Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 18 , 2026 | 06:44 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 18, 2026 21:47 IST

    ఉమ్మడి వరంగల్‌ అధికార పార్టీలో ఆసక్తికర పరిణామం

    • MLA నాయిని నివాసంలో మంత్రి సురేఖ సహా ముఖ్యనేతల భేటీ

  • May 18, 2026 21:26 IST

    IPL: SRH టార్గెట్‌ 181 పరుగులు

    • చెన్నై సూపర్‌ కింగ్స్‌- 180/7

  • May 18, 2026 21:07 IST

    RTGS నుంచి అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

    • ప్రభుత్వ ప్రాధాన్యాలను అధికారులకు వివరించిన చంద్రబాబు

    • ప్రభుత్వ సేవల అమలు.. అర్జీల పరిష్కారంపై దిశానిర్దేశం

  • May 18, 2026 20:46 IST

    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు

    • నేరుగా నియామక పోస్టులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు

    • నిరుద్యోగుల విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం

    • తక్షణమే అమల్లోకి కొత్త నిబంధనలు

    • యూనిఫాం సర్వీసులకు సడలింపు వర్తించదని వెల్లడి

    • పోలీస్, ఫైర్, జైలు, ఎక్సైజ్, ఫారెస్ట్ శాఖలకు మినహాయింపు

    • భవిష్యత్తు నియామకాలకు మాత్రమే వయోపరిమితి పెంపు వర్తింపు

  • May 18, 2026 20:15 IST

    తీవ్రవాదానికి ముగింపు పలకడమే లక్ష్యం: అమిత్‌ షా

    • తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన పోలీసులను అభినందించిన హోంమంత్రి

    • తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు అమిత్‌ షా సన్మానం

  • May 18, 2026 20:11 IST

    సీఎం చంద్రబాబుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ప్రతినిధులు భేటీ

    • బుల్లెట్ వాహన మోడళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

    • తిరుపతి దగ్గర రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు

  • May 18, 2026 19:54 IST

    ఢిల్లీ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్

    • ఆహారశాఖ అధికారులను కలిసిన మంత్రి నాదెండ్ల

    • రేపు కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ జోషి, హర్దీప్‌సింగ్‌తో భేటీ

  • May 18, 2026 19:53 IST

    ఏపీలో మెరుగుపడుతున్న పీహెచ్సీల పనితీరు: మంత్రి సత్యకుమార్‌

    • 6 నెలల్లో 107 నుంచి 312కి పెరిగిన 'A' గ్రేడ్‌ ఆరోగ్య కేంద్రాలు

    • B గ్రేడ్‌లో 354 నుంచి 455కు చేరిన పీహెచ్సీలు: మంత్రి సత్యకుమార్‌

    • మొత్తం 306 కేంద్రాల పనితీరు మరింత మెరుగు: మంత్రి సత్యకుమార్‌

    • C, D, E కేటగిరి ఆరోగ్య కేంద్రాలూ తగ్గుదల: మంత్రి సత్యకుమార్‌

  • May 18, 2026 19:15 IST

    ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, హార్బర్ల పురోగతిపై మంత్రి జనార్దన్‌రెడ్డి సమీక్ష

    • అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి: మంత్రి జనార్దన్‌రెడ్డి

  • May 18, 2026 19:02 IST

    ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో కీలక పోరు

    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే

  • May 18, 2026 18:59 IST

    ఎక్కడ నీరుంటే అక్కడే నాగరికత అభివృద్ధి: మంత్రి నిమ్మల

    • ఇరిగేషన్‌కు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం: నిమ్మల

    • వైసీపీ హయాంలో ఇరిగేషన్‌ను విధ్వంసం చేశారు: నిమ్మల

    • 2026 ఆగస్టు నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి: మంత్రి నిమ్మల

