావెల్స్ బస్సులో 3 కిలోల బంగారం చోరీ
డోన్ పోలీసులకు హైదరాబాద్ బంగారం వ్యాపారి ఫిర్యాదు
నిన్న అర్థరాత్రి బంగారం చోరీ జరిగినట్లు వ్యాపారి మోతీలాల్ ఫిర్యాదు
హిందూపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు
-
Jun 20, 2026 18:11 IST
రోహిత్ శర్మ-ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన ఘనత
అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మూడుసార్లు క్యాచ్ అందుకున్న రోహిత్ శర్మ
ఒకే ఇన్నింగ్స్‌లో ఒకే బౌలర్-ఫీల్డర్ మూడు వికెట్లు తీసుకున్న తొలి భారత జోడీగా ప్రసిద్ధ్-రోహిత్ రికార్డు
-
Jun 20, 2026 18:09 IST
పల్నాడు: గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది: సీఎం చంద్రబాబు
ఏపీని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం: చంద్రబాబు
సంపద సృష్టిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం: చంద్రబాబు
మనం ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలి: సీఎం చంద్రబాబు
-
Jun 20, 2026 17:46 IST
పశ్చిమ బెంగాల్: పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమ
-
Jun 20, 2026 17:46 IST
పల్నాడు: పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ
తొలివిడతగా రూ.7 వేలు చొప్పున రూ.3,125 కోట్లు జమ
-
Jun 20, 2026 17:28 IST
అమరావతి: అరుదైన వ్యాధిగ్రస్తులకు అండగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పాలసీ
ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు అదించేలా ప్రభుత్వం కార్యాచరణ
మూడు రిఫరల్ కేంద్రాలు, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు కసరత్తు
-
Jun 20, 2026 17:27 IST
పాకిస్థాన్: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో బాంబు పేలుళ్లు
వరుసగా పేలిన రెండు బాంబులు, ఏడుగురి మృతి
మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Jun 20, 2026 17:20 IST
భారత్‌తో ఆఖరి వన్డే: అఫ్గాన్ 218 పరుగులకు ఆలౌట్
44.2 ఓవర్లలో 218 పరుగులకు అఫ్గానిస్థాన్ ఆలౌట్
కెప్టెన్ హష్మతుల్లా షాహిది(102) సెంచరీ
అజ్ముతుల్లా ఒమర్జాయ్(50) హాఫ్ సెంచరీ
5 వికెట్లతో చెలరేగిన ప్రసిద్ధ్ కృష్ణ
భారత్ టార్గెట్ 219
-
Jun 20, 2026 16:57 IST
మహారాష్ట్ర: పర్భానీ జిల్లాలో విషాదం
యశ్వాడిలో కూలిన హనుమాన్ ఆలయ మండపం
నలుగురి మృతి, 10 మంది భక్తులకు గాయాలు
శిథిలాల కింద చిక్కుకున్న పలువురు భక్తులు
కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Jun 20, 2026 16:43 IST
నీట్ రాస్తున్న విద్యార్థులకు రాహుల్ శుభాకాంక్షలు
పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి: రాహుల్
ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్ష నిర్వహిస్తారని ఆశిస్తున్నాం: రాహుల్ గాంధీ
-
Jun 20, 2026 16:42 IST
VBG RAM G చట్టాన్ని వ్యతిరేకిస్తూ TG సర్కార్ నిరసన లేఖ
నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి సీతక్క లేఖ
చట్టంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కేంద్రానికి 3 వేర్వేరు లేఖలు
MGNREGSను యథాతథంగా కొనసాగించాలి: మంత్రి సీతక్క
గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలి: మంత్రి సీతక్క
-
Jun 20, 2026 16:41 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై బీజేపీ సన్నాహక సమావేశం
