-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 18th June 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 18 , 2026 | 05:52 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jun 18, 2026 21:05 IST
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.7 కోట్ల విలువైన గంజాయి సీజ్
వియత్నాం ప్రయాణికుడి నుంచి హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత
-
Jun 18, 2026 21:04 IST
హైదరాబాద్: సిరిసిల్లకు కేటీఆర్ వీకెండ్‌లో వచ్చి వెళ్తుంటారు: కవిత
డిస్కంలపై ఇప్పటివరకు కేటీఆర్ నోరెత్తలేదు: కవిత
నేరెళ్ల బాధితులకు న్యాయం జరగలేదు: కవిత
-
Jun 18, 2026 21:04 IST
హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
అన్ని రంగాల్లో మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: భట్టి
మైనార్టీల సంక్షేమానికి భారీ బడ్జెట్ కేటాయింపు: భట్టి విక్రమార్క
20 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి: భట్టి
మరో 17 పాఠశాలలను త్వరగా పూర్తిచేయాలి: భట్టి విక్రమార్క
వక్ఫ్ భూముల పరిరక్షణకు కఠినచర్యలు తీసుకోవాలి: భట్టి
-
Jun 18, 2026 20:41 IST
హైదరాబాద్: రైతు బీమా నిలిపివేశామనేది అసత్య ప్రచారం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
LICకి రూ.1,359 కోట్ల వార్షిక ప్రీమియం చెల్లించాం: తుమ్మల
రెండున్నరేళ్లలో 66,038 రైతు కుటుంబాలకు లబ్ధి: తుమ్మల
రైతు బీమా కింద రూ.3,301.90 కోట్ల సాయం విడుదల: తుమ్మల
రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం: తుమ్మల
ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి: తుమ్మల
-
Jun 18, 2026 20:15 IST
హైదరాబాద్: ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో కీలక పరిణామం
వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ డిస్మిస్
వారంపాటు మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్
మధ్యంతర బెయిల్ మంజూరుకు నాంపల్లి కోర్టు నిరాకరణ
-
Jun 18, 2026 19:45 IST
అమరావతి: ఆక్వా రైతుల సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం
ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
సీఎం సమక్షంలో ఇరువర్గాల మధ్య కుదిరిన సయోధ్య
సీఎం సూచనలతో ఫీడ్ ధర కేజీకి రూ.4లు తగ్గించేందుకు అంగీకారం
ప్రభుత్వం తీసుకున్న చొరవపట్ల ఆక్వా రైతులు హర్షం
-
Jun 18, 2026 19:37 IST
హైదరాబాద్: 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం: సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీ కడతామంటే మళ్లీ ఫార్మా కంపెనీలు తెస్తామంటున్నారు: సీఎం
ఫ్యూచర్ లేనివాళ్లు ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామంటున్నారు: సీఎం
ముందు సిద్దిపేట గెలిచిరండి.. తర్వాత రద్దుపై మాట్లాడదాం: సీఎం
60 శాతం గ్రీనరీ పెంచుతామంటే NGTలో కేసులు వేశారు: సీఎం
-
Jun 18, 2026 19:36 IST
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైసీపీ నేతలు
డీఎస్సీ, సాయికృష్ణ అంశాలపై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు
డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
డీఎస్సీపై లోకేష్ సవాల్ పిల్లచేష్టలు: ఎమ్మెల్సీ బొత్స
నిజంగా చర్చ కోరుకుంటే లోక్‌భవన్‌కు రావాలి: ఎమ్మెల్సీ బొత్స
-
Jun 18, 2026 19:35 IST
విజయవాడ: సాయికృష్ణ నివాసానికి జగన్
సాయికృష్ణ తల్లిని పరామర్శించిన జగన్
-
Jun 18, 2026 19:34 IST
రంగారెడ్డి: వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
