జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన
ABN , Publish Date - May 18 , 2026 | 12:00 PM
జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టించింది.
జనగామ, మే 18: బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన జనగామ జిల్లాలో సంచలనం సృష్టించింది. బచ్చన్నపేటకు చెందిన బీఆర్‌ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి ఇటీవల వార్డు మెంబర్‌గా ఎన్నికయ్యాడు. అదే గ్రామానికి చెందిన దంపతులకు రూ.20 లక్షల అప్పు ఇచ్చాడు ప్రశాంత్ రెడ్డి. అయితే అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో వారి కూతురినిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. అవసరమైతే ఎదురుకట్నం ఇస్తానని ఆశ చూపి కొంత డబ్బు ముట్టజెప్పాడు.
దీంతో సవతి తల్లి- తండ్రి కలిసి తమ 18 ఏళ్ల కుమార్తెను బలవంతంగా ఒప్పించి ప్రశాంత్ రెడ్డితో వివాహం జరిపించారు. అప్పటికే యువతి మరో యువకుడిని ప్రేమించింది. దీంతో పెళ్లైన మరుసటి రోజే ప్రియుడితో యువతి పరారైంది. స్నేహితుల సహాయంతో ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకున్న యువతి.. హైదరాబాద్‌లో మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
బండి భగీరథ్ కేసు.. కొత్త సెక్షన్‌ను జోడించిన పోలీసులు
500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి
Read Latest Telangana News And Telugu News