Share News

ఉద్ధవ్ సేన పార్టీ ఎంపీలకు విప్ జారీ

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:32 AM

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్‌ సేనలో చీలిక తప్పదన్న వార్తల నడుమ పార్టీ నాయకత్వం తాజాగా ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది.

ఉద్ధవ్ సేన పార్టీ ఎంపీలకు విప్ జారీ

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్‌ సేనలో చీలిక తప్పదన్న వార్తల నడుమ పార్టీ నాయకత్వం తాజాగా ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. ఢిల్లీలో నేడు జరగనున్న పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎంపీలు హాజరు కావాలని నిర్దేశించింది. ‘పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. విప్ జారీ చేశాము. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా లేఖ రాశాము. ఎంపీల మధ్య చీలికలు తేవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశాము’ అని పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, పార్టీకి చెందిన మొత్తం ఎంపీల్లో మూడింట రెండు వంతుల మంది మద్దతు కూడగట్టేందుకు రెబల్ వర్గం ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి మద్దతు ఖరారయ్యాక లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నట్టు తెలుస్తోంది. ‘ఇందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రధాన పార్టీ నుంచి తప్పుకుని ప్రత్యేక బ్లాక్‌గా ఏర్పడే ఎంపీలు అందరూ తమ సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ రికార్డు అవుతాయి. ప్రధాన పార్టీ అభిప్రాయాలను కూడా స్పీకర్ ఈ సందర్భంగా స్వీకరిస్తారు’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఐఏఎఫ్ అధికారి భార్య బలవంతపు మతమార్పిడి కేసు.. మరో నిందితుడి అరెస్టు

జననాయగన్ విడుదలపై మూవీ యూనిట్‌ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే..

Updated Date - Jun 18 , 2026 | 12:36 PM