హరిత నిధి ద్వారా నాగలింగం మొక్క నాటిన సీఎం రేవంత్‌రెడ్డి
రోబోటిక్ ఏనుగును ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
గుర్రంగూడ ఎకో పార్క్ నమూనాను వివరించిన అటవీ అధికారులు
ఎకో పార్క్‌లో రూ.35.50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.17.84 కోట్లతో అభివృద్ధి పనులు
-
Jun 18, 2026 19:33 IST
ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో కారుమూరి సునీల్‌కు రిమాండ్
14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
చంచల్‌గూడ జైలుకు కారుమూరి సునీల్ తరలింపు
-
Jun 18, 2026 18:45 IST
ఢిల్లీ: టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
-
Jun 18, 2026 18:18 IST
ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో పరిమల్ నాథ్వానీ విజయం
28 ఓట్లతో గెలుపు
బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నాథ్వానీ
ఝార్ఖండ్ నుంచి మరోసారి రాజ్యసభకు ఎన్నికైన పరిమల్ నాథ్వానీ
-
Jun 18, 2026 18:13 IST
బిహార్: బెగుసరాయ్‌లో అమానుష ఘటన
మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కీచకులు
మహిళ జననేంద్రియంలో బుల్లెట్, రాయి, చెక్క ముక్కలు గుర్తింపు
ఘటనపై కేసు నమోదు, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
-
Jun 18, 2026 17:58 IST
ఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణిపై రష్యా ఆసక్తి చూపుతోంది: బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈఓ జైతీర్థ్ జోషి
బ్రహ్మోస్ విషయంలో రష్యాతో చర్చలు కొనసాగుతున్నాయి: జైతీర్థ్ జోషి
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంపుపై చర్చలు: జైతీర్థ్ జోషి
-
Jun 18, 2026 17:16 IST
హైదరాబాద్: కామారెడ్డి పంచాయితీపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వ్యాఖ్యలు
షబ్బీర్ అలీ, ఇందు ప్రియారెడ్డి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తాం: మల్లు రవి
పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు: మల్లు రవి
-
Jun 18, 2026 17:11 IST
వైసీపీ మాజీ మంత్రి కారుమూరికి ఈడీ సమన్లు
ఈనెల 23న హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ సమన్లు
-
Jun 18, 2026 17:08 IST
అమరావతి: వైసీపీపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
సాయికృష్ణ చనిపోయినట్లు ఫేక్ ఫొటోలు రిలీజ్ చేశారు: బొలిశెట్టి
నవీన్‌రెడ్డి ఫొటోను సాయికృష్ణ ఫొటోగా చూపించారు: బొలిశెట్టి
ఇప్పటికైనా అంబటి రాంబాబు నిజం ఒప్పుకోవాలి: బొలిశెట్టి
సాయికృష్ణను పోలీసుల ఎదుట ప్రవేశపెట్టాలి: బొలిశెట్టి
కూటమి నుంచి పవన్‌ను దూరం చేసేందుకు వైసీపీ కుట్ర: బొలిశెట్టి
-
Jun 18, 2026 17:07 IST
హైదరాబాద్: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
3 వారాలపాటు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
3 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
-
Jun 18, 2026 17:06 IST
విశాఖ: ఏపీపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది: తుఫాన్ హెచ్చరిక కేంద్రం
మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం
గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం
ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలుల హెచ్చరిక
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచన
-
Jun 18, 2026 17:01 IST
టీనేజ్ ప్రేమకథలపై కేరళ హైకోర్టు సంచలన తీర్పు!
