Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 19 , 2026 | 07:02 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 19, 2026 21:10 IST

    హైదరాబాద్‌: దోమలగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం

    • ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన స్నేహ, లలిత, లత

    • హిమాయత్‌నగర్‌లో బాలికలు ఆటో ఎక్కినట్లు గుర్తింపు

    • కాచిగూడ రైల్వేస్టేషన్‌ దగ్గర ఆటో దిగినట్లు CCTVలో నిర్ధారణ

    • ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కుటుంబాల బాలికలుగా గుర్తింపు

    • మైనర్ల తల్లిదండ్రుల ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు

    • బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాల గాలింపు

  • Jul 19, 2026 21:08 IST

    అల్లూరి జిల్లా: పాడేరు ఘాట్ రోడ్డులో బొలెరో వాహనం బోల్తా

    • ఒకరి మృతి, పది మందికి గాయాలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 19, 2026 20:32 IST

    హైదరాబాద్‌: కేంద్రమంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ

    • 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై బండి సంజయ్ ఆగ్రహం

    • నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేస్తున్నారు: బండి సంజయ్

    • అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయట్లేదు: బండి సంజయ్

    • గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది: బండి సంజయ్

    • నిధుల వినియోగంపై ఆడిట్ నిర్వహించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్

  • Jul 19, 2026 20:31 IST

    ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని ప్రారంభిస్తారు: ఎంపీ కలిశెట్టి

    • ఎయిర్‌పోర్టుపై జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి: ఎంపీ కలిశెట్టి

    • ఉత్తరాంధ్ర ప్రజలను జగన్‌ అవమానించారు: ఎంపీ కలిశెట్టి

    • 5 కోట్ల మంది ఆంధ్రుల కల సాకారం అవుతోంది: ఎంపీ కలిశెట్టి

  • Jul 19, 2026 20:31 IST

    వివాదాలతో డ్యాన్సర్లు ఇబ్బందిపడ్డారు: జానీ మాస్టర్‌ భార్య సుమలత

    • పెద్దలంతా మా బాధ అర్థంచేసుకున్నారు: సుమలత

    • కార్మికుల కష్టం వారికే దక్కాలి: సుమలత

    • డ్యాన్సర్ల అసోసియేషన్‌ గొడవ ముగిసింది: జానీ మాస్టర్‌ భార్య సుమలత

  • Jul 19, 2026 20:30 IST

    నా వివరణతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సంతృప్తి చెందింది: జానీ మాస్టర్‌

    • నాతో, శేఖర్‌తో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడారు: జానీ మాస్టర్‌

    • యూనియన్‌ సమస్యను పరిష్కరించారు: జానీ మాస్టర్‌

    • బాలకృష్ణ కూడా సమస్యపై స్పందించారు: జానీ మాస్టర్‌

    • వివాదం సద్దుమణిగిందని భావిస్తున్నా: జానీ మాస్టర్‌

  • Jul 19, 2026 20:29 IST

    హైదరాబాద్‌: డ్యాన్స్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ వివాదం

    • సుమలత ఆధ్వర్యంలోనే కార్యవర్గం: ఫిల్మ్‌ ఫెడరేషన్

    • ఆరోపణలు ఉన్నవారిపై చర్యలు: వల్లభనేని అనిల్

    • అసోసియేషన్‌లో ఎలాంటి గొడవలూ లేవు: వల్లభనేని అనిల్

    • ఈనెల 26న అందరం మరోసారి చర్చిస్తాం: ఫిల్మ్‌ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్

  • Jul 19, 2026 19:37 IST

    విశాఖ: పెందుర్తి మేఘాద్రి రిజర్వాయర్‌లో విషాద ఘటన

    • రిజర్వాయర్‌లో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థుల మృతి

    • మృతులు దీపక్ (17), రామచంద్రరావు (18)గా గుర్తింపు

    • గజ ఈతగాళ్లతో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు

  • Jul 19, 2026 19:35 IST

    కర్నూలు: నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్

    • తల్లికి వందనం పథకం పేరుతో వచ్చే నకిలీ లింకులతో జాగ్రత్త: ఎస్పీ విక్రాంత్ పాటిల్