హాజరైన TBJP చీఫ్ రాంచందర్‌రావు, ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్
సంస్థాగతంగా పార్టీ బలోపేతం సహా ఇతర అంశాలపై చర్చ
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీబీజేపీ కార్యాచరణ
-
Jun 20, 2026 16:41 IST
హైదరాబాద్: రాయదుర్గం భూముల అంశంలో SBI తీరుపై ప్రభుత్వం ఆగ్రహం
SBIతో ఆర్థిక సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయం
డిపాజిట్లు, ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే అంశంపై పరిశీలన
-
Jun 20, 2026 16:40 IST
UAEలో భారత వీసా, పాస్‌పోర్ట్ సేవలకు బ్రేక్
ఈనెల 26 నుంచి 5 రోజులపాటు సేవలకు అంతరాయం
UAEలోని భారత రాయబార కార్యాలయం వెల్లడి
-
Jun 20, 2026 16:39 IST
నల్గొండ: మిర్యాలగూడ సిలిండర్ పేలుడు కేసులో ట్విస్ట్
ఈనెల 5న ముగ్గురు మృతి ఘటనపై పోలీసుల ఆరా
ధనమ్మ రెండో భర్త శిరీష్ కుమార్‌పై పోలీసుల అనుమానం
శిరీష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం
-
Jun 20, 2026 16:36 IST
దేశవ్యాప్తంగా 16 FDC ఔషధాలపై కేంద్రం నిషేధం
DTAB సిఫార్సులతో నిషేధం విధించిన కేంద్రం
ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయం
-
Jun 20, 2026 16:26 IST
ఆదిలాబాద్: నేరడిగొండలో కేటీఆర్ పర్యటన
బోథ్ నియోజకవర్గ BRS శ్రేణులతో కేటీఆర్ సమావేశం
SIR ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
-
Jun 20, 2026 16:23 IST
సిద్దిపేట: ప్రియుడి కోసం రెండేళ్ల కుమారుడిని చంపిన తల్లి
వివాహేతర సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని హత్య
ఫిట్స్‌తో కుమారుడు చనిపోయాడని భర్తను నమ్మించిన భార్య
భార్యను భర్త నిలదీయడంతో వెలుగులోకి హత్యా రహస్యం
బాలుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహణ
హత్య కేసులో తల్లి జ్యోతి అరెస్టు, పరారీలో ప్రియుడు నవీన్
-
Jun 20, 2026 16:19 IST
హైదరాబాద్: గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష, పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
మోదీకి కనువిప్పు కలగాలనే సత్యాగ్రహ దీక్ష: మహేశ్ గౌడ్
రాహుల్ నాయకత్వం కోసం యువత ఎదురుచూస్తోంది: మహేశ్ గౌడ్
రాహుల్ గాంధీ చేతిలోనే దేశ భవిష్యత్తు: మహేశ్ గౌడ్
బీజేపీకి రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు: మహేశ్ గౌడ్
-
Jun 20, 2026 16:03 IST
అమరావతి: అరుదైన వ్యాధిగ్రస్థులకు అండగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పాలసీ
ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు అదించేలా ప్రభుత్వం కార్యాచరణ
మూడు రిఫరల్ కేంద్రాలు, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు కసరత్తు
-
Jun 20, 2026 15:49 IST
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం.. బాబా రామ్దేవ్ ప్రత్యేక పూజలు
'సీఎం చంద్రబాబు విజనరీ లీడర్' అని బాబా రామ్‌దేవ్ ప్రశంసలు
అమరావతి దేవతల రాజధాని: బాబా రామ్‌దేవ్
జగన్మాత దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం: బాబా రామ్‌దేవ్
సనాతన ధర్మాన్ని కాపాడాలని బాబా రామ్‌దేవ్ పిలుపు
-
Jun 20, 2026 15:33 IST
భారత్‌తో వన్డే: 25 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్ 130/4
36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో అఫ్గాన్
