Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 16 , 2026 | 07:51 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 16, 2026 21:33 IST

    ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో జరిగిన సైబర్ మోసం కేసులో నిందితుడి అరెస్ట్

    • రు.10 లక్షలను ఆన్‌లైన్ ద్వారా కాజేసిన నందిగామ మం. కమ్మవారి పాలెంకు చెందిన కిలారి రోశయ్య

    • మే నెల 23న రోశయ్యపై మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

    • మైలవరం సీఐ కిశోర్ ఆధ్వర్యంలో బృందలుగా ఏర్పడి నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు

  • Jun 16, 2026 21:30 IST

    రైతు సంక్షేమంలో దేశానికే ఏపీ ఆదర్శం: మంత్రి అచ్చెన్న

    • రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించాం: అచ్చెన్నాయుడు

    • మామిడి, ఉల్లి, పొగాకు, కోకో రైతులకు రూ.588 కోట్ల సాయం

    • 22.5 లక్షల పంపుసెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్: అచ్చెన్న

    • రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: అచ్చెన్న

    • సూక్ష్మసేద్యంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్: మంత్రి అచ్చెన్న

  • Jun 16, 2026 21:21 IST

    చిన్న కాంట్రాక్టర్లకు ప్రజా ప్రభుత్వం అండ: భట్టి విక్రమార్క

    • పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లిస్తాం: భట్టి విక్రమార్క

    • భట్టి హామీతో ఈనెల 18న చలో హైదరాబాద్ వాయిదా

    • ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కాంట్రాక్టర్లు హర్షం

  • Jun 16, 2026 21:02 IST

    వైభవ్ సూర్యవంశీ వివాదం.. స్పందించిన బీసీసీఐ

    • శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం

    • సూర్యవంశీపై చర్యలుంటాయంటూ నెట్టింట చర్చపై స్పందించిన బీసీసీఐ

    • వైభవ్‌పై ఎలాంటి చర్యలు ఉండవని బీసీసీఐ స్పష్టీకరణ

  • Jun 16, 2026 20:58 IST

    దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత మోదీదే: ఎంపీ సీఎం రమేశ్

    • మరో 15 ఏళ్లపాటు ప్రధానిగా మోదీ ఉండాలి: సీఎం రమేశ్

    • ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతిస్తున్నారు: ఎంపీ

    • డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి: సీఎం రమేశ్

    • హోంమంత్రి అనితకు గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి: సీఎం రమేశ్

  • Jun 16, 2026 20:56 IST

    ఏలూరు: రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో భారీ దోపిడీ

    • రూ.కోటి చోరీకి గురైనట్లు సమాచారం, పోలీసుల దర్యాప్తు

    • మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ దోపిడీ చేసినట్లు పోలీసుల అనుమానం

    • కాలేజ్‌ పరిపాలన భవనంలోని లాకర్‌ను పగులగొట్టి నగదు తీసుకెళ్లినట్లు భావిస్తున్న పోలీసులు

  • Jun 16, 2026 20:52 IST

    హైదరాబాద్: గాంధీభవన్‌లో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

    • హాజరైన మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్‌, మాజీ MLA మైనంపల్లి

    • సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి: వివేక్

    • గ్రూప్‌లను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి: వివేక్

  • Jun 16, 2026 20:49 IST

    వైసీపీ వ్యక్తిగత దూషణలకు దిగుతోంది: మంత్రి లోకేశ్

    • మహిళా నేత, దళిత ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యలు

    • వైసీపీ నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనం: మంత్రి లోకేశ్

    • మహిళలు, దళిత సమాజానికి వైసీపీ క్షమాపణ చెప్పాలి: లోకేశ్

  • Jun 16, 2026 20:44 IST

    టీడీపీ ప్రజాప్రతినిధులతో మంత్రి లోకేష్‌ టెలికాన్ఫరెన్స్‌

    • ఈనెల 25 నుంచి 45 రోజులపాటు ఇంటింటికీ టీడీపీ నేతలు

    • కూటమి పాలన రెండేళ్ల విజయాలను వివరించనున్న నేతలు

    • వారంలో కనీసం 4 రోజులు కార్యక్రమం నిర్వహించాలి: లోకేశ్

  • Jun 16, 2026 20:33 IST

    సింగపూర్‌ నుంచి రేపు హైదరాబాద్‌ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు

    • రేపు మ.12:10 గంటలకు వెలగపూడి చేరుకోనున్న సీఎం చంద్రబాబు

    • మధ్యాహ్నం 12:20 గంటలకు ఏపీ సచివాలయానికి రానున్న సీఎం

  • Jun 16, 2026 20:29 IST

    కృష్ణా: నందివాడ మం. లక్ష్మీనరసింహపురం వద్ద బుడమేరులో గల్లంతైన బాలుడి మృతి

    • గల్లంతైన బాలుడు కిట్టు(14) మృతదేహం వెలికితీత

  • Jun 16, 2026 20:02 IST

    వైసీపీ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా నిలిపివేత

    • నాలుగైదు రోజులైనా వైసీపీ ఖాతాను పునరుద్ధరించని మెటా

    • దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఖాతాను మెటా ఈ విధంగా బ్లాక్ చేయలేదంటున్న డిజిటల్ ఎక్స్‌పర్ట్స్

  • Jun 16, 2026 19:34 IST

    రాజమండ్రి: గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనపర్తిలో నిరసన

    • హోం మంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండిస్తూ కూటమి మహిళల ఆధ్వర్యంలో నిరసన

    • అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టి నిరసన తెలిపిన మహిళలు

  • Jun 16, 2026 19:12 IST

    హైదరాబాద్: ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై అక్రమాస్తుల కేసు

    • ACB దాడుల్లో రూ.13.05 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

    • నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం

    • బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్లు, FDలో మరో రూ.5.04 కోట్ల గుర్తింపు

    • 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి స్వాధీనం

    • రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, 1.24 ఎకరాల భూమి పత్రాలు స్వాధీనం

    • కారు స్వాధీనం, మరిన్ని ఆస్తులపై కొనసాగుతున్న ACB విచారణ

  • Jun 16, 2026 19:03 IST

    అమరావతి: RRR కస్టోడియల్‌ టార్చర్‌ కేసుపై హైకోర్టు విచారణ

    • RRR మెడికల్ రిపోర్ట్స్‌ను తమ ఎదుట ఉంచాలని హైకోర్టు ఆదేశం

    • ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సుపరింటెండెంట్‌కు హైకోర్టు ఆదేశం

    • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

  • Jun 16, 2026 18:59 IST

    ఫ్రాన్స్‌: G-7 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ

    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ షేక్‌హ్యాండ్‌

    • ప్రధాని మోదీ భుజం తట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌

  • Jun 16, 2026 18:52 IST

    రంగారెడ్డి: రేపు ఆరుట్లకు సీఎం రేవంత్‌రెడ్డి

    • ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రారంభించనున్న రేవంత్‌

    • విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయనున్న సీఎం రేవంత్

    • కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా TPSలో అత్యాధునిక సౌకర్యాలు: రేవంత్

    • డిజిటల్ క్లాస్‌రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్: రేవంత్

    • విద్యార్థులకు ఉచిత బస్సు, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, సాయంత్రం స్నాక్స్: రేవంత్

    • నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య: సీఎం

    • ఇంగ్లిష్ మీడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన: సీఎం

  • Jun 16, 2026 18:40 IST

    భర్తతో విహారయాత్రకు వెళ్లిన తెలుగు యువతి మృతి

    • ముస్సోరీలోని హోమ్‌స్టే గదిలో విగతజీవిగా మారిన రాధా గాయత్రి

    • విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి, ఆమె భర్త శ్రీ చరణ్

    పూర్తి కథనం

  • Jun 16, 2026 18:15 IST

    అమరావతి: బీసీ బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం భరోసా

    • 6 ఎంజేపీ బాలికల గురుకులాలను కాలేజ్‌లుగా అప్‌గ్రేడ్

    • ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తరగతులు

    • ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ తరగతుల్లో ప్రవేశాలు

    • ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థినిలకు అవకాశం

    • నూతన కాలేజీల్లో పార్ట్‌టైమ్‌ పద్ధతిన 8 మంది అధ్యాపకులు

  • Jun 16, 2026 18:13 IST

    డిప్యూటీ సీఎం భట్టితో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ

    • పెండింగ్‌ బిల్లుల మంజూరులో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రేపు చలో సెక్రటేరియట్‌కు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ పిలుపు

    • భట్టితో భేటీ అనంతరం తమ వైఖరి చెబుతామన్న కాంట్రాక్టర్లు

  • Jun 16, 2026 18:12 IST

    TG 20 లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ

    • టైటిల్‌ స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ

    • రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరించనున్న HCA

    • ఈనెల 21 నుంచి TG 20 మ్యాచ్‌లు

    • TG 20 లీగ్‌ విజేత జట్టుకు ఒక కోటి రూపాయల బహుమతి

    • రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.50 లక్షల బహుమతి

  • Jun 16, 2026 18:10 IST

    తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన విజయ్‌ ప్రభుత్వం

    • రాష్ట్ర మొత్తం ఆర్థిక భారం రూ.13.18 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడి

    • రాష్ట్ర ప్రత్యక్ష రుణభారం సుమారు రూ.10 లక్షల కోట్లుగా పేర్కొన్న ప్రభుత్వం

    • ఆర్థిక నిర్వహణ, అప్పుల స్థితిగతులపై శ్వేతపత్రంలో వెల్లడి

    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో చర్చ

    • భవిష్యత్తు ఆర్థిక వ్యూహాలపై ప్రభుత్వం దృష్టి

  • Jun 16, 2026 18:09 IST

    జగన్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది: మంత్రి నారా లోకేశ్

    • బీసీలపై గొడ్డలి పార్టీ కక్షగట్టింది: మంత్రి నారా లోకేశ్

    • అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి నారా లోకేశ్

    • జగన్ హయాంలో బీసీలపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారు: మంత్రి నారా లోకేశ్

  • Jun 16, 2026 18:06 IST

    ఇజ్రాయెల్‌ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌

    • తాను లేకుంటే ఇజ్రాయెల్‌ ఉండేది కాదని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు

    • జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్‌ పర్యటనలో ట్రంప్‌

    • ఖతార్‌ ఎమిర్‌తో సమావేశం సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యలు

    • ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుపై మరోసారి స్పష్టత

    • ట్రంప్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం

  • Jun 16, 2026 18:05 IST

    జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

    • ప్రపంచ నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించనున్న భారత ప్రధాని

    • కెనడా, యూకే, యూఏఈ నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్న మోదీ

  • Jun 16, 2026 17:53 IST

    కృష్ణాజిల్లా: నందివాడ మం. లక్ష్మీనరసింహపురం వద్ద బుడమేరులో 14 ఏళ్ల బాలుడి గల్లంతు

    • బుడమేరులో సరదాగా ఈతకు దిగిన ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ముగ్గురు బాలురు

    • బుడమేరు ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడు తలారి కిట్టు(14)

    • మరో ఇద్దరు బాలురు బన్నీ, డేవిడ్‌లను ప్రవాహం నుంచి కాపాడిన బంధువులు

    • పోలుకొండ గ్రామంలో వివాహ వేడుకకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన

    • బాలుడి ఆచూకీ కోసం ఘటనా స్థలంలో పోలీస్ బృందాల గాలింపు

  • Jun 16, 2026 17:48 IST

    సంగారెడ్డి: ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం కలిగిన దేశం భారత్: TPCC చీఫ్

    • 2002లో SIR ప్రక్రియ పారదర్శకంగా జరిగింది: TPCC చీఫ్ మహేశ్ కుమార్

    • ఇప్పుడు జరుగుతున్న SIR ప్రక్రియ మాత్రం వాళ్లకు గిట్టని ఓట్లను తొలగిస్తోంది: మహేశ్ కుమార్

    • మతతత్వ పార్టీలకు ప్రయోజనం చేకూరేలా SIR ప్రక్రియ నిర్వహించే కుట్ర జరుగుతోంది: మహేశ్ కుమార్

  • Jun 16, 2026 17:43 IST

    ఈనెల 21 నుంచి TPCC చీఫ్ మహేశ్ కుమార్, AICC ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ నియోజకవర్గాల పర్యటనలు

    • SIRపై బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న టీపీసీసీ అగ్ర నేతలు