    • తెలియని వ్యక్తులు పంపిన లింకులను క్లిక్ చేయొద్దు

    • వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దు: ఎస్పీ విక్రాంత్ పాటిల్

  • Jul 19, 2026 19:29 IST

    ఇంగ్లండ్‌తో చివరి వన్డే: భారత్ టార్గెట్ 388

    • 3 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్

    • ఓపెనర్ బెన్ డకెట్(141) భారీ సెంచరీ

    • బెథెల్(91), జో రూట్(74*) హాఫ్ సెంచరీలు

    • ప్రసిద్ధ్ కృష్ణకు 2, ప్రిన్స్ యాదవ్‌కు ఒక వికెట్

  • Jul 19, 2026 18:20 IST

    భారత్‌తో మూడో వన్డే: డకెట్ సూపర్ సెంచరీ

    • 15 ఫోర్ల సాయంతో సెంచరీ బాదేసిన ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్(102*)

    • త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న బెథెల్(91)

    • 36 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 226/1

  • Jul 19, 2026 18:00 IST

    తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

    • సీజనల్ పరిస్థితుల పర్యవేక్షణకు ప్రత్యేక IASల నియామకం

    • పాత 10 జిల్లాలకు ఒక్కో స్పెషల్ ఆఫీసర్ నియామకం

    • వర్షపాతం, తాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్‌పై ప్రత్యేక నిఘా

    • రేపటి నుంచి జిల్లాల పర్యటనకు ప్రత్యేక అధికారులు

  • Jul 19, 2026 17:45 IST

    విజయవాడ: ముంబై నటి జెత్వాని కేసులో CID చార్జ్‌షీట్‌

    • CID విచారణలో వెలుగులోకి కీలక విషయాలు

    • విద్యాసాగర్‌ను జెత్వాని బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు చార్జ్‌షీట్‌

    • విద్యాసాగర్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.1.32 కోట్ల వసూళ్లు

    • బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన ఆధారాలతో CID చార్జ్‌షీట్‌

    • జెత్వాని కేసులో ఇప్పటికే ముగ్గురు IPSల సస్పెన్షన్‌

    పూర్తి కథనం..

  • Jul 19, 2026 17:30 IST

    జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సింధుకు సీఎం చంద్రబాబు అభినందనలు

    • భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో మైలురాయి: సీఎం చంద్రబాబు

    • భారత్‌కు మరోసారి గర్వకారణంగా సింధు నిలిచింది: సీఎం చంద్రబాబు

  • Jul 19, 2026 17:26 IST

    హైదరాబాద్: ఎల్‌నినోపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ అలర్ట్

    • జిల్లా కలెక్టర్లకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

    • రేపు అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు

  • Jul 19, 2026 17:15 IST

    హైదరాబాద్: ఈగల్‌ ఫోర్స్‌, NCB సంయుక్త దాడులు

    • మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో తనిఖీలు

    • అల్ఫ్రాజోలమ్ తయారీ యూనిట్‌ను ధ్వంసం చేసిన పోలీసులు

    • కిలోకు పైగా అల్ఫ్రాజోలమ్ స్వాధీనం, 12 మంది అరెస్టు

    • పరారీలో ఉన్న మరో 23 మంది కోసం పోలీసుల గాలింపు

  • Jul 19, 2026 17:00 IST

    సంగారెడ్డి: నారాయణఖేడ్‌ పరిధిలో ప్రేమ పేరుతో మోసం

    • యువతిని గర్భవతి చేసి ముఖం చాటేసిన నర్సింగ్‌ అధికారి

    • ప్రభుత్వాస్పత్రిలో ANM ట్రైనింగ్ తీసుకుంటున్న యువతి

    • బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

  • Jul 19, 2026 16:45 IST

    అంబేద్కర్ కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో విషాద ఘటన

    • బీచ్‌లో స్నానానికి దిగి ముగ్గురి గల్లంతు

    • ఒడ్డుకు కొట్టుకు వచ్చిన రెండు మృతదేహాలు.. మరో మృతదేహం కోసం గాలింపు

    • మృతులు అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన వారిగా సమాచారం

  • Jul 19, 2026 16:33 IST

    ఫిఫా ప్రపంచ కప్ స్పెయిన్‌దే: రొనాల్డో నజారియో

    • మరికొద్ది గంటల్లో అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఫైనల్ పోరు

    • అర్జెంటీనాను స్పెయిన్ ఓడగొడుతుందంటూ బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం నజారియో జోస్యం

    పూర్తి కథనం..