జట్టును ఆదుకుంటున్న ఒమర్జాయ్(45*), హష్మతుల్లా(49*)
వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం
-
Jun 20, 2026 15:30 IST
కాకినాడ: ముద్రగడ పద్మనాభ రెడ్డికి తీవ్ర అస్వస్థత
వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు
ఈ నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో ముద్రగడను చేర్చిన కుటుంబసభ్యులు
అప్పటి నుంచి డయాలసిస్ చికిత్స అందిస్తున్న వైద్యులు
-
Jun 20, 2026 15:18 IST
శివసేనలో ఇక గ్రూపులు లేవు.. షిండే నేతృత్వంలోనిదే అసలైన శివసేన
మహారాష్ట్రలోని కొల్హాపూర్ బహిరంగ సభలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
కొల్హాపూర్‌లోని ప్రముఖ మాతా అంబాబాయి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా
దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని చెప్పిన అమిత్ షా
-
Jun 20, 2026 14:54 IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై సీఐడీకి ఫిర్యాదు
హెచ్‌సీఏపై ఫిర్యాదు చేసిన టీసీఏ జనరల్ సెక్రెటరీ గురువారెడ్డి
టీజీ-20 లీగ్ కోసం ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని ఫిర్యాదు
-
Jun 20, 2026 14:51 IST
విదేశీ ప్లేయర్లపై సునీల్ గావస్కర్ అసహనం
ఐపీఎల్‌ను తేలికగా తీసుకుంటే కఠిన చర్యలు: గావస్కర్
జట్టులో అవకాశాలు రాకపోతే గాయాల పేరుతో జట్టును వీడుతున్నారు: గావస్కర్
ఫేక్ ఇంజూరీతో టోర్నీ మధ్యలో వైదొలగడం సరైంది కాదు: గావస్కర్
-
Jun 20, 2026 14:34 IST
భారత్ vs అఫ్గానిస్తాన్ మూడో వన్డే: పీకల్లోతు కష్టాల్లో అఫ్గాన్
36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్
నాలుగు వికెట్లూ తన ఖాతాలో వేసుకున్న ప్రసిద్ధ్ కృష్ణ
13 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్ - 53/4
-
Jun 20, 2026 14:31 IST
వైభవ్‌పై శ్రీలంక-ఎ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముక్కోణపు సిరీస్: ఆదివారం భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య ఫైనల్ పోరు
గత మ్యాచ్‌లో లంక ప్లేయర్లతో వైభవ్ వాగ్వాదం
టార్గెట్ కాదు.. వైభవ్‌పై ఫోకస్ చేస్తాం: శ్రీలంక-ఎ కెప్టెన్
-
Jun 20, 2026 14:28 IST
ఇరాన్ మహిళకు శిక్షగా 74 కొరడా దెబ్బలు
హిజాబ్ ధరించకుండా మ్యూజిక్ ప్రదర్శన ఇచ్చినందుకు శిక్ష
రెండేళ్ల క్రితం మహిళపై కేసు.. తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు
ఘటనపై అంతర్జాతీయంగా విమర్శలు
-
Jun 20, 2026 14:24 IST
హైదరాబాద్: పనిగట్టుకుని హైడ్రాను బద్నాం చేస్తున్నారు: కమిషనర్ రంగనాథ్
రూ.1.10 లక్షల కోట్ల ఆస్తులు వెనక్కి తెచ్చాం: హైడ్రా కమిషనర్
హైడ్రా ఎవరికీ పక్షపాతంగా ఉండదు: కమిషనర్ రంగనాథ్
రాత్రికి రాత్రే కూలగొడుతున్నామనేది అవాస్తవం: రంగనాథ్
-
Jun 20, 2026 14:09 IST
ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన
ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబానికి పరామర్శ
కొనుగోలు కేంద్రంలోనే రైతు ఆత్మహత్య బాధాకరం: కేటీఆర్
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: కేటీఆర్
బాధిత కుటుంబానికి BRS అండగా ఉంటుంది: కేటీఆర్
-
Jun 20, 2026 14:04 IST
ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ పర్యటన
పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