    • గోదావరి డెల్టాకు ఈనెల 31న నీరు విడుదల: మంత్రి నిమ్మల

    • జులై 1 నాటికి కృష్ణా డెల్టాకు నీరు విడుదల: మంత్రి నిమ్మల

  • May 18, 2026 18:48 IST

    అమ్మ క్యాంటీన్లు పునరుద్ధరించాలని సీఎం విజయ్‌ ఆదేశం

    • చెన్నై నగరం సహా మున్సిపాలిటీల్లో క్యాంటీన్ల పునరుద్ధరణ

    • చెన్నైలో 383, ఇతర నగరాల్లో 237 క్యాంటీన్లు పునరుద్ధరణ

    • శుచికరమైన ఆహారం అందుబాటులో ఉంచాలని ఆదేశాలు

  • May 18, 2026 18:47 IST

    రష్యా చమురు కొనుగోళ్లపై ముగిసిన అమెరికా ఆంక్షలు

    • రష్యా నుంచి చమురు కొనగోళ్లు కొనసాగుతాయి: కేంద్రం

    • ఇరాన్‌, అమెరికా యుద్ధం వల్లే సంక్షోభం: కేంద్రం

  • May 18, 2026 18:42 IST

    కామారెడ్డి: భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

    • అంతర్రాష్ట్ర దొంగ ఠాకూర్‌సింగ్‌ అరెస్ట్

    • 14.5 తులాల బంగారం, 5.7 కిలోల వెండి స్వాధీనం

  • May 18, 2026 18:33 IST

    పేర్ని నాని ఎన్నో అక్రమాలు, అవినీతి చేశారు: మంత్రి పార్థసారథి

    • భార్యను అడ్డుపెట్టుకుని పేర్ని నాని బతికిపోయారు: పార్థసారథి

    • వైసీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి: మంత్రి పార్థసారథి

    • అమరావతిపై విషం చిమ్మితే ఈసారి 11 నుంచి సున్నాకి పడిపోతారు: పార్థసారథి

    • కల్తీ మద్యంతో వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు: పార్థసారథి

  • May 18, 2026 18:16 IST

    వికారాబాద్: తాండూరులో యువకుడిపై పోక్సో కేసు నమోదు

    • బొమ్రాస్‌పేట్‌ బాలికను ప్రేమ పేరుతో వంచించిన యువకుడు

    • బాలికను నమ్మించి గర్భవతి చేసిన యువకుడు

  • May 18, 2026 18:10 IST

    హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పోక్సో కేసులో కీలక తీర్పు

    • 2021లో నమోదైన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

    • బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశం

  • May 18, 2026 18:09 IST

    ఢిల్లీ: US ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టూ ఇండియా సదస్సు

    • డేటా సెంటర్ల చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి: మంత్రి లోకేశ్

    • న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఏపీ నమ్మకమైన భాగస్వామి: లోకేశ్

    • న్యూక్లియర్ ఎనర్జీ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్ధం: లోకేశ్

    • రెన్యువబుల్ ఎనర్జీలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం: లోకేశ్

  • May 18, 2026 17:56 IST

    మహారాష్ట్ర: పాల్‌ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • పెళ్లి బృందం ట్రక్కను ఢీకొన్న కంటైనర్‌

    • 10 మందికిపైగా మృతి.. 25 మందికి గాయాలు

    • ముంబై-అహ్మదాబాద్‌ హైవేపై ఘటన

  • May 18, 2026 17:46 IST

    అమరావతి: జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల పనులు: చంద్రబాబు

    • పోలవరం ఎడమ కాల్వ-చంపావతి లింక్‌పై అధ్యయనం చేయాలి: సీఎం

    • 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి: సీఎం

    • జలధార-జలహారతి పనులకు అధిక ప్రాధాన్యం: చంద్రబాబు

    • ఆలస్యం కాకుండా కాల్వలకు నీరు విడుదల చేయాలి: చంద్రబాబు

  • May 18, 2026 17:38 IST

    తెలంగాణలో రబీ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రకటన

    • నేటికి 40.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

    • రైతులకు ఇప్పటికే రూ.6,462.73 కోట్ల చెల్లింపు: ప్రభుత్వం

    • రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: ప్రభుత్వం

  • May 18, 2026 17:33 IST

    CSలతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ సోమనాథన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

    • మెరుగైన సేవల కోసం సింపుల్ ఈ-గవర్నెన్స్‌పై కేంద్రం దృష్టి

    • తమిళనాడు 'simplegov' మోడల్‌ అధ్యయనం చేయాలని ఆదేశం

    • తెలంగాణ ఈ-గవర్నెన్స్ విధానాన్ని వివరించిన CS రామకృష్ణారావు

  • May 18, 2026 17:26 IST

    తమిళనాడు: కోయంబత్తూర్‌లో దారుణం

    • 13 ఏళ్ల బాలుడిని కొట్టిచంపిన స్నేహితులు

    • పోలీసుల అదుపులో నిందితులు

  • May 18, 2026 17:03 IST

    ప.గో.: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

    • కొత్తోట ఘటనపై స్పందించిన పోలీస్‌ ఉన్నతాధికారులు

    • నిందితులు ముత్యాలరాజు, శేఖర్, రాధాకృష్ణను అరెస్టు చేయాలని నరసాపురం ఆర్డీఓ, డీఎస్పీలకు ఉన్నతాధికారుల ఆదేశం

