Share News

హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ABN , Publish Date - May 18 , 2026 | 09:52 AM

హైదరాబాద్‌లోని పాతబస్తీ సంతోష్‌నగర్ డీఎంఆర్‌ఎల్ ఎక్స్‌రోడ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహ్మద్ అల్తాఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
Hyderabad bike accident

హైదరాబాద్, మే 18: పాతబస్తీ సంతోష్‌నగర్ డీఎంఆర్‌ఎల్ ఎక్స్‌రోడ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహ్మద్ అల్తాఫ్(23) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బులెట్‌పై వెళ్తున్న సమయంలో మహ్మద్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే కంచన్‌బాగ్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓవర్ స్పీడ్‌గా వెళ్లడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.


మృతుడు రియాసత్‌నగర్ బజార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహ్మద్ అల్తాఫ్ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

టాపర్లు అబ్బాయిలు

భారత సెమీకండక్టర్స్‌కు నెదర్లాండ్స్‌ దన్ను

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2026 | 09:59 AM