రాయరంగాపూర్‌లో రూ.47 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనుల ప్రారంభం
-
Jun 20, 2026 13:56 IST
హైదరాబాద్: ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ACB దర్యాప్తు
శాలిబండలోని కెనరా బ్యాంక్‌లో లాకర్లు ఓపెన్ చేసిన ACB
లాకర్‌లో రూ.1.50 కోట్లు సీజ్ చేసిన ACB అధికారులు
ఇప్పటికే రూ.1.54 కోట్లు, 1.3 కేజీల బంగారం, 8 కేజీల వెండి సీజ్
రూ.5.4 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ.2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తింపు
-
Jun 20, 2026 13:30 IST
నీట్ రీఎగ్జామ్ సెంటర్ వివాదంలో NTAపై రాహుల్ విమర్శలు
విద్యార్థులు, వారి పేరెంట్స్ ఓపికను NTA పరీక్షిస్తోంది: రాహుల్
రీఎగ్జామ్‌కు నాగ్‌పూర్ విద్యార్థి నెల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు: రాహుల్
అబుదాబిలో పరీక్షా కేంద్రం చూసి విద్యార్థి షాక్ అయ్యాడు: రాహుల్
ఇది ఎలాంటి ఒత్తిడో మీరు ఊహించగలరా?: 'ఎక్స్'లో రాహుల్
-
Jun 20, 2026 13:29 IST
కాకినాడ: రిమాండ్ ఖైదీ, YCP ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్యపరీక్షలు
వైద్యపరీక్షల కోసం కాకినాడ GGHకి తీసుకొచ్చిన జైలు అధికారులు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అనంతబాబు
గ్యాస్ట్రిక్, వెన్నునొప్పి కారణంగా జైల్లో ప్రత్యేక సదుపాయాలు కోరిన అనంతబాబు
కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల కోసం GGHకి ఆనంతబాబు
-
Jun 20, 2026 13:28 IST
అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు: ఎక్స్‌లో నారా లోకేశ్
ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనే ధైర్యం ఆమె సొంతం: నారా లోకేశ్
ఇతరులకు సాయం కోసం ఆమె చూపిస్తున్న అంకితభావం గొప్ప స్ఫూర్తి: నారా లోకేశ్
ప్రేమ, మార్గదర్శకత్వంతో జీవితాన్ని తీర్చిదిద్దుతున్న విలువలకు ధన్యవాదాలు: నారా లోకేశ్
ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాగే సేవలందించాలని ఆకాంక్షిస్తున్నా: నారా లోకేశ్
-
Jun 20, 2026 13:25 IST
నారా భునేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
మంచి భార్య, తల్లి, వ్యాపారవేత్తగా మా జీవితాల్లో వెలుగులు నింపారు: సీఎం చంద్రబాబు
సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆమె తపన ఎంతోమందికి స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
ఆమె సౌమ్యత, దయాగుణం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి: సీఎం చంద్రబాబు
ఒక అద్భుత వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా పొందాను: సీఎం చంద్రబాబు
-
Jun 20, 2026 13:02 IST
కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
దక్షిణ లెబనాన్‌లో వైమానిక, డ్రోన్ దాడులు.. ఐదుగురి మృతి
శాంతి ఒప్పంద భవితవ్యంపై ఆందోళన
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం
-
Jun 20, 2026 12:58 IST
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్
భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు
-
Jun 20, 2026 12:50 IST
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
నెతన్యాహు ఓ యోధుడి లాంటి ప్రధానమంత్రి అని అభివర్ణన
వాషింగ్టన్ సమీపంలో నూతన ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ఆవిష్కరణ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్య