  • May 18, 2026 16:49 IST

    నార్వేలో ప్రధాని మోదీ పర్యటన

    • భారత్‌-ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: మోదీ

    • ఈ ఒప్పందంతో భారత్‌, నార్వేకు అనేక ప్రయోజనాలు: మోదీ

    • భారత్‌-నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం: మోదీ

    • ఇస్రో-నార్వే స్పేస్‌ ఏజెన్సీ మధ్య ఒప్పందం: మోదీ

    • పరిశోధనల కోసం నార్వే సహాయం తీసుకుంటాం: మోదీ

  • May 18, 2026 16:45 IST

    నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తు.. మరొకరి అరెస్ట్

    • లాతూర్‌కు చెందిన శివరాజ్‌ను అరెస్టు చేసిన CBI

    • పేపర్‌ లీక్‌ కేసులో ఇప్పటివరకు 10 మంది అరెస్టు

    • నిందితుడు శివరాజ్‌కు 9 రోజుల సీబీఐ కస్టడీ

  • May 18, 2026 16:33 IST

    బీజేపీలో హరీశ్రావు చేరబోతున్నారు: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

    • BRSకు గోతులు తవ్వుతున్నది హరీశ్‌రావే: అద్దంకి

    • కవిత ప్రశ్నలకు BRS నేతలు సమాధానం చెప్పాలి: అద్దంకి

    • BRSలో మూడుముక్కలాట జరుగుతోంది: అద్దంకి

  • May 18, 2026 16:32 IST

    మంచిర్యాల: ఎల్లక్కపేటలో మహిళ హత్య

    • పోలీసుల అదుపులో మృతురాలి భర్త సహా మరో వ్యక్తి

    • పీఎస్‌లో నిందితుడిపై మృతురాలి బంధువులు దాడి

    • పీఎస్‌పైకి రాళ్లు విసరడంతో పోలీస్‌ సిబ్బందికి గాయాలు

  • May 18, 2026 16:25 IST

    బెంగళూరు: దుబారే శిబిరంలో రెండు ఏనుగుల పోరాటం

    • ఏనుగుల పోరాటంలో చెన్నై మహిళా పర్యాటకురాలి మృతి

    • కొడగు జిల్లాలోని దుబారే ఏనుగుల శిబిరంలో ఘటన

  • May 18, 2026 16:01 IST

    సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం: పొంగులేటి

    • ప్రమాదాల సమయంలో గోల్డెన్‌ అవర్‌ కీలకం: పొంగులేటి

    • ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: పొంగులేటి

  • May 18, 2026 15:57 IST

    కేంద్ర ప్రభుత్వ విధానాలే రైతులకు శాపం: మంత్రి తుమ్మల

    • రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలి: మంత్రి తుమ్మల

    • రైతులను ఓటు బ్యాంకుగా చూడొద్దు: మంత్రి తుమ్మల

    • ధాన్యం సేకరణపై కేంద్రం వాస్తవాలు వక్రీకరిస్తోంది: తుమ్మల

    • FCI పూర్తి వరి కొనుగోలు చేయడం లేదు: మంత్రి తుమ్మల

  • May 18, 2026 15:56 IST

    'మత్స్యకారుల సేవ' కింద రేపు నిధుల విడుదల

    • ప్రతి కుటుంబానికి రూ.20 వేలు చొప్పున నిధులు

    • 1.30 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి

    • కావలిలో రేపు నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

  • May 18, 2026 15:51 IST

    మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్

    • అప్పిచ్చిన 8 మందిని చంపేందుకు కరీమా బీ ప్లాన్

    • 8 మందిలో ఇద్దరిని హత్యచేసిన కరీమా బీ దంపతులు

    • మరో ఆరుగురిని కూడా ఫామ్‌హౌస్‌కు పిలిచిన కరీమా బీ

    • రుణాలు తిరిగి ఇవ్వకుండా హత్యలకు కరీమా బీ దంపతుల ప్రణాళికలు

    • కరీమా బీ నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు

  • May 18, 2026 15:43 IST

    సుప్రీంకోర్టు విధానాన్ని హైకోర్టులు కూడా పాటించాలి: CJI

    • సోమ, శుక్రవారాల్లో వర్చువల్‌గా కేసులు విచారించాలి: CJI

  • May 18, 2026 15:40 IST

    ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    • 77 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 6 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • May 18, 2026 15:36 IST