మైనర్లతో ప్రేమ, శారీరక సంబంధాలు పోక్సో చట్టానికి మినహాయింపు కాదు: హైకోర్టు
‘ప్రేమించుకున్నాం’ అంటే సరిపోదు.. మైనర్ల ‘అంగీకారానికి’ చట్టబద్ధత లేదు: హైకోర్టు
పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నా.. మైనర్లతో లైంగిక సంబంధం పోక్సో కింద నేరమే: హైకోర్టు
-
Jun 18, 2026 16:28 IST
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వైభవ్‌తోపాటు అతడి తల్లిదండ్రులకు అనుమతి
వారి ప్రయాణ ఖర్చులను భరించనున్నట్టు బీసీసీఐ వెల్లడి
సీనియర్ జట్టు వాతావరణానికి అలవాటు పడేందుకే నిర్ణయమని స్పష్టీకరణ
-
Jun 18, 2026 16:23 IST
ఢిల్లీ: కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు
కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదు: హైకోర్టు
నిందితులైన పోలీసులను శిక్షించడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు: హైకోర్టు
పోలీసుల పిటిషన్‌ను కొట్టేస్తూ జస్టిస్ గజేంద్ర సింగ్ సంచలన ఆదేశాలు
-
Jun 18, 2026 16:15 IST
హైదరాబాద్: ముగిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పోలీస్ కస్టడీ
బ్రహ్మనాయుడిని 3 రోజులపాటు ప్రశ్నించిన EOW అధికారులు
3 రోజుల కస్టడీలో పోలీసులకు సహకరించని బ్రహ్మనాయుడు
తనకెలాంటి సంబంధం లేదని బ్రహ్మనాయుడు బుకాయింపు
-
Jun 18, 2026 16:14 IST
ముంబై: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన శివసేన(యూబీటీ) రెబల్ ఎంపీలు
పార్టీ తన అసలు సిద్ధాంతాలకు దూరమైందని స్పీకర్‌కు ఫిర్యాదు
కాంగ్రెస్‌లో విలీనానికి పార్టీ నేతలు యోచిస్తున్నారని ఆరోపించిన ఎంపీలు
ఆ కారణంతో తాము పార్టీని వీడినట్లు స్పష్టీకరణ
లోక్‌సభలో షిండే వర్గం ఎంపీల సమీపంలో సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి
-
Jun 18, 2026 16:04 IST
అమరావతి: రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు
పొగాకు, మామిడి, ఆక్వా ధరలపై సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
సంబంధిత శాఖల మంత్రులతోపాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు
-
Jun 18, 2026 15:53 IST
హైదరాబాద్: జార్ఖండ్ మంత్రి దీపికా పాండే సింగ్‌కి మంత్రి సీతక్క ఫోన్
వీబీజీ రాంజీ పథకం అమలు అయితే నష్టపోయే వర్గాల సమస్యలపై చర్చ
కేంద్రానికి తెలపాల్సిన అభ్యంతరాలపై చర్చించిన నేతలు
కేంద్ర ప్రభుత్వానికి కలిసి నిరసన తెలపాలని నిర్ణయం
-
Jun 18, 2026 15:52 IST
హైదరాబాద్: మరోసారి రచ్చకెక్కిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ
షబ్బీర్ అలీపై క్రమశిక్షణ కమిటీకి ఇందు ప్రియారెడ్డి ఫిర్యాదు
తనను షబ్బీర్ అలీ అవమానించారని ఇందు ప్రియారెడ్డి ఫిర్యాదు
ఇప్పటికే తనపై మార్ఫింగ్ వీడియో వైరల్ చేస్తున్నారని షబ్బీర్ అలీ వివరణ
షబ్బీర్ అలీ వివరణ తర్వాత కూడా ఇందు ప్రియారెడ్డి ఫిర్యాదుపై చర్చ
-
Jun 18, 2026 15:51 IST
అమరావతి: ఐపీఎస్ సునీల్‌కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఎప్పటిలోగా సరెండర్ అవుతారని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు
ఎంపీపై కస్టోడియల్ టార్చర్ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి ముందస్తు బెయిల్ రక్షణ కాకూడదన్న హైకోర్టు
పార్లమెంట్‌పై దాడి చేసిన వారికి, ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసినవారి మధ్య తేడా ఏమీలేదు: హైకోర్టు
-
Jun 18, 2026 15:40 IST
లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
254 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
82 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ
డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.33గా ఉంది
-
Jun 18, 2026 15:33 IST
అమరావతి: విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష
పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలో నం.1గా ఏపీ: మంత్రి
ఏపీవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశం
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ వేగవంతం: మంత్రి లోకేశ్
-
Jun 18, 2026 15:32 IST
టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు
ఉగ్రవాద కార్యకలాపాలు, సైబర్ నేరాలకు వేదికగా మారుతోందని ఆరోపణ
డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌ను వినియోగిస్తున్నాయని కేంద్రం వాదన
ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం
-
Jun 18, 2026 15:07 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్టు
వైసీపీ మాజీమంత్రి కారుమూరి కుమారుడు సునీల్‌ను అరెస్టు చేసిన ED అధికారులు
-
Jun 18, 2026 15:06 IST
అమరావతి: ఈ నెల 20న పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో అన్నదాత సుఖీభవ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా
బహిరంగ సభ, టీడీపీ నేతల సమావేశం, హెలిప్యాడ్ స్థలాల పరిశీలన
ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
-
Jun 18, 2026 14:59 IST
అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం: మంత్రి సుభాష్
రైతుల ఆదాయం పెంపే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: సుభాష్
ఉద్యానవన రంగంలో వేలాది మంది రైతులకు సబ్సిడీ: సుభాష్
పామాయిల్ రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాం: సుభాష్
రైతు సేవా కేంద్రాల ద్వారా పశుసంపద అభివృద్ధికి చర్యలు: సుభాష్
పశుగ్రాసం, దాణాపై సబ్సిడీలు అందిస్తున్నాం: సుభాష్
-
Jun 18, 2026 14:56 IST
మరోసారి వైరల్ అవుతోన్న విరాట్ కోహ్లీ వీడియో
ఆ వీడియోలో క్రిస్టియానో రొనాల్డోపై ప్రశంసలు కురిపించిన విరాట్ కోహ్లీ
క్రీడాకారులకు నిజమైన స్ఫూర్తి రొనాల్డో అని గతంలో వ్యాఖ్యానించిన విరాట్
తొలి మ్యాచ్‌లో రొనాల్డో విఫలమవడంతో విమర్శలు వెల్లువ
ఈ నేపథ్యంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను షేర్ చేస్తున్న అభిమానులు
ఒత్తిడిని ఎదుర్కొని అత్యున్నత స్థాయిలో నిలవడం రొనాల్డో ప్రత్యేకత అని విరాట్ అభిప్రాయం
-
Jun 18, 2026 14:53 IST
విజయవాడ: కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో ఆరోపణ
వెలుగులోకి క్రాంతి కుమార్ ఆత్మహత్య వ్యవహారం
గత నెల 21న రౌడీ షీటర్ క్రాంతి కుమార్ ఆత్మహత్య
ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో
విచారణ పేరుతో సీఐ నాగరాజు కొడుతున్నారని రౌడీషీటర్ క్రాంతి కుమార్ ఆరోపణ
తన ఆత్మహత్యకు సీఐ నాగరాజు కారణమని ఆరోపణ
-
Jun 18, 2026 14:51 IST
హైదరాబాద్: రైతు భరోసాపై రాష్ట్ర కేబినెట్ కీలక తీర్మానం
ఈ నెల 30 నుంచి రైతు భరోసా నిధుల జమ
వరుసగా 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో నిధుల జమ
మధిర సభలో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Jun 18, 2026 14:38 IST
వైసీపీకి ఒక్క ఓటు వేసిన పాపానికి ఐదేళ్లు రాష్ట్రం నాశనమైంది: మంత్రి గొట్టిపాటి రవికుమార్
నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తున్న కూటమి: మంత్రి గొట్టిపాటి
ఇచ్చిన మాట ప్రకారం 16 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ: మంత్రి గొట్టిపాటి
-
Jun 18, 2026 14:22 IST
వైభవ్ సూర్యవంశీ అంశంలో తాము కలగజేసుకోబోమన్న బీసీసీఐ
శ్రీలంక-ఏతో మ్యాచ్ సందర్భంగా వైరల్‌గా మారిన వైభవ్ వీడియో
శ్రీలంక ఆటగాడిపై దూసుకెళ్లినట్లు సోషల్ మీడియాలో చర్చ
ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ కొందరి డిమాండ్లు
ఈ వ్యవహారంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి వెల్లడి
క్రమశిక్షణా అంశాలపై రిఫరీ తీర్పును గౌరవిస్తామని స్పష్టత
