గోవుల అక్రమ రవాణా.. డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
ABN , Publish Date - May 18 , 2026 | 02:38 PM
గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. పోలీసులు.. రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పని చేయాలని అన్నారు.
హైదరాబాద్, మే 18: తెలంగాణలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు ఎమ్మెల్యే బహిరంగ లేఖ రాశారు. శనివారం(మే 16) రాత్రి గోవులతో వెళ్తున్న లారీని గో రక్షక్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారని.. దీంతో ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడకు చేరుకొని ఆ లారీని తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని.. హిందువైనా, ఎంఐఎం నాయకులైనా ఒకే విధంగా చూడాలని అన్నారు.
గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు.. రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పని చేయాలని తెలిపారు. హిందువులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయన్నారు. గోమాతను కాపాడాలని చెప్పే ప్రభుత్వం.. అక్రమ రవాణాను ఎందుకు ఆపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎవరైనా చట్టం ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ డీజీపీ వెంటనే ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ లేఖలో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
Read Latest Telangana News And Telugu News