-
Jun 20, 2026 12:48 IST
బంగ్లాదేశ్‌లో హిందువుల నిరసన.. భారీ ర్యాలీ
ఢాకాలో వేల సంఖ్యలో హిందువుల ర్యాలీ
శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారంటూ జనాల ఆగ్రహం
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
శ్రీరాముడి విగ్రహ ఏర్పాటును అతివాదులు వ్యతిరేకిస్తున్నారని ఆరోపణ
-
Jun 20, 2026 12:47 IST
బీజేపీపై రేవంత్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
బొగ్గు స్కామ్‌పై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి లేఖ రాశారు: రాంచందర్‌రావు
స్కామ్‌పై సమాధానం చెప్పకుండా బీజేపీపై కాంగ్రెస్ బురదజల్లుతోంది: రాంచందర్‌రావు
సింగరేణిలో అటెండర్‌ను నియమించే అధికారం కూడా కేంద్రానికి లేదు: రాంచందర్‌రావు
బొగ్గు స్కామ్ బయటపడుతుందనే కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి నిరాధార విమర్శలు: రాంచందర్‌రావు
-
Jun 20, 2026 12:42 IST
విజయవాడ: సాయికృష్ణ అదృశ్యం కేసు
సాయికృష్ణ మిస్సింగ్ తర్వాత స్వర్గపురిలో ఖననమైన గుర్తు తెలియని మృతదేహాల వివరాలు సేకరిస్తున్న పోలీసులు
పోలీసుల అదుపులో స్వర్గపురిలో ఎలక్ట్రిక్ దహనాలు చేసే బాషా
విచారణ కోసం బాషాను పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు
బాషా ఫోన్ స్వాధీనం చేసుకున్న సీఐ పవన్ కిషోర్
-
Jun 20, 2026 12:39 IST
తెలంగాణలో ఈనెల 25 నుంచి SIR ప్రారంభం: CEO సుదర్శన్‌రెడ్డి
ఈ నెల 15 నుంచి 24 వరకు సన్నాహక ప్రక్రియ: CEO సుదర్శన్‌రెడ్డి
జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తాం: CEO
BLOలు తీసుకొచ్చే ఫామ్‌లను ముసాయిదాలో పొందుపరుస్తాం: CEO
జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల: CEO సుదర్శన్‌రెడ్డి
ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ: CEO సుదర్శన్‌రెడ్డి
-
Jun 20, 2026 12:33 IST
మరోసారి CIDకి ఫిర్యాదు చేయనున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
రేపటి నుంచి HCA ఆధ్వర్యంలో టీజీ20 క్రికెట్ లీగ్ ప్రారంభం
టీజీ20 లీగ్ నిర్వహణ కోసం క్రియేట్ చేసిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని ఫిర్యాదు చేయనున్న TCA
ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని కోరనున్న TCA
టీజీ20 పేరుతో రూ.కోట్లు దండుకోవాలని HCA ప్లాన్ చేసిందని TCA ఆరోపణ
-
Jun 20, 2026 12:24 IST
హైదరాబాద్‌లో సీ అండ్ డీ వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై ప్రభుత్వం చర్యలు
GHMC, CMC, MMC, ఇతర ప్రభుత్వ సంస్థలకు కొత్త మార్గదర్శకాలు
రోడ్లు, డ్రెయిన్లు, నాలాలు, చెరువులు, ఖాళీ స్థలాల్లో సీ అండ్ డీ వ్యర్థాల డంపింగ్ పూర్తిగా నిషేధం
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాల విధింపు
అనుమతుల రద్దు, నిలిపివేత, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేసే అవకాశం
-
Jun 20, 2026 12:15 IST
హ్యాపీ బర్త్ డే ఆర్కే సార్: మంత్రి నారా లోకేశ్
ప్రజాపక్షమైన అక్షరం.. ఆంధ్రజ్యోతి దినపత్రిక: మంత్రి నారా లోకేశ్
ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: లోకేశ్
-
Jun 20, 2026 11:50 IST
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన వేమూరి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచే జర్నలిజం ఆయనది: సీఎం చంద్రబాబు
జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శం: సీఎం చంద్రబాబు
-
Jun 20, 2026 11:46 IST
ఢిల్లీ: శివసేన(UBT) ఎంపీలకు షోకాజ్ నోటీసులు
ఇటీవల సమావేశానికి గైర్హాజరుపై వివరణ కోరుతూ నోటీసులు
24గంటల్లో వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశం
-
Jun 20, 2026 11:46 IST
హైదరాబాద్: కేటీఆర్‌కు MLA మైనంపల్లి హన్మంతరావు కౌంటర్
కేటీఆర్‌కు దమ్ముంటే మల్కాజ్‌గిరికి వచ్చి నిలబడాలి: మైనంపల్లి
ఇష్టానుసారం మాట్లాడితే తగిన విధంగా బుద్ధిచెబుతాం: మైనంపల్లి
ఇకపై దాడికి ప్రతిదాడి చేస్తాం.. BRSకు సినిమా చూపిస్తాం: మైనంపల్లి
ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: మైనంపల్లి
-
Jun 20, 2026 11:43 IST
ఖమ్మం: SIRపై ముఖ్య కార్యకర్తలతో మంత్రి తుమ్మల భేటీ
SIRపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం నియోజకవర్గంలో సగం ఓట్లు కూడా మ్యాపింగ్ కాలేదు: మంత్రి తుమ్మల
ఓట్లను కాపాడుకోలేకపోతే భవిష్యత్ రాజకీయం లేదు: మంత్రి తుమ్మల
SIR ప్రక్రియలో 55శాతానికి పైగా ఓట్లు కోల్పోయే పరిస్థితి: మంత్రి తుమ్మల
-
Jun 20, 2026 10:53 IST
నీట్ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపాలు
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయింపు
అడ్మిట్ కార్డు చూసి షాకైన విద్యార్థి, తల్లిదండ్రులు
మేం ఇచ్చిన ఆప్షన్లలో అటువంటి కేంద్రం ఏదీ లేదు: విద్యార్థి తండ్రి
హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేస్తే మెయిల్ చేయాలని చెప్పారు
సాయంత్రం 4గంటల లోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామన్నారు: విద్యార్థి తండ్రి
-
Jun 20, 2026 10:51 IST
తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
KFC, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే సహా హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు
KFCలో అపరిశుభ్రంగా నిల్వచేసిన చికెన్ గుర్తింపు
రెండు KFC రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చిన అధికారులు
-
Jun 20, 2026 10:50 IST
ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఆటగాడికి రెడ్‌కార్డ్
పరాగ్వే స్టార్ ఆటగాడు మిగెల్ అల్మిరాన్‌పై రిఫరీల చర్య
మైదానంలో నోటిని కవర్ చేసుకున్నాడన్న కారణంతో రెడ్‌కార్డ్
రిఫరీ నిర్ణయంపై అభిమానులు, విశ్లేషకుల మధ్య భిన్నాభిప్రాయాలు

-
Jun 20, 2026 10:43 IST
హనుమకొండలో నిర్మాత బండ్ల గణేష్ పర్యటన
బాలుడు నిరంజన్‌ను పరామర్శించిన బండ్ల గణేష్
బాలుడు నిరంజన్‌కు రూ.5లక్షల చెక్కు అందజేత
అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్
ఇటీవల బాలుడు నిరంజన్‌ను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Jun 20, 2026 10:42 IST
అమరావతి: యోగా సాధనతో బాబా రామ్‌దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారు: సీఎం చంద్రబాబు
బాబా రామ్‌దేవ్ శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయి: చంద్రబాబు
యోగాకు.. బాబా రామ్‌దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారు: చంద్రబాబు
యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద: చంద్రబాబు
ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉంది: సీఎం చంద్రబాబు