-
Jun 18, 2026 13:29 IST
ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్
తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో ఆపరేషన్
నిందితులను 80 కిలోమీటర్ల పాటు వెంబడించిన ఈగల్ టీం
ఒడిశా బలిమెల నుంచి జయపూర్ వరకూ ఛేజ్
500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
Jun 18, 2026 13:28 IST
70 శాతం తగ్గిన బంగారం దిగుమతులు
ప్రస్తుతం 25-30 టన్నుల మధ్య బంగారం దిగుమతి
-
Jun 18, 2026 13:18 IST
కడప: రెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై జిల్లా స్థాయి విజయోత్సవ సభ
నగరంలోని పుత్తా ఎస్టేట్‌లో విజయోత్సవ సభ
కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశం
హాజరైన ఇన్‌చార్జి మంత్రి సవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సమావేశానికి జిల్లా వ్యాప్తంగా భారీగా హాజరైన టీడీపీ కార్యకర్తలు
-
Jun 18, 2026 13:09 IST
డిజిటల్ కేబినెట్ దిశగా తెలంగాణ ప్రభుత్వం
మంత్రివర్గ సమావేశాలను పేపర్‌లెస్‌గా నిర్వహించాలని నిర్ణయం
తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు స్పెషల్ ట్యాబ్‌లు అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు
డిజిటల్ కేబినెట్ అమలు తీరును పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ- బుక్ ద్వారానే మంత్రులకు కేబినెట్ సమావేశ ఎజెండా
-
Jun 18, 2026 12:47 IST
ఐఫోన్ ధరలు పెంచక తప్పదేమో: యాపిల్ సీఈఓ టిమ్ కుక్
కస్టమర్స్‌పై భారం పడకుండా ఇప్పటివరకూ అడ్డుకున్నామన్న కుక్
ఇకపై భారాన్ని బదిలీ చేయక తప్పదని వ్యాఖ్య
ఐఫోన్ 18 ధరలు పెరగవచ్చని వెల్లడి
-
Jun 18, 2026 12:38 IST
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
-
Jun 18, 2026 12:35 IST
ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో మాస్కోలో ఎయిర్‌పోర్ట్‌ల మూసివేత
మాస్కోలోని రిఫైనరీ దగ్గర డ్రోన్ దాడులు
ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసిన మాస్కో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు
-
Jun 18, 2026 12:27 IST
తెలంగాణలో కొనసాగుతున్న ఎండల తీవ్రత
పలు జిల్లాల్లో 43°-44°C వరకూ ఉష్ణోగ్రతలు
సూర్యాపేట, ఖమ్మం, నల్గొండలో అత్యధిక వేడి
హైదరాబాద్‌లో 40°-41°C వరకూ నమోదు
రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రిలో 39°-42°C
-
Jun 18, 2026 12:18 IST
మహారాష్ట్రలోని థానేలో ఓ భర్త పైశాచికత్వం
భార్యపై అనుమానంతో ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన భర్త
భార్య ప్రతి కదలికనూ గమనిస్తూ మానసిక వేధింపులకు గురిచేసిన భర్త
వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య
-
Jun 18, 2026 11:26 IST
ఫిన్లాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన యువకుడి అదృశ్యం
ఈనెల 5వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన మణిదీప్
ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లిన మణిదీప్
ఫిన్లాండ్‌లోని కాలేజీని సంప్రదించినా ప్రయోజనం లేదంటున్న తల్లిదండ్రులు
-
Jun 18, 2026 11:20 IST
విశాఖ: కొత్త గాజువాక మార్కెట్‌లో అగ్నిప్రమాదం
షార్ట్ సర్క్యూట్ కారణంగా బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం
మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
-
Jun 18, 2026 11:15 IST
దక్షిణ కొరియా ఫుట్‌బాల్ శిబిరం వద్ద డ్రోన్ కలకలం
అనధికారికంగా డ్రోన్‌ను ఎగరేసిన గుర్తు తెలియని వ్యక్తులు
డ్రోన్‌ను కూల్చేసిన అధికారులు
రేపు దక్షిణకొరియా, మెక్సికో మధ్య మ్యాచ్
-
Jun 18, 2026 11:10 IST
ప్రముఖ హలీవుడ్ నటి డేవే ఛేజ్ కన్నుమూత
అనారోగ్యంతో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన డేవే ఛేజ్