  • Jul 19, 2026 16:27 IST

    విజయవాడ: లాకప్‌డెత్‌ అయిన సాయికృష్ణకు కర్మకాండ

    • సాయికృష్ణ బూడిద లేకుండానే కర్మకాండ చేసిన కుటుంబ సభ్యులు

  • Jul 19, 2026 16:25 IST

    హైదరాబాద్‌: ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

    • సాగునీటి సంఘాల ఆర్థిక బలోపేతానికి కార్యాచరణపై రివ్యూ

    • సాగునీటి సంఘాల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదన

  • Jul 19, 2026 16:18 IST

    అమరావతి: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌

    • గతంలో బల్లగరువు పర్యటనలో హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • రూ.కోటి నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించిన పవన్‌ కల్యాణ్

  • Jul 19, 2026 16:16 IST

    ఢిల్లీ: వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించిన ప్రభుత్వ నిర్ణయం సరైనదే: ఢిల్లీ హైకోర్టు

    • ప్రభుత్వ చర్య ఏకపక్షం కాదని స్పష్టం చేసిన హైకోర్టు

    • ప్రాణరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమంజసమే: హైకోర్టు

    పూర్తి కథనం..

  • Jul 19, 2026 16:14 IST

    రైతుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించాలి: ఎంపీ బాలశౌరి

    • నేషన్ ఫస్ట్ విధానంతో పార్లమెంట్‌లో వ్యవహరిస్తాం: ఎంపీ బాలశౌరి

    • విభజన చట్టంలో పెండింగ్ హామీలను అమలు చేయాలని కోరాం: బాలశౌరి

    • జల్ జీవన్ మిషన్‌ కింద ఏపీకి తగిన నిధులు ఇవ్వాలి: ఎంపీ బాలశౌరి

  • Jul 19, 2026 16:14 IST

    మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • డీలిమిటేషన్‌ అంశంలో దక్షిణాదికి అన్యాయం చేయొద్దు: ఎంపీ చామల

    • బీజేపీ నీతులు చెప్పడం మానుకోవాలి: ఎంపీ చామల

    • అయోధ్య విరాళాలపై పార్లమెంట్‌లో చర్చించాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • Jul 19, 2026 16:02 IST

    వరంగల్‌ కాంగ్రెస్‌ కార్యకర్త మహేష్‌ మృతి

    • రౌడీషీటర్‌ పత్తి కుమార్‌ పెట్రో దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహేష్

    • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

  • Jul 19, 2026 16:02 IST

    సిద్ధిపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసింది: మాజీ మంత్రి హరీశ్ రావు

    • ఎన్నికల ముందు దేవుడిపై ప్రమాణాలు చేసి మాట తప్పారు: హరీశ్ రావు

    • రుణమాఫీ నుంచి నీళ్ల వరకూ రైతులను మోసం చేశారు: హరీశ్ రావు

    • సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలి: హరీశ్ రావు

    • ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు: హరీశ్ రావు

    • కేసీఆర్‌ హయాంలో పదేళ్లు కరువు రాలేదు: మాజీ మంత్రి హరీశ్ రావు

  • Jul 19, 2026 16:00 IST

    సిద్ధిపేట: రైతుల మహా పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు

    • అనంతగిరి నుంచి రంగనాయక సాగర్‌ వరకూ పాదయాత్ర

    • కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్

  • Jul 19, 2026 15:31 IST

    జమ్మూకశ్మీర్‌: పూంఛ్‌, రాజౌరిలో ఆకస్మిక వరదలు

    • కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి, పలువురి గల్లంతు

  • Jul 19, 2026 15:28 IST

    హైదరాబాద్: యువతను రెచ్చగొట్టేందుకే BRS సంగ్రామ సభ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌

    • తెలంగాణ ఉద్యమంలోనూ యువతను రెచ్చగొట్టి అనేకమంది బలిదానాలకు కారణమయ్యారు

    • పింక్‌ పెయిడ్‌ ఆర్టిస్టులతో యువ సంగ్రామ సభ నిర్వహించారు: ఆది శ్రీనివాస్‌

    • కేటీఆర్‌ ఉన్మాదిలా వికృత వ్యాఖ్యలు చేశారు: ఆది శ్రీనివాస్‌

    • నిరుద్యోగుల‌ను అడ్డుపెట్టుకుని రాజ‌కీయమా?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌

  • Jul 19, 2026 15:26 IST

    ఢిల్లీ: వాంగ్‌చుక్‌ ఆరోగ్యంపై సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

    • నిలకడగా సోనమ్ వాంగ్‌చుక్‌ ఆరోగ్యం: వైద్యులు

    • 20 రోజులపాటు నిరాహారదీక్ష వల్లే తీవ్ర నీరసం: వైద్యులు

    పూర్తి కథనం..

  • Jul 19, 2026 15:22 IST

    కరీంనగర్: కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌

    • యువతను KTR రెచ్చగొడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు

    • గ్రూప్-1 పరీక్షలను BRS ఎందుకు నిర్వహించలేదు?: శ్రీధర్‌బాబు

    • నిరుద్యోగులకు KTR క్షమాపణ చెప్పాలి: శ్రీధర్‌బాబు

    • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగాలు వచ్చాయి: శ్రీధర్‌బాబు

    • BRS పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?: మంత్రి శ్రీధర్‌బాబు

    పూర్తి కథనం..

  • Jul 19, 2026 14:41 IST

    కరీంనగర్: ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది: మంత్రి తుమ్మల

    • తాగునీటికీ ఇబ్బందులు రావొచ్చు: మంత్రి తుమ్మల

    • ప్రాజెక్టుల నుంచి నీళ్లిచ్చే పరిస్థితి లేదు: మంత్రి తుమ్మల

    • రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి: మంత్రి తుమ్మల

    • శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి: మంత్రి తుమ్మల

    • తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా చూడాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • Jul 19, 2026 14:39 IST

    ఢిల్లీ: కేంద్రం ఆధ్వర్యంలో ముగిసిన అఖిలపక్ష భేటీ

    • రెండు గంటల పాటు కొనసాగిన అఖిలపక్ష సమావేశం

    • పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కోరిన కేంద్రం

  • Jul 19, 2026 14:08 IST

    పీవీ సింధుకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • జపాన్ ఓపెన్‌లో సింధు ఆటతీరు అద్భుతం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • భారత బ్యాడ్మింటన్‌కు మరో గౌరవం దక్కింది: ఎక్స్‌లో పవన్ కల్యాణ్

  • Jul 19, 2026 14:06 IST

    పీవీ సింధుకు అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేశ్

    • జపాన్ ఓపెన్ ఛాంపియన్‌గా సింధు చరిత్ర సృష్టించింది: మంత్రి నారా లోకేశ్

    • సింధు అసాధారణ ఆటతీరు కనబరిచింది: ఎక్స్‌లో మంత్రి లోకేశ్

  • Jul 19, 2026 13:59 IST

    ఢిల్లీ: సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి హెల్త్ బులెట్ విడుదల

    • సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

    • గత 20 రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా సుదీర్ఘంగా ఉపవాసం చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్న వైద్యులు