-
Jun 20, 2026 10:11 IST
అమరావతి: సీఎం చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడు: బాబా రామ్‌దేవ్
యోగా మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం: బాబా రామ్‌దేవ్
చంద్రబాబు అందరినీ సమానంగా చూస్తారు: బాబా రామ్‌దేవ్
అమరావతి దేవతల రాజధాని: బాబా రామ్‌దేవ్
ఇక్కడ 40శాతం పచ్చదనం, 60శాతం నిర్మాణాలు ఉంటాయి: బాబా రామ్‌దేవ్
-
Jun 20, 2026 10:10 IST
అమరావతి: ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం
బాబారామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు యోగా సాధన
బాబారామ్‌దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించిన సీఎం
వివిధ రకాల యోగా ప్రక్రియలను సీఎంకు వివరించిన బాబారామ్‌దేవ్
-
Jun 20, 2026 10:09 IST
మొయినాబాద్‌లో పాముకాటుతో వ్యక్తి మృతి
ఫామ్‌హౌస్‌లోకి వచ్చిన పామును పట్టుకుని వ్యక్తి ఆటలు
చేతిపై కాటేసిన పాము.. తనకు ఏమీ కాదంటూ నిర్లక్ష్యం
శరీరంలో మార్పులు రావడంతో ఆస్పత్రికి తరలింపు
ఉస్మానియాలో చికిత్స పొందుతూ సయ్యద్ మృతి
మృతుడు సయ్యద్ మొహిద్దీన్(30) రాజేంద్రనగర్ వాసిగా గుర్తింపు
-
Jun 20, 2026 10:06 IST
జగిత్యాల: సారంగాపూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం
ఆరుబయట నిద్రిస్తున్న 11 మందిపై పిచ్చికుక్క దాడి
గాయపడ్డవారికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
క్షతగాత్రులను పరామర్శించిన MLA సంజయ్‌కుమార్
-
Jun 20, 2026 10:05 IST
ఢిల్లీ: రాజ్‌నాథ్ నివాసంలో బీజేపీ, RSS సీనియర్ నేతల భేటీ
4గంటల పాటు సుదీర్ఘంగా సాగిన బీజేపీ, RSS అగ్రనేతల సమావేశం
బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే భేటీ జరగడంపై సర్వత్రా ఆసక్తి
-
Jun 20, 2026 09:51 IST
ఏఐని ఎలా వాడాలో తెలియకపోతే లేఆఫ్స్ ముప్పు మూడు రెట్లు!
అమెరికాలో 23 వేల మంది ఉద్యోగులపై సర్వే
ఏఐ వాడకం తెలియని టెక్ వర్కర్లకు లేఆఫ్స్ రిస్క్ 18 శాతం
గాలప్ సంస్థ సర్వేలో వెల్లడి
-
Jun 20, 2026 09:40 IST
అమరావతి: ఉండవల్లి గుహల వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు
బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రాణాయామం చేయనున్న సీఎం చంద్రబాబు
-
Jun 20, 2026 09:32 IST
హైదరాబాద్: రాయదుర్గంలో ప్రేమోన్మాది ఘాతుకం
యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి
బాధితుల కేకలతో నిందితుడిని పట్టుకున్న స్థానికులు
గాయపడ్డ యువతి, ఆస్పత్రికి తరలింపు
బాధితుల ఫిర్యాదుతో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు
-
Jun 20, 2026 09:29 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
రాష్ట్రపతి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా: సీఎం చంద్రబాబు
రాష్ట్రపతి జీవితం, ప్రజాసేవ.. కోట్ల మందికి స్ఫూర్తిదాయకం: ఎక్స్‌లో చంద్రబాబు
-
Jun 20, 2026 09:08 IST
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: అచ్చెన్నాయుడు
రైతుల పెట్టుబడి భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం: అచ్చెన్నాయుడు
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి అచ్చెన్నాయుడు
-
Jun 20, 2026 08:58 IST
భూపాలపల్లి: కేటీకే 5 ఇంక్లైన్ గని దగ్గర ఉద్రిక్తత
సింగరేణి కార్మికులతో కవిత సమావేశం