    • 21న మక్తల్ నియోజక వర్గం, 23న ఆందోల్ నియోజకవర్గంలో SIRపై కార్యక్రమాలు

  • Jun 16, 2026 17:27 IST

    ఫిఫా ప్రపంచ కప్: భారత సంతతి ఆటగాడి అరుదైన ఘనత

    • ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో భారత సంతతి ప్లేయర్ సర్‌ప్రీత్ సింగ్

    • న్యూజిలాండ్ తరఫున బరిలోకి దిగిన సర్‌ప్రీత్

    • తుది జట్టులో చోటు దక్కించుకున్న తొలి భారత సంతతి ప్లేయర్‌గా రికార్డు

    • సర్‌ప్రీత్ తల్లిదండ్రుల స్వస్థలం పంజాబ్

  • Jun 16, 2026 17:10 IST

    హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సవాల్‌

    • రూ.2 వేల కోట్ల స్కాం జరిగిందని హరీశ్ ఆరోపిస్తున్నారు: అడ్లూరి

    • హరీశ్ ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాను: అడ్లూరి

    • హరీశ్ చెప్పేది నిజమని నిరూపిస్తే అక్కడే రాజీనామా చేస్తాను: అడ్లూరి

    • టెండర్లపై సీఎం రేవంత్ ముగ్గురు మంత్రులతో సమీక్ష నిర్వహించారు: అడ్లూరి

    • రేవంత్ ప్రభుత్వంలో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంది: అడ్లూరి

    • గత ప్రభుత్వ పాపాలను కడుక్కుంటూ వస్తున్నాం: అడ్లూరి

  • Jun 16, 2026 17:09 IST

    ఫ్రాన్స్‌: G-7 సమావేశాల్లో రేపు మోదీ, ట్రంప్‌ ద్వైపాక్షిక భేటీ

    • రేపు సాయంత్రం 6:15 గంటలకు మోదీ, ట్రంప్‌ సమావేశం

    • ఇరుదేశాల మధ్య వాణిజ్య అంశాలపై చర్చించే అవకాశం

    • 16 నెలల తర్వాత సమావేశంకానున్న ఇరువురు నేతలు

  • Jun 16, 2026 17:05 IST

    ఎల్ఓసీ సమీపంలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులకు గాయాలు

    • జమ్మూకశ్మీర్ రజౌరి జిల్లాలో ఘటన

    • రోజువారీ పెట్రోలింగ్ సమయంలో పేలిన గ్రనేడ్

    • గాయపడిన వారిలో ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి

    పూర్తి కథనం

  • Jun 16, 2026 17:00 IST

    ఆసిఫాబాద్‌: ప్రాణహిత ప్రాజెక్టును పరిశీలించిన TRS చీఫ్‌ కవిత

    • ఐదుగురు సీఎంలు మారినా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం కాలేదు: కవిత

    • సీఎం రేవంత్ అనవసర పంచాయతీలు పెడుతున్నారు: కవిత

    • మహారాష్ట్ర సీఎం ఫోన్‌ తీయడంలేదని అపాయింట్మెంట్‌ ఇవ్వట్లేదన్న వంకతో జాప్యం చేస్తున్నారు: కవిత

    • గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం బ్యారేజ్‌ నిర్మించాలి: కవిత

  • Jun 16, 2026 16:59 IST

    వింబుల్డన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ రీఎంట్రీ

    • నాలుగేళ్ల విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడనున్న సెరెనా విలియమ్స్

    • సోదరి వీనస్‌తో వింబుల్డన్ బరిలోకి దిగనున్న సెరెనా

    • మహిళల డబుల్స్ వైల్డ్ కార్డ్ జాబితాలో సెరెనా-వీనస్ జోడీకి చోటు

  • Jun 16, 2026 16:59 IST

    హైదరాబాద్‌: మూసాపేట్‌లో అదుపులోకి వచ్చిన మంటలు

    • అగ్నిప్రమాదంలో 60 బ్యాటరీ బైక్‌ల దగ్ధం

    • 8 నెలలుగా మూసిఉన్న గోదాంలో ప్రమాదం

  • Jun 16, 2026 16:57 IST

    ములుగు: ఘనపురంలో ఆదివాసీలు వర్సెస్ గిరిజనేతరులు

    • 1/70 యాక్ట్ ప్రకారం 209 సర్వే నంబర్ భూములు తమకే చెందుతాయంటున్న ఆదివాసీలు

    • తమ దగ్గర పట్టాదారు పాస్‌బుక్కులు ఉన్నాయంటున్న గిరిజనేతరులు

    • గిరిజనేతరుల నిరసనను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

  • Jun 16, 2026 16:39 IST

    గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్పందన

    • మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: రాయపాటి శైలజ

    • మహిళలను అవమానించేలా మాట్లాడటం సమర్థనీయం కాదు: శైలజ

    • రాజకీయ విభేదాలు ఉంటే విధానాలపై చర్చించాలి: రాయపాటి శైలజ

    పూర్తి కథనం

  • Jun 16, 2026 16:36 IST

    అమరావతి: విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష

    • జులై మూడో వారంలో తల్లికి వందనం

    • ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు

    • జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహణ

    • రాష్ట్రానికి NCC యూనిట్ మంజూరు: మంత్రి లోకేశ్

  • Jun 16, 2026 16:32 IST

    సింగపూర్‌లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

    • సింగపూర్‌లో ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

    • 'కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్' అంశంపై చంద్రబాబు ప్రసంగం

    • అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నాం: చంద్రబాబు

    • పీపుల్ ఫస్ట్ మా విధానం: సీఎం చంద్రబాబు

  • Jun 16, 2026 16:30 IST

    రాజమండ్రి: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై రాజోలు పీఎస్‌లో ఫిర్యాదు

    • హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు

    • రాజోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య

  • Jun 16, 2026 16:25 IST

    మెట్రో అంశంలో బీజేపీపై బురదజల్లుతున్నారు: కిషన్‌రెడ్డి

    • మెట్రో ఫేజ్‌-1కు కేంద్రం రూ.1250 కోట్లు ఇచ్చింది: కిషన్‌రెడ్డి

    • దేశంలో మెట్రో 2, 3 ఫేజ్‌లకు కేంద్రం ఎలా సహకరిస్తోందో హైదరాబాద్‌కూ అంతే సహకరమందిస్తోంది: కిషన్‌రెడ్డి