    • నిరాహార దీక్షతో తీవ్ర నీరసం వచ్చిందని పేర్కొన్న వైద్యులు

    • ఆసుపత్రిలో చేర్చే సమయానికి ఆయన పూర్తి స్పృహతో ఉన్నారని వెల్లడి

  • Jul 19, 2026 13:56 IST

    ఢిల్లీ: ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ సందేశం

    • జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు

    • ఈ నిరసనలు రెండో స్వాతంత్ర్య పోరాటమని వ్యాఖ్య

    • పేపర్ లీక్స్ వంటి అన్యాయాల నుంచి విముక్తి కావాలని డిమాండ్

  • Jul 19, 2026 13:51 IST

    అంబేద్కర్ కోనసీమ జిల్లా: రావులపాలెం మండలం ఊబలంకలో విషాదం

    • కాలువలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

    • కూతురు సూర్యవతి మృతదేహం లభ్యం, తల్లి మృతదేహం కోసం గాలింపు

    • ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన మీసాల సూర్యావతి(60), వాడపల్లి బూరమ్మ(80)

    • ఆత్మహత్యకు కారణాలపై విచారిస్తున్న పోలీసులు

    • కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న రావులపాలెం పోలీసులు

  • Jul 19, 2026 13:46 IST

    పీవీ సింధుకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  • Jul 19, 2026 13:31 IST

    బండి సంజయ్, ఈటల ఎపిసోడ్‌పై స్పందించిన రాజాసింగ్

    • బీజేపీలో ఇతర సీనియర్ల పరిస్థితిపైనా దృష్టి పెట్టాలని సూచన

    • లక్ష్మణ్, అభయ్ పాటిల్.. మిగతా వాళ్లను కూడా సమన్వయం చేయాలి: రాజాసింగ్

    • గ్రౌండ్ లెవల్‌లో పార్టీ పరిస్థితి భిన్నంగా ఉంది: రాజాసింగ్

    • రామ్‌చందర్‌రావు సారథ్యంలో నేతలు కలిసి పనిచేయాలి: రాజాసింగ్

    • పార్టీ అంతర్గత సమస్యలపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టాలి: రాజాసింగ్

  • Jul 19, 2026 13:20 IST

    హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం

    • ఏడాదిలో 563 NDPS కేసుల నమోదు

    • రూ.22.17 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

    • 2,513 కిలోల గంజాయి, 55.3 లీటర్ల హ్యాష్ ఆయిల్ సీజ్

    • MDMA, కొకైన్, హెరాయిన్, LSD, ఓపియం పట్టివేత

    • జూబ్లీహిల్స్ జోన్‌లో అత్యధికంగా 116 కేసులు

    • ఆపరేషన్ థండర్‌బోల్ట్‌లో 1,550 మందికి డ్రగ్ టెస్టులు

  • Jul 19, 2026 13:10 IST

    హైదరాబాద్: పలువురు కాంగ్రెస్ నేతల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

    • కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయడం లేదు: సీఎం

    • ఆగస్ట్ 3 వరకు నేతలెవరూ గాంధీభవన్‌కు రావొద్దు: సీఎం

    • వచ్చే 10 రోజులు నాయకులు క్షేత్రస్థాయిలోనే ఉండాలి: సీఎం

    • చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్‌ చుట్టూ తిరగొద్దు: సీఎం

    • పదవుల కోసం పైరవీలు చేసేవారికి అపాయింట్‌మెంట్‌లు ఇవ్వొద్దు: సీఎం

  • Jul 19, 2026 12:52 IST

    హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన ఒకేలా ఉంది: టీబీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

    • యువతను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయి: మహేశ్వర్‌రెడ్డి

    • కేసీఆర్, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది: మహేశ్వర్‌రెడ్డి

    • తొమ్మిదన్నరేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలిచ్చింది: మహేశ్వర్‌రెడ్డి

    • నిరుద్యోగంపై మాట్లాడే అర్హత కేటీఆర్, రేవంత్‌కు లేదు: మహేశ్వర్‌రెడ్డి

    • ఇద్దరి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు: మహేశ్వర్‌రెడ్డి

    • నిరుద్యోగ యువతను ఓటు బ్యాంక్‌గా చూడొద్దు: మహేశ్వర్‌రెడ్డి

    • కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: మహేశ్వర్‌రెడ్డి

  • Jul 19, 2026 12:50 IST

    నెలకు ఒక రాకెట్ ప్రయోగం చేపట్టడమే టార్గెట్: స్కైరూట్ సీఈఓ

    • ఈ ఏడాది మరో ప్రయోగానికి ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడి

    • వచ్చే ఏడాది ప్రయోగాల సంఖ్య మరింత పెరుగుతుందన్న సీఈఓ

    • విక్రమ్-2 రాకెట్‌పై కూడా దృష్టి సారించినట్టు వెల్లడి

  • Jul 19, 2026 11:48 IST

    ఢిల్లీ: తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎన్‌టీఏ వార్నింగ్

    • ఏఐతో చేసిన ఓఎమ్‌ఆర్ షీట్స్‌తో ఫిర్యాదులు చేయొద్దని వార్నింగ్

    • అసలైన ఓఎమ్ఆర్ షీట్స్ కాపీలనే వాడాలని స్పష్టీకరణ

    • ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

  • Jul 19, 2026 11:21 IST

    చరిత్ర సృష్టించిన స్టార్ షట్లర్ పీవీ సింధు

    • జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా సింధు

    • జపాన్ ప్లేయర్ యమగుచిపై సింధు ఘన విజయం

    • 21-17, 21-17తో యమగుచిని ఓడించిన సింధు

  • Jul 19, 2026 11:18 IST

    ఢిల్లీ: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

    • హాజరైన అమిత్ షా, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, మేఘవాల్

    • సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరనున్న కేంద్రం

    • రేపటి నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

  • Jul 19, 2026 11:02 IST

    ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో

    • వాంగ్‌చుక్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి కోరుతూ పిటిషన్

    • ప్రభుత్వ ఆస్పత్రిలో బలవంతంగా ఉంచుతున్నారని ఆరోపణ

    • ప్రభుత్వ వైద్య చికిత్సపై నమ్మకం కోల్పోయామని పిటిషన్‌లో పేర్కొన్న గీతాంజలి

    • డిశ్చార్జ్ చేయడం లేదని ఆస్పత్రి అధికారులపై ఆరోపణలు

  • Jul 19, 2026 10:19 IST

    తిరుమల: రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం

    • హరిణి సమీపంలో బోల్తా పడ్డ కారు

    • పలువురు భక్తులకు స్వల్ప గాయాలు

  • Jul 19, 2026 10:15 IST

    చైనాలో తొలి హ్యూమనాయిడ్ రోబో ఫైట్ టోర్నమెంట్ ప్రారంభం

    • పోరులో రోబో తల ఊడిపోయినా కొనసాగిన పోరాటం

    • మ్యాచ్‌లో విజయం సాధించిన వైట్ ఈగల్ రోబో

    • ఓటమి తర్వాత డ్యాన్స్‌తో సంబరాలు చేసిన వైట్ ఈగల్

    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

  • Jul 19, 2026 10:12 IST

    హైదరాబాద్: టీబీజేపీ నేతలతో అభయ్ పాటిల్ వరుస భేటీలు

    • రాంచందర్‌రావుతో అభయ్ పాటిల్ బ్రేక్‌‌ఫాస్ట్ మీటింగ్

    • హైకమాండ్ ఆదేశాలతో అభయ్ పాటిల్ ఆపరేషన్ సయోధ్య

    • నిన్న బండి సంజయ్, ఈటలతో అభయ్ పాటిల్ భేటీ

    • ఆ తర్వాత ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో సమావేశమైన అభయ్

    • వరుస సమావేశాలపై రాంచందర్‌రావుతో అభయ్ పాటిల్ చర్చ

  • Jul 19, 2026 10:11 IST

    జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు

    • వరదల్లో కొట్టుకుపోయి నలుగురి మృతి

    • పలువురు గల్లంతు, గాలిస్తున్న సహాయక బృందాలు

    • పూంచ్ జిల్లా సూరన్‌కోట్ ప్రాంతంలో ఘటన

  • Jul 19, 2026 09:57 IST

    చైనా AI స్టార్టప్ మూన్‌షాట్ కొత్త Kimi K3 మోడల్ ఆవిష్కరణ

    • ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్-వెయిట్ AI మోడల్‌గా ప్రకటించిన కంపెనీ