గని లోపలకు వెళ్లేందుకు నేతలు, కార్యకర్తల యత్నం
పోలీసులు, TRS శ్రేణుల మధ్య తోపులాట
-
Jun 20, 2026 08:42 IST
యూకేలో రెండు రైళ్లు ఢీ.. లోకోపైలట్ మృతి
ఇంగ్లండ్‌లోని బెడ్‌ఫోర్డ్ టౌన్‌కు సమీపంలో శుక్రవారం ఘటన
పదుల సంఖ్యలో ప్యాసింజర్లకు గాయాలు
బాధితులకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సంఘీభావం
-
Jun 20, 2026 07:58 IST
ఫిఫా ప్రపంచ కప్ 2026: మొరాకో విజయం
స్కాట్లాండ్‌పై 1-0 తేడాతో గెలిచిన మొరాకో
మొరాకో తరఫున గోల్ చేసిన ఇస్మాయిల్ సైబారి
-
Jun 20, 2026 07:36 IST
ఫిఫా వరల్డ్ కప్ 2026: నాకౌట్‌కు అర్హత సాధించిన యూఎస్ఏ
ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో యూఎస్ఏ గెలుపు
రౌండ్ ఆఫ్ 32కు చేరిన యూఎస్ఏ
-
Jun 20, 2026 07:36 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం పసిడి ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,850
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,690
18 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,380
-
Jun 20, 2026 07:19 IST
ఎన్టీఆర్: కలెక్టర్ లక్ష్మీశ పేరుతో సైబర్ మోసం
నకిలీ ఇన్‌స్టా ఖాతాను సృష్టించి డబ్బు పంపాలని మెసేజ్‌లు
విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
-
Jun 20, 2026 07:18 IST
నేడు అఫ్ఘానిస్థాన్‌తో భారత్ మూడో వన్డే
చెన్నైలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
-
Jun 20, 2026 07:17 IST
నేడు ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన
ఉదయం 11గంటలకు బోథ్ నియోజకవర్గంలో పర్యటన
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులకు పరామర్శ
బోథ్‌లో జనరల్ బాడీ సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్
-
Jun 20, 2026 06:38 IST
రేపు దేశవ్యాప్తంగా నీట్-యూజీ రీఎగ్జామ్
పరీక్ష రాయనున్న 22.79 లక్షలకుపైగా అభ్యర్థులు
నీట్ యూజీ రీఎగ్జామ్‌పై నేడు మాక్‌డ్రిల్
ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు మాక్‌డ్రిల్
-
Jun 20, 2026 06:37 IST
నేడు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్
-
Jun 20, 2026 06:37 IST
హైదరాబాద్: రాజస్థాన్‌కు చెందిన ట్రావెల్స్ బస్సు సీజ్
సరైన పత్రాలు, నిబంధనలు పాటించకపోవడంతో సీజ్
పుత్లిబౌలిలో బస్సును సీజ్ చేసిన RTA అధికారులు
ఖైరతాబాద్ RTA ఆఫీసులో రాత్రంతా ప్రయాణికుల పడిగాపులు
-
Jun 20, 2026 06:37 IST
హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా దీక్ష
దీక్షలో పాల్గొననున్న మహేష్‌కుమార్, సచిన్ సావంత్
-
Jun 20, 2026 06:36 IST
ఇవాళ, రేపు బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన
బహిరంగ సభ, రోడ్ షోలో పాల్గొననున్న ప్రధాని మోదీ
హుగ్లీలో పశ్చిమబంగ దివస్ వేడుకలు
పలు ఆభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు
23వ విడత కిసాన్ నిధులను విడుదల చేయనున్న మోదీ
-
Jun 20, 2026 06:06 IST
అమరావతి: నేడు ఉండవల్లి గుహల్లో యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు
సీఎం చంద్రబాబు సమక్షంలో యోగా ప్రదర్శనలు
యోగా గురు బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగాసనాలు వేయనున్న సీఎం చంద్రబాబు
యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారుల పిలుపు