Share News

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:34 PM

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
AP Inter Supplementary 2026 Results

అమరావతి: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, అవసరమైన వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లో 59 శాతం మంది, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెరుగైన ఫలితాలు పొందిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు.


Also Read:

కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్‌ బెల్ట్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం మిస్టరీ.. రంగంలోకి రాజమండ్రి ఎస్పీ

Updated Date - Jun 18 , 2026 | 01:09 PM