35 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవటంపై నెటిజన్ల విచారం
‘ది రింగ్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
-
Jun 18, 2026 11:00 IST
నిజామాబాద్: యూరియా యాప్ రద్దు చేయాలంటూ వేల్పూర్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన
ప్రధాన రహదారిపై ధర్నా.. రాస్తారోకో
ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
కరీంనగర్-నిజామాబాద్ మధ్య నిలిచిపోయిన వాహనాలు
-
Jun 18, 2026 10:50 IST
ప.గో.: పాలకొల్లులో కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభ
కూటమి నాయకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి నిమ్మల
-
Jun 18, 2026 10:47 IST
కరీంనగర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్
ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో అవినీతి జరిగింది: కొప్పుల ఈశ్వర్
ధర్మపురిలో ఇసుక రీచ్‌లు మాయమైంది నిజం కాదా? : కొప్పుల ఈశ్వర్
మంత్రి అడ్లూరికి రాజీనామా చేసే ధైర్యమే లేదు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
Jun 18, 2026 10:45 IST
కాకినాడ: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్
అటవీ శాఖ, హనుమాన్ టీం థర్మల్ డ్రోన్‌తో సెర్చింగ్
రాత్రి వేళల్లో కూడా విస్తృతంగా గాలింపు
థర్మల్ డ్రోన్స్ ద్వారా అటవీ జంతువుల కదలికలపై నిఘా
-
Jun 18, 2026 10:40 IST
ఢిల్లీ: ఉద్ధవ్ సేన పార్టీ ఎంపీలకు విప్ జారీ
సమావేశానికి UBT ఎంపీలు హాజరుకావాలని ఆదేశం
ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసిన UBT
ఉద్ధవ్ సేన ఎంపీలను బీజేపీ కొనుగోలు చేస్తోందని ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణ
ఉద్ధవ్ సేన ఎంపీలకు లంచం ఎర వేశారంటున్న సంజయ్ రౌత్
-
Jun 18, 2026 10:35 IST
హైదరాబాద్: రెస్టారెంట్లు, హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని లా పినోజ్ పిజ్జా సెంటర్‌లో అధికారుల తనిఖీలు
రెస్టారెంట్‌లో భారీగా బొద్దింకల గుర్తింపు
గడువు ముగిసిన మసాలాలు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ ఉత్పత్తుల గుర్తింపు
లేబుల్స్ లేకుండా ఆహార పదార్థాల నిల్వ, ఫ్రీజర్ నిండా పురుగులు
-
Jun 18, 2026 10:30 IST
తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ఆర్లేకర్ ప్రసంగం
మార్పులు చేయకుండానే గవర్నర్ ప్రసంగం
తమిళనాడుపై కేంద్రం వివక్ష చూపిస్తోంది: గవర్నర్
తమిళనాడుకు నిధులు ఇవ్వడం లేదు: గవర్నర్
తమిళనాడుకు జరుగుతున్న అన్యాయంపై త్వరలో శ్వేతపత్రం విడుదల: గవర్నర్ ఆర్లేకర్
-
Jun 18, 2026 10:25 IST
మహబూబాబాద్ : గూడూరు మండలం సోమలతండాలో దారుణం
భర్తను బండరాయితో తలపై కొట్టి చంపిన భార్య
భర్త లాలు నిత్యం మద్యం సేవించి వేధిస్తుండడంతో చంపిన భార్య విజయ
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 18, 2026 10:20 IST
ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
శాఖలవారీగా పవన్ కల్యాణ్ సమీక్ష
-
Jun 18, 2026 10:15 IST
విజయవాడ: రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై విచారణాధికారి నియామకం
విచారణాధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నియామకం
కృష్ణలంక పీఎస్‌లో సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణతో ప్రభుత్వం విచారణకు ఆదేశం
నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్
-
Jun 18, 2026 10:10 IST
ఖతార్ ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్
1,000 మంది ఫిఫా ప్రపంచకప్ వీక్షించేందుకు ఖర్చులు భరించనున్న ప్రభుత్వం
కెనడాతో జరిగే మ్యాచ్‌కు ఛార్టర్ విమానాల్లో వాంకోవర్‌కు అభిమానులు
విమానాలను అద్దెకు తీసుకున్న ఖతార్ ప్రభుత్వం
-