    • 2.8 ట్రిలియన్ పారామీటర్లతో అధునాతన AI సామర్థ్యాలు

    • 10 లక్షల టోకెన్ల కాంటెక్స్ట్ విండోతో భారీ సమాచారాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం

    • అమెరికా AI మోడళ్లకు గట్టి పోటీగా Kimi K3 నిలుస్తుందని కంపెనీ వెల్లడి

  • Jul 19, 2026 09:55 IST

    భద్రాద్రి రామాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూజలు

    • రామాలయ అభివృద్ధి పనుల పరిశీలన

    • పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశం

    • నాణ్యతతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలి: పొంగులేటి

    • ప్రధాన రహదారిపై స్థానికుల విజ్ఞప్తులను పరిశీలించాలి: పొంగులేటి

    • భక్తులకు ఇబ్బంది లేకుండా పనులు చేయాలి: పొంగులేటి

  • Jul 19, 2026 09:54 IST

    ఖమ్మం: సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా వర్షం

    • ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

    • 95వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు ఆటంకం

  • Jul 19, 2026 09:46 IST

    విశాఖ: ఆర్కే బీచ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం

    • ప్రాణాలతో బయటపడిన తెలంగాణకు చెందిన పర్యాటకురాలు

    • స్నానానికి దిగిన ముగ్గురు మహిళలు

    • సముద్ర కెరటాల దాటికి కొంత దూరం కొట్టుకుపోయిన సుజాత (56)

    • కొట్టుకుపోతున్న మహిళను గుర్తించి సకాలంలో కాపాడిన బీచ్ లైఫ్ గార్డ్ ఎం ధనరాజు

  • Jul 19, 2026 09:41 IST

    విశాఖ: గండిగుండం రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

    • ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి

    • ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరం

    • మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత

  • Jul 19, 2026 09:40 IST

    చైనాలో భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు

    • బండరాళ్లు, మట్టి కుప్పకూలడంతో భవనాలు ధ్వంసం

    • చైనాలో భారీ వర్షాలకు 8 మంది మృతి, 34 మంది గల్లంతు

  • Jul 19, 2026 09:39 IST

    రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు

    • 9 మంది మృతి, 60 మందికి గాయాలు

  • Jul 19, 2026 09:14 IST

    ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు

    • జోర్డాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికుల మృతికి ప్రతీకార చర్య

    • ట్రంప్ ఆదేశాలతో దాడులు నిర్వహించిన అమెరికా

    • ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యమన్న అమెరికా సైనిక దళాలు

    • హోర్ముజ్ జలసంధిలో ముప్పును తగ్గించడమే ఉద్దేశమని అమెరికా వెల్లడి

  • Jul 19, 2026 09:02 IST

    తండ్రి కోసం 3 గంటల పాటు వరద నీటిలో ఈత

    • చైనాలో వెలుగు చూసిన ఘటన

    • వరద ముంచెత్తడంతో ప్రమాదంలో పడ్డ తండ్రి

    • వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి కాపాడిన తనయుడు

  • Jul 19, 2026 08:59 IST

    కర్నూలు: రిటైర్డ్ ఏఆర్ ASI అనుమానాస్పద మృతి

    • ప్రభుత్వ ఆస్పత్రి సర్జికల్ వార్డు దగ్గర ఘటన

    • హత్యా? ఆత్మహత్య? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

  • Jul 19, 2026 08:58 IST

    హైదరాబాద్: హయత్‌నగర్‌లో విషాదం

    • ఫ్యామిలీ ప్లానింగ్ శస్త్రచికిత్స కోసం వచ్చిన మహిళ మృతి

    • డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు

  • Jul 19, 2026 07:47 IST

    హైదరాబాద్: పాతబస్తీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి దారుణ హత్య