    పంజాబ్‌ మంత్రి సంజీవ్‌ అరోరాను అరెస్టు చేసిన ED

    • GST లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించి అరెస్ట్

    • మంత్రి సంజీవ్‌ అరోరాకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

    • తదుపరి విచారణ జూన్ 1కి వాయిదా

  • May 18, 2026 15:26 IST

    నార్వేలో ప్రధాని మోదీ పర్యటన

    • రేపు భారత్‌-నోర్డిక్‌ సదస్సులో పాల్గొననున్న మోదీ

  • May 18, 2026 15:25 IST

    ఛత్తీస్‌గఢ్‌: బస్తర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన

    • మావోయిస్టులను అంతం చేశాం: అమిత్‌ షా

    • బస్తర్‌ అభివృద్ధికి ప్రణాళికలు: అమిత్‌ షా

    • బస్తర్‌లో సేవా కేంద్రాల ఏర్పాటు: అమిత్‌ షా

  • May 18, 2026 15:21 IST

    చైనాలో భూప్రకపంనలు

    • గ్వాంగ్జీ ప్రావిన్సులో కంపించిన భూమి

    • రిక్టర్ స్కేలుపై 5.2గా తీవ్రత నమోదు

    • ఇద్దరి మృతి.. మరొకరి గల్లంతు

  • May 18, 2026 15:14 IST

    ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల, 80 శాతం ఉత్తీర్ణత

    • cets.apsche.ap.gov.in/LAWCETలో ర్యాంక్ కార్డులు

    • 95523 00009 వాట్సాప్‌ ద్వారా ర్యాంక్ కార్డులు పొందే అవకాశం

  • May 18, 2026 15:10 IST

    హైదరాబాద్‌: రెండుతలల పాముల అమ్మకాలపై DRI ఆపరేషన్‌

    • వరంగల్‌లో ఒకరు అరెస్టు, 2 రెండుతలల పాములు స్వాధీనం

    • రెండుతలల పాముల ధర రూ.25 కోట్లు ఉంటుందని అంచనా

  • May 18, 2026 15:02 IST

    అమరావతి: టీటీడీకి సీఎం చంద్రబాబు అభినందనలు

    • అటవీ సంపద పరిరక్షణ చర్యలు ప్రశంసనీయం: చంద్రబాబు

    • భవిష్యత్తు తరాలకు పచ్చదనం అందించాలి: సీఎం చంద్రబాబు

    • అటవీ సంపద రక్షణ నిరంతరం కొనసాగాలి: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం

  • May 18, 2026 14:55 IST

    ప.గో.: మొగల్తూరు మండలం కొత్తోటలో దారుణం

    • ఆస్తి కోసం తల్లిదండ్రులపై కుమారుడు, మనవళ్ల దాడి

    • తీవ్రగాయాలపాలైన తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలింపు

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుల కుమార్తెలు

  • May 18, 2026 14:55 IST

    వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలపై మంత్రి నిమ్మల సమీక్ష

    • జూన్ 1 నుంచి కాల్వలకు నీరు విడుదల: మంత్రి నిమ్మల

    • ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధంగా ఉండాలి: మంత్రి నిమ్మల

    • ఈ నెలాఖరుకు కాల్వల్లో పూడికతీత పనుల పూర్తి: నిమ్మల

    • రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో విత్తనాలు, ఎరువులు: నిమ్మల

  • May 18, 2026 14:47 IST

    తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

    • గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

    • చట్టం అందరికీ ఒకేలా ఉండాలి: ఎమ్మెల్యే

    • హిందువైనా, ఎంఐఎం నాయకులైనా ఒకే విధంగా చూడాలి: రాజాసింగ్

    పూర్తి కథనం

  • May 18, 2026 14:30 IST

    NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

    • మనిషా మందారేను 14 రోజుల CBI కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు

    • నీట్ పేపర్ లీక్‌ సంబంధిత ఆరోపణలపై విచారణ

  • May 18, 2026 14:23 IST

    HDFC బ్యాంక్‌ను అధిగమించిన ఎయిర్‌టెల్

    • ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ సుమారు రూ.18.11 లక్షల కోట్లు

    • దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా ఎయిర్‌టెల్

  • May 18, 2026 14:18 IST

    బీసీసీఐని ప్రజా సంస్థగా పరిగణించలేం: సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్

    • బీసీసీఐ ఆర్టీఐ చట్టం పరిధిలోకి రాదని సీఐసీ కీలక తీర్పు

    • ఇది ప్రభుత్వ సంస్థ కాదని సీఐసీ స్పష్టీకరణ

    పూర్తి కథనం

  • May 18, 2026 14:08 IST

    డీఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు

    • టీవీకే ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ అధికారంలో ఉండదు: అనిత రాధాకృష్ణన్

    • ఆరు నెలల తర్వాత మళ్లీ స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారు: అనిత రాధాకృష్ణన్

  • May 18, 2026 14:04 IST

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుల నియామకానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

    • ఫార్మసీ యాక్ట్-1948 సెక్షన్ 19 కింద ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు

    • హైకోర్టు ఆదేశాల మేరకు ఫార్మసీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

  • May 18, 2026 13:30 IST

    బండి భగీరథ్‌ అంశంలో బీఆర్ఎస్ అతిగా వ్యవహరిస్తోంది: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

    • బెయిల్ కోసం భగీరథ్‌ ప్రయత్నించడం తప్పెలా అవుతుంది?: రాంచందర్‌రావు

    • బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కేసులో ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా?: రాంచందర్‌రావు

    • బీఆర్ఎస్ నేతలు మహిళల రక్షణపై మాట్లాడటం విడ్డూరం: రాంచందర్‌రావు

    • బీఆర్ఎస్ హయాంలో పాలనా వైఫల్యాలకు కేసీఆర్ రాజీనామా చేశారా?: రాంచందర్‌రావు

  • May 18, 2026 12:50 IST

    ఢిల్లీ: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

    • ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను నరకరాదన్న అత్యున్నత న్యాయస్థానం

    • కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం

  • May 18, 2026 12:45 IST

    పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • గడువులోగా ప్రాజెక్టులు పూర్తిచేయాలని సీఎం ఆదేశం

  • May 18, 2026 12:45 IST

    Ai రాకతో అమెరికాలో మారుతున్న పరిస్థితులు

    • అమెరికా బిజినెస్ స్కూళ్ల ట్యూషన్ ఫీజుల్లో భారీ డిస్కౌంట్లు, స్కాలర్‌షిప్‌లు

    • ఆన్‌లైన్‌, ఎగ్జిక్యూటివ్‌, స్పెషలైజ్డ్‌ బిజినెస్ ప్రోగ్రామ్‌లపై 50శాతం తగ్గింపులు

  • May 18, 2026 12:43 IST

    ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు: ఎంపీ అర్వింద్‌

    • తెలంగాణకు తామే నిధులు తెచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు: ఎంపీ అర్వింద్

    • రేవంత్‌కు కూలగొట్టడమే తప్ప కట్టడం తెలియదు: ఎంపీ అర్వింద్‌

    • మూసీ ప్రక్షాళన అంటూ మాయమాటలు: ఎంపీ అర్వింద్‌

  • May 18, 2026 12:03 IST

    జనగామ: జిల్లాలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన

    • అప్పు తీర్చేందుకు తన కుమార్తె(18)ని బీఆర్ఎస్ నేత ప్రశాంత్‌రెడ్డి(45)కి కట్టబెట్టిన సవతి తల్లిదండ్రులు

    • స్నేహితుల సాయంతో ప్రశాంత్‌రెడ్డి నుంచి తప్పించుకున్న బాలిక

    • హైదరాబాద్‌లో మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు

    • విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి మహిళ కమిషన్ ఆదేశాలు

  • May 18, 2026 12:00 IST

    ఢిల్లీ: ఆకివీడు రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

    • యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం

    • ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు

    • తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా

  • May 18, 2026 11:34 IST

    మార్కెట్ ట్రేడింగ్‌లో ట్రంప్ బిజీ

    • వెలుగులోకి తెచ్చిన అమెరికా పత్రిక

    • 90 రోజుల్లో 3,700 స్టాక్స్‌లో ట్రంప్‌ పెట్టుబడి

    • రోజుకు సగటున వాల్‌స్ట్రీట్‌లో 40 లావాదేవీలు

    • ఇప్పటికే మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ట్రంప్‌ కార్యవర్గ సభ్యులు, సన్నిహితులు