    • మెట్రో ప్రాజెక్టు ఆపాలని నేనెందుకు చెబుతా?: కిషన్‌రెడ్డి

    • నేను వద్దంటే ఎక్కడా ప్రాజెక్టులు ఆగవు: కిషన్‌రెడ్డి

    • తెలంగాణ అభివృద్ధిపై మాకు చిత్తశుద్ధి ఉంది: కిషన్‌రెడ్డి

  • Jun 16, 2026 16:14 IST

    రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ: మంత్రి తుమ్మల

    • రైతులు క్యూ లైన్లలో ఉండాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

    • యాప్‌ ద్వారా ఇంటినుంచే యూరియా బుకింగ్‌ సౌకర్యం: తుమ్మల

    • స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు టోల్‌ఫ్రీ ద్వారా యూరియా బుకింగ్: తుమ్మల

  • Jun 16, 2026 16:13 IST

    హైదరాబాద్‌: మూసాపేట్‌లో భారీ అగ్నిప్రమాదం

    • ఎలక్ట్రిక్‌ వాహనాల గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

    • గోదాం పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలముకున్న పొగ

    • మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది

    పూర్తి కథనం

  • Jun 16, 2026 16:12 IST

    తమిళనాడు: AIADMK ఎమ్మెల్యే సి.విజయ్‌భాస్కర్‌ రాజీనామా

    • విజయ్‌భాస్కర్‌ రాజీనామాను ఆమోదించిన స్పీకర్‌ ప్రభాకర్‌

    • విజయ్‌భాస్కర్‌ రాజీనామాతో అసెంబ్లీలో 42కు చేరిన AIADMK బలం

  • Jun 16, 2026 16:12 IST

    మన్యం: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ

    • గొడ్డలి పార్టీ అధినేత ప్రభుత్వంపై గగ్గోలుపెడుతున్నాడు: మంత్రి అచ్చెన్నాయుడు

    • తండ్రి శవం పక్కనపెట్టి పదవి కోసం జగన్‌ ప్రయత్నించారు: అచ్చెన్నాయుడు

    • రాబోయే 25 ఏళ్లు మద్యం మీద వచ్చే ఆదాయంపైనా అప్పుచేసిన దుర్మార్గుడు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు: మంత్రి

  • Jun 16, 2026 15:51 IST

    భవానీపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలుచేసిన మమతా బెనర్జీ

    • కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేసిన టీఎంసీ అధినేత్రి

    • భవానీపూర్‌‌లో 15,105 ఓట్ల తేడాతో సువేందు అధికారి చేతిలో ఓడిన మమత

  • Jun 16, 2026 15:43 IST

    నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. పోలీసులకు మాజీ కెప్టెన్ గంగూలీ ఫిర్యాదు

    • ఓ ఫేస్‌బుక్ పేజీ నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది: సౌరభ్ గంగూలీ

    • నా పరువుకు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతోంది: గంగూలీ

  • Jun 16, 2026 15:41 IST

    లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    • 544 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 135 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Jun 16, 2026 15:31 IST

    సంగారెడ్డి: SIRపై బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం

    • హాజరైన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి రాజనర్సింహ, జగ్గారెడ్డి

    • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను: జగ్గారెడ్డి

    • కాంగ్రెస్‌ అభ్యర్థిగా నా భార్య నిర్మల పోటీ చేస్తుంది: జగ్గారెడ్డి

  • Jun 16, 2026 15:30 IST

    హైదరాబాద్: డ్రగ్స్ వినియోగదారులపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆపరేషన్

    • హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈగల్ ఫోర్స్ దాడులు

    • డ్రగ్స్‌ సేవిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్న ఈగల్‌ టీమ్

    • పట్టుబడిన వారిలో 14 మందికి గంజాయి పాజిటివ్‌: ఈగల్‌

  • Jun 16, 2026 15:30 IST

    వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల

    • వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్‌తోపాటు వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తి చేశాం: మంత్రి నిమ్మల

    • మిగతా పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

    • నిర్వాసితులకు ఈ నెలలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ: మంత్రి నిమ్మల

  • Jun 16, 2026 15:29 IST

    నీట్‌ పరీక్ష రాసేవారి కోసం RTC ప్రత్యేక చర్యలు: ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

    • హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

    • నీట్‌ పరీక్ష రాసేవారి కోసం ప్రత్యేక బస్సులు: మంత్రి మండిపల్లి

  • Jun 16, 2026 15:28 IST

    జగిత్యాల: MP అర్వింద్‌ వర్సెస్‌ MLA సంజయ్‌ కుమార్‌

    • పల్లె దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అర్వింద్‌, సంజయ్‌ అనుచరుల పోటాపోటీ నినాదాలు

    • అర్వింద్‌ కోసం రెండు గంటలపాటు వేచిచూసిన సంజయ్‌

    • MLA సంజయ్‌ను పట్టించుకోని MP అర్వింద్‌

    • కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన అర్వింద్‌

    • MLA సంజయ్‌కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా: అర్వింద్

  • Jun 16, 2026 15:21 IST

    అమరావతి: మంత్రి లోకేశ్ను కలిసిన మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్

    • క్రీడలు, యువజన అభివృద్ధి అంశాలపై చర్చ

    • క్రీడల్లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపై చర్చించాం: లోకేశ్

    • భవిష్యత్తు తరం ఛాంపియన్లను తీర్చిదిద్దడంపై చర్చ జరిగింది: లోకేశ్

    • ఏపీని ప్రపంచస్థాయి క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతాం: లోకేశ్

  • Jun 16, 2026 14:39 IST

    7 రకాల సన్న వడ్లు అందుబాటులో ఉంచాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

    • సన్న వడ్లు పండించే రైతుల డేటా సేకరించాలి: సీఎం రేవంత్‌

    • ధాన్యం దిగుబడిపై వ్యవసాయశాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలి: రేవంత్