    • విద్యార్థి అజాన్‌ను కత్తితో పొడిచి చంపిన దుండగుడు

    • పరారీలో నిందితుడు, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు

    • కాలాపత్తర్ పీఎస్ పరిధిలోని టిక్రీ దగ్గర ఘటన

  • Jul 19, 2026 07:46 IST

    నేడు ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్

    • ఫైనల్‌లో అర్జెంటీనాతో తలపడనున్న స్పెయిన్

    • అర్ధరాత్రి 12.30గంటలకు మ్యాచ్

  • Jul 19, 2026 07:43 IST

    అనకాపల్లి-అయోధ్య, కాశీ దివ్య దర్శన యాత్ర

    • నేడు తొలి విడత ప్రత్యేక రైలుకు శ్రీకారం

    • అనకాపల్లిలో రైలును ప్రారంభించనున్న ఎంపీ సీఎం రమేష్‌

  • Jul 19, 2026 07:24 IST

    ఫిఫా ప్రపంచ కప్2026: మూడో స్థానంలో ఇంగ్లండ్

    • టోర్నీని విజయంతో ముగించిన ఇంగ్లండ్

    • ఫ్రాన్స్‌పై 6-4 తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం

  • Jul 19, 2026 07:12 IST

    మెదక్: నేడు రైతుల మహా పాదయాత్ర

    • అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర

    • కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్

    • రైతుల పాదయాత్రలో పాల్గొననున్న హరీశ్ రావు

  • Jul 19, 2026 07:11 IST

    నేడు తెలంగాణ భవన్‌లో 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమం

    • మహిళా సంఘం NGO ఆధ్వర్యంలో కార్యక్రమం

    • కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్

  • Jul 19, 2026 07:11 IST

    నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన

    • వేర్వేరుగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు

  • Jul 19, 2026 07:08 IST

    విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

    • గండిగుండం జంక్షన్ దగ్గర లారీని ఢీకొట్టిన కారు

    • నలుగురి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

    • తీవ్రగాయాలతో బయటపడ్డ వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్

    • మృతుల్లో వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుమారుడు

    • గుంటూరు నుంచి టెక్కలి వెళ్తుండగా ఘటన

  • Jul 19, 2026 07:08 IST

    అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రలు తాత్కాలికంగా నిలిపివేత

    • భారీ వర్షాల హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్త చర్యలు

    • నేటి నుంచి పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో భక్తుల అనుమతి రద్దు

    • బేస్ క్యాంపుల దగ్గరే నిలిపివేత

    • వాతావరణం అనుకూలించే వరకు వైష్ణోదేవి దర్శనాల నిలిపివేత

    • నేటి నుంచి ఈనెల 23 వరకు జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న IMD

  • Jul 19, 2026 07:07 IST

    నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన

    • పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో రివ్యూలు

    • స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో శాంతిభద్రతలపై చర్చ

  • Jul 19, 2026 07:04 IST

    నేడు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం

    • వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సమావేశం

  • Jul 19, 2026 07:04 IST

    అహ్మదాబాద్ పేలుడు ఘటనలో 9కి చేరిన మృతులు

    • నిన్న రామోల్ ప్రాంతంలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు

    • మరో 10మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం

    • మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున కేంద్రం పరిహారం

  • Jul 19, 2026 07:03 IST

    జోర్డాన్‌పై మిసైల్స్, డ్రోన్లతో ఇరాన్ దాడులు

    • ఇరాన్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికుల మృతి

    • మరో నలుగురు US సైనికులకు తీవ్రగాయాలు

  • Jul 19, 2026 07:02 IST

    అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ సీఈవో పోస్టుకు భారీ స్పందన

    • గడువు ముగిసేనాటికి 5వేలకు పైగా దరఖాస్తులు

    • దరఖాస్తు చేసిన వారిలో రిటైర్డ్ IAS, IPS, IRS, సైనిక అధికారులు

    • పరిశీలన తర్వాత ట్రస్ట్ సీఈవోను ఎంపిక చేయనున్న ముగ్గురు సభ్యుల కమిటీ

    • ట్రస్ట్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే తుది ఎంపిక