  • May 18, 2026 11:16 IST

    తమిళనాడు: అన్నాడీఎంకే లో మరోసారి అంతర్గత కలహాలు

    • పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి సెమ్మలై

    • పార్టీలో ఇటీవల పరిణామాలతో రాజీనామా చేస్తున్నా: సెమ్మలై

  • May 18, 2026 11:15 IST

    మార్కాపురం: కలెక్టర్ ఎం. విజయ సునీత ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

    • ఆమె ఖాతాను ఫాలో అవుతున్న వారికి మెసేజ్‌లు పంపడంతో గుర్తించిన కలెక్టర్

    • వెంటనే ఫేస్‌బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కలెక్టర్

    • కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేసినట్లు తెలిపిన కలెక్టర్

  • May 18, 2026 11:15 IST

    భారీగా పతనమైన రూపాయి విలువ

    • డాలర్‌తో పోలిస్తే 96.17 దగ్గర ట్రేడవుతున్న రూపాయి

    • చమురు ధరల పెరుగుదలతో రూపాయి పతనం

  • May 18, 2026 10:58 IST

    ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వినూత్న నిరసన

    • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మోదీ సర్కార్ తీరుకు నిరసన

    • యాదగిరిగుట్ట నుంచి ఆలేరు వరకు సైకిల్ తొక్కి నిరసన తెలియజేసిన ఐలయ్య

    • సామాన్య ప్రజలపై మోదీ ప్రభుత్వం భారం మోపుతోందన్న ఐలయ్య

  • May 18, 2026 10:42 IST

    వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్

  • May 18, 2026 10:39 IST

    ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ తొలగింపు వెనుక అమెరికా హస్తం!

    • పాకిస్థాన్‌లో లీకైన దౌత్య కేబుల్‌

    • అమెరికా విదేశాంగ శాఖ అధికారి, పాక్‌ దౌత్యవేత్త సంప్రదింపులు

    • ఇమ్రాన్‌‌ను తొలగిస్తే.. ఇరుదేశాల సంబంధాలు బలపడతాయని అమెరికా అధికారి డొనాల్డ్ లూ సూచన

  • May 18, 2026 10:21 IST

    కేరళం సీఎంగా సతీశన్‌ ప్రమాణస్వీకారం

    • సతీశన్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్‌

    • హాజరైన పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు

  • May 18, 2026 10:18 IST

    హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ గుట్టురట్టు

    • వ్యాపారి సత్యనారాయణమూర్తి అరెస్ట్‌

    • ఎర్నాకుళంకు చెందిన వ్యక్తి నుంచి రూ.24 కోట్లు కొట్టేసిన నిందితుడు

    • అరెస్ట్ చేసి తీసుకెళ్లిన కొచ్చి సిటీ పోలీసులు

    • నైజీరియన్లను మించి మోసం చేస్తున్న సత్యనారాయణమూర్తి

    • కాజేసిన సొమ్ముతో విదేశాల్లో మైనింగ్‌ పెట్టుబడులు

  • May 18, 2026 10:18 IST

    హైదరాబాద్‌: పంజాగుట్టలో ప్రభుత్వ ఉద్యోగికి హనీ ట్రాప్

    • ఫొటోలు, వీడియోలతో బెదిరించి మూడేళ్లుగా మహిళ వసూళ్లు

    • పోలీసులకు ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ ఆఫీస్‌ అధికారి ఫిర్యాదు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు

  • May 18, 2026 10:15 IST

    హైదరాబాద్: బండి భగీరథ్‌ కేసులో మరో ట్విస్ట్

    • కొత్తగా మరో సెక్షన్‌ను జోడించిన పోలీసులు

    • ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు

    • ఆ మేరకు భగీరథ్‌పై బీఎన్ఎస్ 64(2)(m) సెక్షన్‌ను చేర్చిన పోలీసులు

    • ఈ నేరం రుజువైతే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం

    • ఇప్పటికే భగీరథ్‌పై BNS 74, 75, Pocso సెక్షన్ 5(1) r/w 6 సెక్షన్లు నమోదయ్యాయి.