Jun 18, 2026 10:00 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం పసిడి ధరలు ఇవీ
క్రితం ముగింపుతో పోలిస్తే స్థిరంగా పసిడి ధరలు
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,51,100
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,38,500
-
Jun 18, 2026 09:50 IST
కడప : ప్రొద్దుటూరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
అనిల్ అనే వ్యక్తి నుంచి 3.5 కేజీల గంజాయి స్వాధీనం
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 18, 2026 09:48 IST
మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఎదురెదురుగా ఢీకొన్న లారీ, కారు
తుర్కపల్లి - మురహరిపల్లి వద్ద ప్రమాదం
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు
-
Jun 18, 2026 09:35 IST
ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు భద్రతా ముప్పును తొలగిస్తుంది: ట్రంప్
'బీబీ ఆలోచించు .. నీకు అత్యుత్తమ ఒప్పందమే దక్కింది' అని నెతన్యాహుతో చెప్పిన ట్రంప్
ఇరాన్ అణు దాడి ముప్పు నుంచి ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పిస్తుందని ట్రంప్ వెల్లడి
ఒప్పందంపై సంతకం చేసే ముందు నెతన్యాహుతో జరిగిన సంభాషణ వివరాలను వెల్లడించిన ట్రంప్
-
Jun 18, 2026 09:33 IST
ఇది ఆరంభమే.. ఇంకా ముగిసిపోలేదు: రొనాల్డో
పోర్చుగల్-డీఆర్ కాంగో మ్యాచ్ 1-1తో డ్రా కావడంతో విమర్శలు
విజయం కోసం రొనాల్డో పెద్దగా ప్రయత్నించలేదని కాంగో మిడ్‌ఫీల్డర్ ముకావు కామెంట్స్
విమర్శల నేపథ్యంలో సోషల్ మీడియాలో స్పందించిన రొనాల్డో
టోర్నీ ఇంకా కొనసాగుతోందని, జట్టు లక్ష్యంపై దృష్టి ఉందని సంకేతాలు
అభిమానుల్లో చర్చనీయాంశంగా మారిన రొనాల్డో వ్యాఖ్యలు
-
Jun 18, 2026 09:30 IST
నేటినుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
Jun 18, 2026 09:28 IST
నేడు ఢిల్లీకి టీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
మధ్యాహ్నం బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌తో రాంచందర్‌రావు భేటీ
తెలంగాణ రాష్ట్ర కమిటీలోకి మరో నలుగురిని తీసుకునే అంశంపై చర్చ
-
Jun 18, 2026 09:25 IST
నేడు హైదరాబాద్ బేగంపేటలో కేటీఆర్ పర్యటన
విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్ పంపిణీ చేయనున్న కేటీఆర్
-
Jun 18, 2026 09:20 IST
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్: నేడు స్కాట్లాండ్ Vs వెస్టిండీస్
లీడ్స్‌లో రాత్రి 11 గంటలకు మ్యాచ్
-
Jun 18, 2026 09:17 IST
ఢిల్లీలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు
రషీద్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు
నిందితుల నుంచి ఆయుధాల స్వాధీనం
-
Jun 18, 2026 09:08 IST
మహారాష్ట్ర మహిళ బలవంతపు మతమార్పిడి కేసు.. మరో వ్యక్తి అరెస్టు
మధ్యప్రదేశ్‌లో హజ్రత్ మౌలానాను అరెస్టు చేసిన పోలీసులు
ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు అయాజ్
నిందితులు లైంగిక దాడి, బలవంతపు మతమార్పిడికి పాల్పడ్డారన్న మహిళ
-
Jun 18, 2026 08:15 IST
స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్
ఇరాన్‌పై దాడుల్లో 175 మందికిపైగా ఇరాన్ విద్యార్థులు, టీచర్ల మృతి
యుద్ధం తొలి రోజునే వెలుగుచూసిన దారుణం
ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
స్కూల్‌పై ఎవరూ కావాలని దాడి చేయలేదని స్పష్టీకరణ
-
Jun 18, 2026 08:00 IST
ఫిఫా ప్రపంచ కప్ 2026: గ్రూప్-కేలో సంచలన ఫలితం
పోర్చుగల్‌కు గట్టి పోటీ ఇచ్చిన డీఆర్ కాంగో
1-1తో పోర్చుగల్, డీఆర్ కాంగో మ్యాచ్ డ్రా
1974 తర్వాత డీఆర్ కాంగో ఖాతాలో పాయింట్
-
Jun 18, 2026 07:51 IST
పల్నాడు: సత్తెనపల్లిలో మద్యం మత్తులో యువకుడి హల్‌చల్
బిల్లు అడిగినందుకు వెయిటర్‌పై దాడి
బార్‌లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన సాధిక్