    • వ్యవసాయశాఖలో సాంకేతికతను మరింత పెంచాలి: సీఎం రేవంత్‌

  • Jun 16, 2026 14:39 IST

    గుజరాత్ టైటాన్స్ బౌలర్ అశోక్ వర్మకు జాక్ పాట్

    • భారత-ఏ జట్టు నుంచి అశోక్ వర్మకు పిలుపు

    • యుధ్వీర్ సింగ్ స్థానంలో జట్టులోకి అశోక్

    • గాయంతో ఇబ్బంది పడుతున్న యుధ్వీర్ సింగ్

  • Jun 16, 2026 14:38 IST

    టెలిగ్రామ్‌పై నిషేధం నిరర్థకం: నిసర్గ అధికారి

    • ప్రాక్సీలతో టెలిగ్రామ్‌ను వాడే ఛాన్స్ ఉందన్న నిసర్గ

    • టెలిగ్రామ్ యాప్‌ డిజైన్‌ చేసిన తీరే ఇందుకు కారణమని వివరణ

    • సీబీఎస్ఈ ఓఎస్‌ఎమ్‌ పోర్టల్ లోపాలు కనిపెట్టి పాపులర్ అయిన నిసర్గ

  • Jun 16, 2026 14:37 IST

    హైదరాబాద్: ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు

    • నరహరి నివాసంలో రూ.1.4 కోట్లు నగదు లభ్యం: ఏసీబీ డీఎస్పీ శ్రీధర్

    • భారీ నగదు వివరాలపై నరహరిని ఆరా తీస్తున్నాం: ఏసీబీ డీఎస్పీ శ్రీధర్

    • సోదాల్లో కేజీ బంగారం లభ్యం: ఏసీబీ డీఎస్పీ శ్రీధర్

  • Jun 16, 2026 14:31 IST

    సంగారెడ్డి: పటాన్‌చెరు పరిధి ఇంద్రేశం శివారులో దారుణం

    • కాళ్ల కడియాల కోసం వృద్ధురాలు గౌరమ్మ(70) హత్య

    • వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఈ నెల 14న కేసు నమోదు

    • నిందితులు యాదయ్య, నర్సమ్మను అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jun 16, 2026 14:24 IST

    ఏపీలో రానున్న 3 గంటల్లో పలుచోట్ల వర్ష సూచన

    • శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, తూ.గో, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం

  • Jun 16, 2026 14:09 IST

    ఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి పాటిల్‌తో ముగిసిన పవన్‌ భేటీ

    • సీఆర్‌ పాటిల్‌లో అరగంటపాటు సమావేశమైన పవన్‌ కల్యాణ్‌

  • Jun 16, 2026 13:59 IST

    మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్

    • ఫిఫా ప్రపంచ కప్: రేపు తొలి మ్యాచ్ ఆడనున్న అర్జెంటీనా

    • ఈ క్రమంలో మెస్సిపై ప్రశంసలు కురిపించిన కోచ్ లియోనెల్ స్కలోని

    • మెస్సిని మైదానంలో చూడాలని ప్రపంచం కోరుకుంటోంది: స్కలోని

  • Jun 16, 2026 13:52 IST

    సిద్దిపేట: గౌరారం పీఎస్‌ దగ్గర రోడ్డు ప్రమాదం

    • ఢీకొన్న ఆటో-బైక్

    • ప్రమాదంలో ఇద్దరి మృతి, పలువురికి గాయాలు

  • Jun 16, 2026 13:46 IST

    గుర్తింపు కార్డుగా ఆధార్‌ వినియోగంపై కేంద్రం, రాష్ట్రాల స్పందన కోరిన సుప్రీంకోర్టు

    • ఆధార్‌ దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ

    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం

    • సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ వి. మోహన బెంచ్‌ ఆదేశాలు

    • ఆధార్‌ వినియోగానికి సంబంధించిన అంశాలపై వివరణ కోరిన సుప్రీంకోర్టు

    • తదుపరి విచారణను వాయిదా వేసిన ధర్మాసనం

  • Jun 16, 2026 13:43 IST

    చెన్నై: మదురైలో 17 ఏళ్ల బాలికకు తాళి కట్టిన యువకుడు

    • ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తున్న బాలికను పెళ్లి చేసుకున్న యువకుడు

    • సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ‘సింగపెణ్’ మహిళా పోలీసు బృందం

    • యువకుడిని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు

    • బాలిక వయస్సు 17 ఏళ్లేనని నిర్ధారించిన పోలీసులు

    • మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు

  • Jun 16, 2026 13:37 IST

    షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా కుటుంబంలో మరో విషాదం

    • జస్పాల్ రాణా మాతృమూర్తి శ్యామాదేవి(78) కన్నుమూత

    • అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ మృతి

    • ఈనెల 12న తీవ్ర అనారోగ్యంతో జస్పాల్ రాణా మృతి

  • Jun 16, 2026 13:29 IST

    హోర్ముజ్‌లో ప్రయాణించిన ఇరాన్‌ నౌకలు

    • అమెరికాతో ఎంవోయూ తర్వాత తొలి కీలక పరిణామం

    • దిగ్బంధనంపై పట్టు సడలించిన అమెరికా

    • ఇరాన్‌ నౌకలు హోర్ముజ్‌ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడి

  • Jun 16, 2026 13:19 IST

    బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని లూసిఫర్ హుక్కా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

    • అక్రమంగా హుక్కా సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు

    • హుక్కా సెంటర్‌లో పనిచేస్తున్న సర్ఫరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • తదుపరి విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగింత

    • ఈ హుక్కా సెంటర్‌పై గతంలోనూ పలు కేసులు నమోదు

  • Jun 16, 2026 13:15 IST

    ఎలాన్‌ మస్క్‌పై ప్రశంసలు కురిపించిన ఆనంద్‌ మహీంద్రా

    • అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల వ్యక్తి అంటూ కొనియాడిన మహీంద్రా

    • తొలి ట్రిలియనీర్‌గా అవతరించిన నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్రా స్పందన

    • మస్క్‌ విజయ ప్రయాణాన్ని ప్రశంసించిన ప్రముఖ పారిశ్రామికవేత్త

    • ఆవిష్కరణలు, దూరదృష్టితో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారని వ్యాఖ్య

  • Jun 16, 2026 13:12 IST

    ఢిల్లీ: కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

    • ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ

  • Jun 16, 2026 13:00 IST

    హైదరాబాద్: మాపై కేటీఆర్, హరీష్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    • బట్ట కాల్చి మీద వేస్తే మేం కాలిపోతాం అనుకుంటున్నారు: కోమటిరెడ్డి