  • May 18, 2026 10:12 IST

    చిత్తూరు: గంగాధర నెల్లూరులో ఘరానా మోసం

    • పోలీసులే దొంగలుగా మారిన వైనం

    • దొంగల ముఠాతో చేతులు కలిపి బాధితుని నుంచి రూ.10 లక్షలు కాజేసిన పోలీసులు

    • దోపిడీ ముఠాలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్సై లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవిచంద్రన్

    • ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు

  • May 18, 2026 10:09 IST

    భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    • సెన్సెక్స్‌ 990, నిఫ్టీ 310 పాయింట్లకు పైగా నష్టం

  • May 18, 2026 10:09 IST

    హైదరాబాద్: గంజాయి మత్తులో పోకిరీల హల్‌చల్

    • కారులో వెళ్తున్న వృద్ధుడిపై ఇద్దరు యువకుల దాడి

    • బైక్‌పై ఓవర్‌ స్పీడ్‌గా వెళ్తున్న యువకులు.. వారించిన వృద్ధుడు

    • వృద్ధుడిపై కత్తితో దాడి.. కారు తాళాలతో యువకుల పరారీ

  • May 18, 2026 10:08 IST

    సిరిసిల్ల పాత బస్టాండ్‌ దగ్గర ఉద్రిక్తత

    • బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట

    • పరస్పరం చెప్పులు విసురుకున్న ఇరువర్గాలు

  • May 18, 2026 09:01 IST

    హైదరాబాద్‌: మలక్‌పేట రైల్వే బ్రిడ్జి దగ్గర ప్రమాదం

    • అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఈవీ కారు

    • డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం

  • May 18, 2026 08:41 IST

    నేడు బండి భగీరథ్‌‌ను కస్టడీకి కోరనున్న పోలీసులు

    • మేడ్చల్‌ కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు

    • బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా బండి భగీరథ్ విచారణ

    • భగీరథ్‌ను ప్రశ్నించనున్న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు

  • May 18, 2026 08:40 IST

    బిహార్‌: ససారం-పట్నా ప్యాసింజర్‌ రైలులో అగ్నిప్రమాదం

    • ససారం రైల్వేస్టేషన్‌ దగ్గర రైలులో మంటలు

    • షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్టు అనుమానం

  • May 18, 2026 07:48 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ (18.05.2026)

    • ఉదయం 10:50 గంటలకు సచివాలయానికి చేరిక

    • 11:30 గంటలకు పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష

    • సాయంత్రం 04:30 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్ష

  • May 18, 2026 07:47 IST

    హైదరాబాద్‌: నేటి నుంచి యువజన, క్రీడా వారోత్సవాలు

    • ఎల్బీ స్టేడియంలో ప్రారంభించనున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి

  • May 18, 2026 07:46 IST

    నంద్యాల: ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంటలో భారీ చోరీ

    • 30 తులాల బంగారం, కిలో వెండి, లక్ష నగదు అపహరణ

    • ఇంటి బయట కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఘటన

    • ఇంటి వెనకాల తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దొంగలు

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు హుస్సేన్

  • May 18, 2026 07:39 IST

    తిరుపతి: చంద్రగిరి మం. భాకరాపేట దగ్గర ఏనుగుల సంచారం

    • ఏనుగుల సంచారంతో ఆగిన వాహన రాకపోకలు

    • ఏనుగులను అడవిలోకి తరిమేసిన అధికారులు

  • May 18, 2026 06:49 IST

    నేడు కేరళం సీఎం సతీశన్‌ ప్రమాణస్వీకారం

    • తిరువనంతపురంలో సీఎంగా సతీశన్‌ ప్రమాణం

    • సతీశన్‌ కేబినెట్‌లో 20 మంది

    • 14 మందికి తొలిసారి మంత్రి పదవులు

    • హాజరుకానున్న ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, రేవంత్‌, భట్టి

  • May 18, 2026 06:48 IST

    అమరావతి రాజధాని గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌

    • నేడు గుంటూరు కలెక్టరేట్‌కు రాజధాని గ్రామాల వాసులు

    • భూసేకరణ నిర్ణయంపై అభిప్రాయాలు తెలపనున్న ప్రజలు

  • May 18, 2026 06:44 IST

    నేడు తెలంగాణలోని ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

    • 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

    • ఆదిలాబాద్‌, కొమురంభీం, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌ జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ జారీ