మద్యం బిల్లు రూ.3వేలు అయిందని తెలిపిన వెయిటర్ హనుమంతు
డబ్బులు ఇస్తానంటూ తన వెంట తీసుకెళ్లి హనుమంతుపై సాధిక్ దాడి
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 18, 2026 07:48 IST
కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరంలో రైతు హత్య
ఆక్వా చెరువుల వద్ద హత్యకు గురైన మురమళ్లకు చెందిన దాట్ల కృష్ణంరాజు (55)
హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 18, 2026 07:37 IST
వడ్డీ రేట్లపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
పాత వడ్డీ రేట్లనే యథాతథంగా ఉంచుతూ నిర్ణయం
3.5 శాతం నుంచి 3.75 శాతం దగ్గర స్థిరంగా వడ్డీ రేట్లు
-
Jun 18, 2026 07:36 IST
తమిళనాడు: జననాయగన్ విడుదలపై మూవీ యూనిట్ క్లారిటీ
జననాయగన్ సినిమా జూన్ 26న విడుదలయ్యే ఛాన్స్
జూన్ 19 నాటికి సెన్సార్ సర్టిఫికెట్ లభించనుందన్న మూవీ యూనిట్
-
Jun 18, 2026 07:32 IST
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
MoUపై సంతకం చేసిన ట్రంప్
ఒప్పందం అమలుకు ఇది సరైన సమయం: ట్రంప్
సంతకాలు పూర్తయ్యాయని ప్రకటించిన ఇరాన్
-
Jun 18, 2026 07:31 IST
హైదరాబాద్: గుర్రంగూడ ఎకో పార్కులో నేడు వనమహోత్సవం
ప్రారంభించనున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
నాగలింగ మొక్కను నాటనున్న సీఎం రేవంత్
రూ.11.57 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనుల ప్రారంభం
రూ.6.27 కోట్లతో పర్యావరణ పరిరక్షణ పనులు
-
Jun 18, 2026 07:16 IST
హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవీ..
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,51,090
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,38,490
18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,13,310
-
Jun 18, 2026 07:10 IST
ఫిఫా ప్రపంచ కప్ 2026: ఇంగ్లండ్ ఘన విజయం
క్రొయేషియాను 4-2 తేడాతో ఓడించిన ఇంగ్లండ్
గట్టి పోటీ ఇచ్చిన క్రొయేషియా జట్టు
-
Jun 18, 2026 06:24 IST
తమిళనాడులోని కోయంబత్తూరులో విషాదం
నీట్ రీఎగ్జామ్ ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య
నీట్ రీఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న కీర్తన(19) ఆత్మహత్య
-
Jun 18, 2026 06:23 IST
అమరావతి: నేడు ప్రారంభం కానున్న ఏక్యూఏఐసీ
IBMతో కలిసి అమరావతి క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్
380 క్వాంటం ఇన్నోవేషన్ సెల్స్ ద్వారా అల్గారిథమ్స్, అప్లికేషన్ల అభివృద్ధి
క్వాంటం అప్లికేషన్ల అభివృద్ధిలో 3వేల మంది ప్రొఫెసర్లు, విద్యార్థులు
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలకం కానున్న ఏక్యూఏఐసీ
-
Jun 18, 2026 05:54 IST
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో SIPB సమావేశం
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన SIPB సమావేశం
రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపై కీలక చర్చ
పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదాలపై SIPB బోర్డు సమీక్ష
రాష్ట్రంలో పెట్టుబడుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Jun 18, 2026 05:53 IST
రేపు తెలంగాణ కేబినెట్ అనధికారిక సమావేశం
ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ
రైతు భరోసా నిధుల విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం
IRFC నుంచి మెట్రో లోన్ విడుదలలో జాప్యం.. తదుపరి చర్యలపై చర్చ
ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Jun 18, 2026 05:52 IST
తూర్పు విదర్భ–తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకూ ద్రోణి
ద్రోణి ప్రభావంతో రేపు ఏపీలో పలుచోట్ల వర్షాలు: వాతావరణ శాఖ