  • Jun 16, 2026 12:59 IST

    అమెరికాను విడిచిపెట్టాలని మాకు ఆదేశాలు వచ్చాయి: ఇరాన్ కోచ్

    • న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-2తో డ్రా చేసుకున్న ఇరాన్

    • ఈ టోర్నీలో మా జట్టు అణచివేతకు గురవుతోంది: ఇరాన్ కోచ్ అమీర్

    • విశ్రాంతి తీసుకునేందుకు సమయం ఇవ్వలేదు: అమీర్

    • జూన్ 22న బెల్జియంతో తలపడనున్న ఇరాన్

  • Jun 16, 2026 12:54 IST

    విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే ప్రత్యేక పట్టుచీర సమర్పణ

    • కేవలం 200 గ్రాముల బరువుతో పట్టుచీర

    • పట్టుచీర తయారుచేసిన సిరిసిల్ల చేనేత కళారత్న నల్ల విజయ్ కుమార్

  • Jun 16, 2026 12:53 IST

    తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

    • చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించాలని కోరా: కోమటిరెడ్డి

    • గత ప్రభుత్వం R&Bలో రూ.4వేల కోట్లు బకాయిలు పెట్టింది: కోమటిరెడ్డి

    • యాదగిరిగుట్ట నిర్మించామని గొప్పలు చెబుతున్నారు: కోమటిరెడ్డి

    • రూ.350కోట్ల యాదగిరిగుట్ట బిల్లులు కూడా బకాయి పెట్టారు: కోమటిరెడ్డి

    • సీఎంతో మాట్లాడి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చా: మంత్రి కోమటిరెడ్డి

  • Jun 16, 2026 12:51 IST

    తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం

    • రూ.75వేల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు

    • రూ.75వేలు పైబడిన రుణాల్లో రూ.35వేలు మాఫీ

  • Jun 16, 2026 12:50 IST

    వలసలను విమర్శిస్తూ ట్రూత్‌లో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్

    • పేద దేశాల ప్రజలు వస్తే.. మనమూ పేదలమవుతాం: ట్రంప్

  • Jun 16, 2026 12:49 IST

    దగ్గు సిరప్‌ల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

    • కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ

    • సిరప్‌‌లలో నాణ్యతా లోపాలు బయటపడటంతో కేంద్రం అప్రమత్తం

    • డ్రగ్స్ రూల్స్-1945 ప్రకారం తాజా మార్గదర్శకాలు జారీ

  • Jun 16, 2026 12:42 IST

    ఐరాస విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ ఆగ్రహం

    • సంస్కరణల నివేదిక పూర్తిగా పక్షపాతమంటూ మండిపాటు

    • వివిధ దేశాల అభిప్రాయాలను తప్పుగా చూపించారని ఆగ్రహం

    • శాశ్వత సభ్యత్వానికి ఉన్న భారీ ప్రపంచ మద్దతును దాచారని విమర్శ

    • సోమవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడిన హరీష్ పర్వతనేని

  • Jun 16, 2026 12:41 IST

    ఆసియా కప్ ఫెన్సింగ్ పోటీలకు తొలిసారి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్

    • ఈనెల 19 నుంచి 24 వరకు ఢిల్లీలో పోటీలు

  • Jun 16, 2026 12:04 IST

    విజయనగరం: మంత్రి సంధ్యారాణికి స్వల్ప అస్వస్థత

    • నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక

  • Jun 16, 2026 12:00 IST

    అంబేడ్కర్ కోనసీమ: అమలాపురం ధర్నాచౌక్ వద్ద ఆక్వా రైతుల ధర్నా

    • రొయ్య రేట్లు పెంచాలి, మేత ధరలు తగ్గించాలంటూ ఆందోళన

    • ధర్నాచౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ

    • జిల్లా వ్యాప్తంగా కదిలి వచ్చిన వందలాది మంది ఆక్వా రైతులు

    • కలెక్టర్‌ని కలిసేందుకు కలెక్టర్ కార్యాలయం వద్ద వేచి ఉన్న ఆక్వా రైతులు

  • Jun 16, 2026 11:49 IST

    రేపు వరంగల్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • హనుమకొండలో ఓ బాలుడిని పరామర్శించనున్న పవన్

    • ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్

    • బాలుడి కోరిక మేరకు అతని ఇంటికి వెళ్లనున్న పవన్ కల్యాణ్

  • Jun 16, 2026 11:48 IST

    హైదరాబాద్‌: US కాన్సులేట్ రోడ్డుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పేరు

    • ఈనెల 23న రోడ్డును ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • తెలంగాణ-US వాణిజ్య సంబంధాలకు ప్రతీకగా ట్రంప్ పేరు

  • Jun 16, 2026 11:47 IST

    నిర్మల్: మైసంపేట శివారులో గిరిజనుల ఆందోళన

    • టైగర్ జోన్ నిర్వాసితుల భూములకు హద్దులు చూపిస్తుండగా అటవీ శాఖ అధికారులను అడ్డుకున్న గిరిజనులు

    • తమకు భూములు కేటాయించిన తర్వాతే హద్దులు చూపించాలని నిరసన

    • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jun 16, 2026 11:47 IST

    కొమురంభీం: కెరమెరి మండలం సుర్దాపూర్‌లో పోడు రగడ

    • రైతులను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు

    • రైతులు, అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం

  • Jun 16, 2026 11:39 IST

    సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు

    • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అత్యుత్తమం: సీఎం చంద్రబాబు

    • 30 రోజుల్లో ఏపీకి వచ్చి పరిశీలించాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం

    • సింగపూర్‌లో సెమీకండక్టర్లపై ‘సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సు’లో సీఎం చంద్రబాబు

  • Jun 16, 2026 11:35 IST

    నెల్లూరు: గుడివాడ అమర్‌నాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి

    • హోంమంత్రి అనితపై మాజీమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం

    • వ్యక్తిత్వ హననం చేయడం సరికాదు

    • వైసీపీ నేతలు నేరుగా ఎదుర్కోలేకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు: ఎమ్మెల్యే ప్రశాంతి

  • Jun 16, 2026 11:33 IST

    కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కామెంట్స్..

    • తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

    • మెట్రో ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డికి లేదు

    • అర్థం లేని ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు

    • కాంగ్రెస్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు

    • ‘సర్’ విషయంలో కాంగ్రెస్ గందరగోళం చేస్తోంది

  • Jun 16, 2026 11:30 IST

    పాకిస్థాన్‌లో విషాదం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక మృతి

    • బాలిక ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపిన పాక్‌ పోలీసులు

    • ఘటనలో బాలిక కుటుంబ సభ్యులు ఇద్దరికి తీవ్ర గాయాలు

    • కారులో సాయుధ దొంగలు ఉన్నారనే అనుమానంతో కాల్పులు జరిపినట్లు సమాచారం

    • ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

    • పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

  • Jun 16, 2026 11:28 IST

    నేషన్స్‌ కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్

    • సెమీస్‌లోకి భారత్

    • 2-1 తేడాతో జపాన్‌పై గెలిచిన భారత్

  • Jun 16, 2026 11:24 IST

    కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

    • మావోయిస్టులు చివరికి సాధించింది ఏంటి?

    • తుపాకులతో అమాయకులు, మైనర్లు ప్రాణాలు కోల్పోయారు

    • చివరికి మావోయిస్టు సంస్థ నిషేధానికి గురయ్యేలా చేశారు

    • తుపాకులతో ఏం సాధించలేమని మావోయిస్టు అగ్రనేతలు గుర్తించారు

    • కేంద్రానికి సహకరించి చాలా మంది లొంగిపోయారు

    • ఎవరికైనా మావోయిస్టు భావజాలంతో ఏదైనా సాధిద్దామనే ఆలోచన ఉంటే విరమించుకోవాలి

  • Jun 16, 2026 11:23 IST

    హైదరాబాద్: మణికొండలో క్షుద్రపూజల కలకలం

    • ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు

    • ఎదురింటి వారే క్షుద్రపూజలు చేశారని ఆరోపణ

    • రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం

    • మహిళ కళ్లలో కారంపొడి చల్లిన మరో మహిళ

    • పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు

  • Jun 16, 2026 11:22 IST

    సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

    • CBN@361 Degrees –Polymath పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

    • కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ

    • పుస్తకాన్ని రచించిన ‘రేపటికోసం’ చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్

  • Jun 16, 2026 11:21 IST

    రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్

    • హోంమంత్రి అనితపై మాజీమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరం: పవన్

    • కట్టూబొట్టుపై వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే: పవన్

    • మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి: పవన్

  • Jun 16, 2026 11:20 IST

    ఢిల్లీ: కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

    • ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ

  • Jun 16, 2026 10:44 IST

    ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం

    • మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం

    • ది ఆర్డర్ ఆఫ్ దివైట్ డబుల్ క్రాస్‌ అవార్డు ప్రదానం

    • అవార్డును ప్రదానం చేసిన స్లోవేకియా అధ్యక్షుడు పీటర్

    • ఇప్పటివరకు 33 పురస్కారాలు దక్కించుకున్న మోదీ

    • భారత్-స్లోవేకియా స్నేహబంధానికి ఈ పురస్కారం అంకితం: ప్రధాని మోదీ

    • ఈ అవార్డు భారతీయులకు దక్కిన గౌరవం: ప్రధాని మోదీ

  • Jun 16, 2026 10:43 IST

    ఢిల్లీ: జనసేనలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు

    • 14 మంది సభ్యులతో ఏపీ జనసేన కమిటీ ఏర్పాటు

    • త్వరలో ఏపీ తరహాలోనే తెలంగాణలో జాయినింగ్స్ కమిటీ: పవన్ కల్యాణ్

  • Jun 16, 2026 10:40 IST

    నీట్ రీఎగ్జామ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

    • టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం తాత్కాలిక ఆంక్షలు

    • ఈనెల 22 వరకు టెలిగ్రామ్ యాప్‌ యాక్సెస్‌పై నియంత్రణ

    • నీట్ పరీక్ష సురక్షితంగా నిర్వహించేందుకు NTA సిఫార్సుతో నిర్ణయం

  • Jun 16, 2026 10:39 IST

    హైదరాబాద్‌లో మరోసారి ACB దాడులు

    • ల్యాండ్ & సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు

    • నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లు సహా 13 చోట్ల తనిఖీలు

    • భారీగా అక్రమాస్తులు గుర్తించిన ACB అధికారులు

    • రూ.1.10కోట్లు, ల్యాండ్ డాక్యుమెంట్స్, బంగారం స్వాధీనం

    • నరహరి సోదరుడి ఇంట్లోనూ భారీగా ఆస్తులు గుర్తింపు

    • గతంలో రంగారెడ్డి జిల్లాకు ADగా పనిచేసిన కొంకరి నరహరి

  • Jun 16, 2026 10:39 IST

    తగ్గిన బంగారం ధరలు..

    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 160 రూపాయలు

    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 150 రూపాయలు

    • 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 120 రూపాయల తగ్గుదల

  • Jun 16, 2026 10:38 IST

    కుప్పకూలిన రష్యన్ Tu-22M3 యుద్ధ విమానం

    • ఫ్లైట్ ట్రైనింగ్ సందర్భంగా ఘటన

    • సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో కుప్పకూలిన విమానం

  • Jun 16, 2026 10:25 IST

    ఫిఫా ప్రపంచ కప్ 2026: ఇరాన్, న్యూజిలాండ్ మ్యాచ్ డ్రా

    • 2-2తో డ్రాగా ముగిసిన ఇరాన్, కివీస్ మ్యాచ్

    • హోరాహోరీగా సాగిన ఇరాన్ న్యూజిలాండ్ మ్యాచ్

  • Jun 16, 2026 10:16 IST

    వైభవ్ సూర్యవంశీని హేళన చేసిన శ్రీలంక ప్లేయర్

    • 'ఇంటికి వెళ్లిపో..' అంటూ కామెంట్స్ చేసిన లంక ప్లేయర్

    • భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల గొడవకు కారణం ఇదేనని సమాచారం

    • క్షమాపణలు చెప్పేందుకు శ్రీలంక సిద్ధమైనట్లు టాక్

  • Jun 16, 2026 10:11 IST

    అఫ్గానిస్థాన్‌లో ఒంటరిగా భారత మహిళ టూర్!

