500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి
ABN , Publish Date - May 18 , 2026 | 11:18 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది.
హైదరాబాద్, మే 18: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈరోజు(సోమవారం) ఉదయం బెంగళూరు నుంచి శంషాబాద్‌కు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. దాదాపు 500 మీట్లర ఎత్తులో విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించారు.
పైలట్ అప్రమత్తతతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. దీంతో విమానంలోని ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు మూడు నమోదు అయినట్లు తెలుస్తోంది. బర్డ్ స్ట్రైక్ ఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టు సమీప ప్రాంతాల్లో పక్షుల నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఎయిర్‌పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
ఓవర్ స్పీడ్‌గా వెళ్లొద్దన్న వృద్ధుడు.. యువకుల దారుణం
బండి భగీరథ్ కేసు.. కొత్త సెక్షన్‌ను జోడించిన పోలీసులు
Read Latest Telangana News And Telugu News