Share News

బండి భగీరథ్ కేసు.. కొత్త సెక్షన్‌ను జోడించిన పోలీసులు

ABN , Publish Date - May 18 , 2026 | 10:48 AM

బండి భగీరథ్‌ కేసులో పోలీసులు కొత్తగా మరో సెక్షన్‌ను జోడించారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణల నేపథ్యంలో BNS 64(2)(m) సెక్షన్‌ను కేసులో చేర్చారు.

బండి భగీరథ్ కేసు.. కొత్త సెక్షన్‌ను జోడించిన పోలీసులు
Bandi Bhageerath Case

హైదరాబాద్, మే 18: బండి భగీరథ్‌ కేసులో పోలీసులు కొత్తగా మరో సెక్షన్‌ను జోడించారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణల నేపథ్యంలో BNS 64(2)(m) సెక్షన్‌ను కేసులో చేర్చారు. ఈ సెక్షన్ రుజువైతే కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే బండి భగీరథ్‌పై BNS 64(2)(m), BNS 74, BNS 75 సెక్షన్లు, POCSO సెక్షన్ 5(1) r/w 6 సెక్షన్లు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు ఈ కొత్త సెక్షన్‌ను జోడించారు.


బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఈనెల 8న బండి భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ గైర్హాజరయ్యారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్‌ కోసం భగీరథ్‌ పిటిషన్‌ వేయగా.. అక్కడ కూడా అతడికి నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో.. భగీరథ్‌ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. భగీరథ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో చెర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఓవర్ స్పీడ్‌గా వెళ్లొద్దన్న వృద్ధుడు.. యువకుల దారుణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2026 | 12:13 PM