    • తాను క్షేమంగానే ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు

    • అక్కడి ప్రజల స్నేహశీలత, ఆతిథ్యం తనను కట్టిపడేశాయన్న మహిళ

    • యుద్ధాలు మిగిల్చిన విషాదం వారి కళ్లల్లో కనిపించిందని వ్యాఖ్య

  • Jun 16, 2026 10:10 IST

    ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

    • డిగ్రీలు, ఎంబీయేలతో సుస్థిర ఉపాధి లభించదని స్పష్టీకరణ

    • వొకేషనల్ కోర్సులతో భవిష్యత్తు భరోసా అని వ్యాఖ్య

    • సంప్రదాయక మార్గాలపై పునరాలోచించుకోవాలని యువతకు సూచన

  • Jun 16, 2026 10:09 IST

    విజయవాడ: ఫేస్‌బుక్‌లో మాజీ ఎంపీ కేశినేని నాని మరో పోస్ట్

    • పిట్టల దొర ప్రెస్‌మీట్ పెట్టి నాపై పిట్ట కథలు బాగా చెప్పారు: కేశినేని నాని

    • నా అప్పులు, ఆస్తుల, ఆదాయం, బ్యాంక్ అకౌంట్ల గురించి చెప్పారు: కేశినేని నాని

    • నాపై ప్రధాని, కేంద్ర హోంమంత్రి, CBI, EDకి ఫిర్యాదులు చేయకుండా గల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి నాపై విమర్శలు చేయడమేంటి?: కేశినేని నాని

    • నీ తప్పుడు కథలు ప్రజలు నమ్మరు: కేశినేని నాని

  • Jun 16, 2026 10:07 IST

    ఇండోనేషియాలో భూకంపం

    • రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదు

  • Jun 16, 2026 09:51 IST

    మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్ట్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు

    • దోర్నాల మండలం కొత్తూరు దగ్గర ప్రాజెక్ట్ పనులు పరిశీలన

  • Jun 16, 2026 09:51 IST

    విజయవాడ: స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి

    • వాజ్‌పేయి పార్కులో మొక్కలు నాటిన ప్రహ్లాద్‌ జోషి

  • Jun 16, 2026 09:49 IST

    మన్యం: మక్కువ మండలంలో ఏనుగుల సంచారం

    • సిబిలి పెద్దవలస, కాముడువలసలో సంచరిస్తున్న ఏనుగులు

    • పామాయిల్ తోట, మోటార్లు ధ్వంసం చేసిన ఏనుగులు

    • ఈనెల 13న ఒడిషా వైపు వెళ్లిన ఏనుగుల గుంపు

    • మళ్లీ ఒడిషా నుంచి సాలూరు మండలానికి చేరిన ఏనుగులు

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీ అధికారులు

  • Jun 16, 2026 09:47 IST

    నల్లగొండ: నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం

    • జిందాల్ కంపెనీ సమీపంలో బైక్‌ను ఢీకొట్టిన కారు

    • ప్రమాదంలో బైకర్ మృతి

    • మృతుడు ఏపీ లింగోటం గ్రామ వాసి పల్లగొర్ల లింగయ్యగా గుర్తింపు

  • Jun 16, 2026 08:42 IST

    మంచిర్యాల: మావోయిస్టులపై కవిత ఆసక్తికర కామెంట్స్

    • అడవిలో అన్నలు ఉంటే అప్పట్లో మనకు ఇక్కడ గుండె ధైర్యం ఉండేది

    • సింగరేణి అధికారులు పద్ధతిగా పని చేసేవారు

    • అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కు లేదని సింగరేణి యాజమాన్యం అనుకుంటోంది

    • కానీ అడవిలో అన్నలు అందరూ ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు

    • కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే వెంటాడుతాం

  • Jun 16, 2026 08:41 IST

    అవన్నీ ఫేక్ న్యూస్: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

    • డీల్ కోసం ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లు ఇవ్వలేదన్న ట్రంప్

    • డెమోక్రాట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ

    • అణ్వాయుధ లక్ష్యాన్ని ఇరాన్‌ శాశ్వతంగా వదులుకుందని పోస్టు

  • Jun 16, 2026 07:57 IST

    ఏపీకి ప్రత్యేక NCC డైరెక్టరేట్‌ మంజూరు

    • దేశంలో 19కి పెరిగిన NCC డైరెక్టరేట్‌ల సంఖ్య

    • రాష్ట్ర విద్యాసంస్థల్లో NCC విస్తరణకు అవకాశం

  • Jun 16, 2026 07:57 IST

    ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • నేడు కేంద్రమంత్రులతో వరుస భేటీలు

  • Jun 16, 2026 07:56 IST

    నేడు తెలంగాణలో ఉక్కపోతతో కూడిన వాతావరణం

    • 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

    • సాయంత్రం ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు

    • హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్ష సూచన

    • ఈ నెల 17 వరకు తెలంగాణలో ఎల్లో అలర్ట్‌ జారీ

    • 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం: IMD

  • Jun 16, 2026 07:56 IST

    ఏపీ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు

    • నేడు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు

    • ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు

    • కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

    • ఎండ ప్రభావం కూడా ఉండొచ్చని హెచ్చరిక

  • Jun 16, 2026 07:54 IST

    నేటి నుంచి ఈవియన్‌లో 52వ జీ-7 సదస్సు

    • రెండు రోజుల పాటు జరగనున్న జీ-7 సదస్సు

    • ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకానున్న ప్రధాని మోదీ

  • Jun 16, 2026 07:53 IST

    సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బృందం పర్యటన

    • నేడు వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు

    • సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను సందర్శించనున్న సీఎం

    • ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ భేటీ

    • 'సీట్రియం' ప్రతినిధులతో గ్రీన్‌ఎనర్జీ, మెరైన్ రంగాలపై సీఎం చర్చ

    • సింగపూర్ ఉపప్రధాని కిమ్‌ యాంగ్‌తో భేటీకానున్న సీఎం చంద్రబాబు

  • Jun 16, 2026 07:51 IST

    అమెరికా: కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం

    • ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో B-52 బాంబర్ క్రాష్

    • టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన B-52 బాంబర్

    • ప్రమాదంలో 8 మంది మృతి

    • మృతుల్లో మిలిటరీ సిబ్బంది, ప్రభుత్వ కాంట్రాక్టర్లు

    • రొటీన్ టెస్ట్ మిషన్‌లో ఉండగా జరిగిన ప్రమాదం

    • 1950 నుంచి US ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందిస్తున్న B-52